యజ్ఞయాగాదుల యజుర్వేదం
యజుర్వేదంలో శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం అని రెండు శాఖలున్నాయి. మొదటి దాంట్లో క్రతువులందు ఉపయోగపడే మంత్రాలుంటే, రెండో దాంట్లో యజ్ఞయాగాది క్రతువులను గురించి ఉన్నాయి. వీటిల్లో
గద్యరూపంలో పద్యరూపంలో వున్న వాటిని 'యజుస్" అంటారు.
యజ అంటే దేవతలను ఆరాధించడం అని అర్థం. యాగమును నెరవేర్చునది యజుర్వేదం అన్నారు. దీనిలో వున్న కవితలను 'అనువాకములు' అన్నారు. పూజలు జరిపేటప్పుడు పూజారులు చదివేవన్నీ మంత్రాలే. మొదటి ప్రపాఠకం (చాప్టరు) లో 5వ పంచాశత్తు (మంత్రం)లో ' ఓ రోలూ! ఓ రోకలీ! ఓ రాయీ ! ఓ చేటా ! ఓ బియ్యమా! ఉంగరము హస్తము నందు గల సూర్యుడు మిమ్మురక్షించుగాక ! ఇలా వుంటాయి ఆ మంత్రాలు.8వ మంత్రంలో " ఓ
పురోడాశా (రొట్టెముక్కా)! నీవు పెద్దదానివిగా విస్తీర్ణము కమ్ము! "
కృష్ణ యజుర్వేదంలోని 406 (6-9-10) మంత్రంలో 'అశ్వమా ! లోకము దృష్టికి నీవు చంపబడినదానవు అగుచున్నావు, వాస్తవముగా నీకు మరణములేదు. నీవు హింసింపబడుటలేదు. నీవు చక్కని మార్గమున దేవతలకు చేరుచున్నావు. అప్పుడు నీ కొరకు హర్యములు రథమునకు కూర్చబడును. అశ్వసుందరాంగులు అందు వుందురు.
గాడిద బరువు మోసిన నీకు దివ్యాశ్శప్రాప్తి కలుగును' ఇలాంటి మంత్రాలతో సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉందన్నది నిర్వివాదాంశం.మంత్రాలతో వ్యాపారం చేసేవిరికి మాత్రం లాభమే.
వేదాల (సంహిత) అనంతరం బ్రాహ్మణాలు వచ్చినాయి. యాగంచేసేటప్పుడు అక్కడ ముఖ్యంగా ఏకార్యం జరగాలని వేదమంత్రం చెబుతుందో ఆ కార్యాన్ని నిర్వహించే విధానం అంతా చెప్పేదే బ్రాహ్మణం అని కొంత మంది నిర్వచించారు. బ్రాహ్మణాలను రెండుగా విడగొట్టారు. అవి అరణ్యాలు, ఉపనిషత్తులు.
వృద్ధాప్యంలో వానప్రస్థం స్వీకరించి అడవుల్లో నివసిస్తూ, యజ్ఞాలు చేస్తూ ధ్యానం చేసేవారి కోసం రాసిన విధానాలు అరణ్యకాలు.
ఉపనిషత్తులు సంపూర్ణ జ్ఞానాన్ని చెపుతా యంటారు. ఉపనిషత్తులు వేదాలకు చివరలో ఉన్నందున వీటిని వేదాంతం అన్నారు. ఉపనిషత్ అంటే రహస్యం అని అర్థం. మరొక అర్థం దగ్గర కూర్చొని రహస్యంగా నేర్చుకునే విద్యఅని. ఇవి 13. బ్రాహ్మణాలకు, అరణ్యాలకు ఉపనిషత్తులకు సరైన కాలాన్ని నిర్ణయించలేకపోయినా చాలా మంది
పరిశోధకులు ఇవన్నీ క్రీ.పూ. 6వ శతాబ్దానివని అన్నారు. మరికొందరు బుద్ధుని కన్నా ముందే ఉన్నాయని అన్నారు.
'వేదాంతం' శుద్ధ అబద్దం ! ఈ అబద్దాల వలన ఏ శ్రమలు చేయకుండా బతికే జనాల వర్గానికి పెద్ద పెద్ద లాభాలున్నాయి. వాళ్ల లాభాల కోసం తయారైన తత్వబోధలే ఇవన్నీ."
అని రంగనాయకమ్మ వేదలు ఏం చెప్తున్నాయి గ్రంథంలో చెపుతుంది.
శ్రమ చేసుకుంటూ కష్టాలతో, అవమానాలతో బతికే జనం తెలుసు కోవలసింది ఏమిటంటే 'మాది
శ్రామికవర్గం! మేము శ్రమదోపిడీకి గురవు తున్నాము. దీని నుంచి బయటపడాలి.దోపిడి వర్గాల మీద పోరాటం ద్వారా' అని తెలుసుకోవాలని ఆమె వారిని కోరింది.
గతకాలపు జ్ఞానం కన్నా సహజంగా వర్తమానకాలంలో జ్ఞానం అభివృద్ధి చెందుతూ వుంటుంది. పాత తప్పుల్ని సరిచేసుకుంటూ, వాటిని తిరస్కరిస్తూ కొత్త జ్ఞానం ముందుకు పోతుంది. కానీ వేదజ్ఞానం మాత్రం స్థిరమైందని, ఆ జ్ఞానమే గొప్పదని కీర్తించడం మూర్ఖత్వమని
రంగనాయకమ్మ అభిప్రాయపడింది.
Comments
Post a Comment