జన్మ, పునర్జన్మ,కర్మ సిద్ధాంతం ఎలా పుట్టాయి?


వేదకాలపు ప్రజలు పశుపోషణ చేసేవారు. పశువులు పెంచుకుంటూ సంచార జీవులుగా జీవనం సాగించేవారు. ఇనుమును 
క్రీ. పూ 1000 లో కనుగొన్నారు. ఇనుమును కనుగొన్న తరువాత వ్యవసాయం చేయడానికి వీలయింది. వ్యవసాయం చేస్తున్నప్పుడు 
భూమిలో విత్తనం నాటుతారు.  విత్తనం మొలకెత్తి మళ్ళీ చెట్టు గా మారి గింజలనిస్తుంది. వ్యవసాయంలో చేసే ఈ పనే వారి భావాలలో మార్పులకు దారి తీసింది. వేద కాలంలో  ప్రాణాన్ని ఆత్మ భావించారు.ఈ ఆత్మ ఇప్పుడు శరీరంలో విడిగా అస్తిత్వాన్ని సంపాదించుకుంది.
ఈ జన్మలో మనిషి చేసిన పనులను    వ్యవసాయంలో విత్తనం విత్తడం తో సమానంగా భావించారు. విత్తనం మొలకెత్తి
గింజలను ఇచ్చినట్లు ఈ జన్మలో చేసిన కర్మల
ఫలితాన్ని వచ్చే జన్మలో  అనుభవించాల్సి వస్తుందని భావించారు.
అందుకే ఈ ఆత్మ ప్రస్తుత శరీరాన్ని వదలి మరో జన్మలో మరో శరీరాన్ని ఆశ్రయిస్తుందను కున్నారు. పర్యవసానం గా  జన్మ, పునర్జన్మ సిద్ధాంతం ఉపనిషత్తుల్లో చేరింది.అదే విధంగా కర్మసిద్దాంతం కూడా. ఈ రెండు సిద్దాంతాలను వివిధ కథల ద్వారా పురాణాల ద్వారా ప్రజల్లో ప్రచారం చేసి ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకుంది  ఆధిపత్య వర్గం.మహా భారతం,రామాయణం వీటిని బలపరిచే ప్రధాన కావ్యాలు.
ఇవే నేటి సమాజాన్ని ఇప్పటికీ
శాసిస్తూనే ఉన్నాయి. పై మూలకారణం అర్థం తెలుసుకునే కొద్దీ ఈ మూఢ విశ్వాసాలు మెల్లగా పటాపంచలవుతాయి.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం