జ్యోతిష్యం






        రాశులను అనుసరించి చెప్పే జ్యోతిష్యాన్ని పాశ్చాత్య జ్యోతిష్యం అని,  నక్షత్రాలను అనుసరించే దాన్ని భారతీయ పద్ధతి అనీ అంటారు.
     జ్యోతిష్యాన్ని గురించి ఇక్కడే రెండు మాటలు చెప్పుకుంటే సరిపోతుంది. తొలి నాటి వ్యవసాయక సమాజంలో రుతుక్రమాన్ని తెలుసుకోవడానికి రాశుల నక్షత్రాల పరిజ్ఞానం అత్యవసరమయింది. అయితే ఈ ప్రాముఖ్యం త్వరలోనే తలకిందులయి రాశులూ నక్షత్రాలు జీవితాన్ని శాసించే శక్తులుగా భావించబడ్డాయి.    
         ఆదిమకాలంలో కార్యకారణ సంబంధాల గురించి స్పష్టత లేదు. ఆ దశలో ఒక సూచికగానో, సంకేతంగానో వున్న  ఉరుములు, మెరుపులు,ఎండ, చలి మొదలైన వాటిని హేతువుగా, కారణంగా
భ్రమించబడుతుంది. రుతుక్రమాన్ని సూచించే నక్షత్రాలు జీవితాన్ని శాసించేవి అయ్యాయి. ఈ నమ్మకం బ్రాహ్మణులకు లాభదాయకం కావడం వల్ల పెంచి పోషించబడింది. 
        జ్యోతిష్యం తప్పని ప్రయోగాత్మకంగా 
రుజువు చేయాల్సిన అవసరం లేదు. అది చరిత్రలో ఎందుకు పుట్టిందో అర్థం చేసుకోగలిగితే చాలు.దాని మీదున్న విశ్వాసానికి పునాది పోతుంది. ఇది ఒక్క జ్యోతిష్యానికే కాదు,
ఏ మూఢ విశ్వాసానికయినా వర్తిస్తుందని డి.డి.కోశాంబి చెపుతారు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం