మంత్రాల గని అధర్వణవేదం
భృగు మహర్షి శిష్యుడైన అధర్వుడు పురోహితుడు, మాంత్రికుడు కూడా. ఈ అధర్వుడు, అంగీరసులు బ్రహ్మకు పుట్టారని చెపుతారు. ఆయన తల్లిని గురించి అసలు చెప్పరు. ఈ వేదాల గురించి గొప్పగా చెప్పేవారు అధర్వ, బ్రహ్మకు పుట్టారని చెప్పడాన్ని మూఢంగా నమ్మేస్తారు. ఈ అధర్వుడు చెప్పిన మంత్రాలను అధర్వణవేదం అన్నారు. అధర్వణ వేదం మంత్రాల సముదాయం. రకరకాలైన కోరికలను తీర్చుకోవడానికి మంత్రాలు చదివేవారు.
జ్వరం తగ్గడానికి ఒక మంత్రం, తేలు విషం విరుగుడుకు ఒక మంత్రం. ఇలా ప్రతిదానికి ఒక మంత్రం చదివేవారు.
ప్రపంచంలో పలుచోట్ల ఈ మంత్రాల్లో పోలికలు ఉండటం ఆశ్చర్యం. ఉత్తర అమెరికా లోని ఇండియన్స్ లోనూ,ఆఫ్రికాలోని నీగ్రో జాతిలో, మంగోలియన్లలోమా, ఐరోపాలో వుండే పల్లెవాసుల్లో, అధర్వణ వేదంలో వున్న మంత్రాలను పోలివున్నాయి. అధర్వణ వేదంలో వున్నవన్నీ మంత్రాలే.
మూత్ర సమస్య వున్నప్పుడు ఆ జబ్బు పోవడానికి 3వ సూక్తంలో మొదటి మంత్రం ఇలా చెపుతుంది. "శరజనకుని వర్జమ్ముని శతబల సంమృతుని మేమెరుగుదము. ఓ మూత్ర రోగస్తుడా ! పృధివిపై నిషేచనతో నీ
శరీరానర్నిబద్ధమైన మూత్రం జలజల బహిర్గతమగు గాక !"జబ్బులున్నవాళ్లు ఈ మంత్రాలను పూజారులకు డబ్బుగాని దానాలు ఇచ్చి మంత్రాలు వేయించుకోవాలి. తనే స్వంతంగా చేసుకోరాదని కూడా ఈ మంత్రాలలో చెప్పినారు.
11వ సూక్తంలో సుఖప్రసవానికి ఒక మంత్రం ఉంది. 12వ సూక్తంలో శ్వాస రోగనివారణ మంత్రం ఉంది.సూక్తం 17లో రక్తస్రావం అవడానికి మంత్రం ఉంది. 23వ సూక్తంలో కుష్టురోగానికి మంత్రం ఉంది.
3వ కాండంలో 15వ సూక్తం వ్యాపారలాభం కోసం ఒక మంత్రాన్ని చెప్పినారు. 'దేవతలారా ! మీ దయతో నా లాభం బహుతరంఅగుగాక! అల్పతరం కాకుండుగాక ! లాభవిష్ణుకారులైన దేవతలను నివారించండి !" ఇలా వుంటాయి ఈ మంత్రాలు.
Comments
Post a Comment