కాలవిభజన
వేద సిద్ధాంతం
వేద కాలంనాటి కాలవిభజనలో అత్యంత సూక్ష్మమైన విభాగం ‘నిమేషం’. దీన్నే వాడుకలో ‘నిమిషం’ అన్నారు. నిమేషం అంటే రెప్పపాటు కాలం. రుగ్వేదంలో ఈ పదాన్ని కాలానికి సంకేతంగా కాకుండా ‘రెప్పపాటు లేనివారు (దేవతలు)’ అనే అర్థంలో వాడారు. మాండూక్యోపనిషత్తులో ‘కలా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః । అర్ధమాసా మాసా రుతవస్ సంవత్సరశ్చ కల్పంతాం।।’ - అంటూ కాలవిభజన గురించి చెప్పారు. మహాభారతం శాంతిపర్వంలోని ‘కాష్ఠా నిమేషా దశ పంచ చైవ....’ అనే శ్లోకం ఉంది. ఇవి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాలవిభజను దాదాపుగా సమానంగా ఉండే ప్రామాణికాలను గురించి చెబుతాయి. దీని ప్రకారం...
1 నిమేషం = రెప్పపాటు కాలం
15 నిమేషాలు = 1 కాష్ఠం
30 కాష్ఠాలు = 1 కళ
30 కళలు = 1 ముహూర్తం
30 ముహూర్తాలు = 1 దివారాత్రి (ఒక రోజు)
30 దివారాత్రులు = 1 మాసం
12 మాసాలు = 1 సంవత్సరం
మనుధర్మశాస్త్రం, అర్ధశాస్త్రంలో కూడా ఇదే రకమైన విభజన ఉంది.
సూర్య సిద్ధాంతం
ఇప్పుడు వాడుకలో ఉన్న కాలవిభజనకు సూర్య సిద్ధాంతం పరమ ప్రామాణికం. ఇది కాలాన్ని మరింత సూక్ష్మంగా వివరిస్తోంది. ‘మూర్త’, ‘అమూర్త’ అనే రెండు రకాల కాలమానాలు ఈ సిద్ధాంతంలో ఉన్నాయి. ఈ రెండూ వాటి స్వభావాన్ని ప్రకటిస్తాయి. మూర్త కాలమానంలో పేర్కొన్న కాలాంశాలను స్పష్టంగా మనం కంటితో చూడడానికి లేదా అనుభూతి చెందటానికి అవకాశం ఉంటుంది. ఇందులో అతిచిన్న ప్రమాణం ‘ప్రాణ’. పది దీర్ఘాక్షరాలు పలికే సమయాన్ని ‘ప్రాణ’ అంటారని సూర్యసిద్ధాంతం చెబుతోంది. దీన్నే ఆంగ్లంలో ‘బ్రీతింగ్ పీరియడ్’ అంటారు. అంటే ఒకసారి శ్వాస తీసుకునే సమయం. ‘ప్రాణ’ ప్రమాణం ఆధారంగా ఇతర కాలవిభాగాలను నిర్ణయించటం జరిగింది.
అమూర్త కాలమానంలో పేర్కొన్న ప్రమాణాలు అతిసూక్ష్మమైనవి. వీటిని భౌతిక దృష్టికోణంతో అనుభూతి చెందటానికి అవకాశం లేదు. ఈ కాలమానం ప్రకారం ‘త్రుటి’ అనేది అతిచిన్న ప్రమాణం. సూర్యసిద్ధాంత గ్రంథంలో త్రుటి గురించి మరే ఇతర వివరాలు లేవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన భాస్కరుడు తన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో త్రుటి అనే కాలవిభాగానికి కొన్ని వివరణలు ఇచ్చారు. దీనిప్రకారం రోజులో 2916000000 వంతు , సెకనులో 33750వ వంతు సమయం త్రుటి అవుతుంది.
ఈ సిద్ధాంతం ప్రకారం
తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
6 ప్రాణ కాలాలు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ
60 ఘడియలు = 1 అహోరాత్రం (ఒక రోజు)
ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబందించిన స్థలాల గురించి, విషయాల గురించి తెలుసు కోవాలంటే, టోలమీ వంటి గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞులుమీద, అరబ్బు వర్తకుల మీద, చైనా యాత్రికుల మీద ఆధారపడాలి. మనసాహిత్యంలో పౌరాణిక గాధలు తప్ప వేరే ఏమీ దొరుకవు. స్వయంపోషక గ్రామాల బ్రాహ్మణ మతానికి రుతు చక్రంతోనే తప్ప కాల ప్రవాహంతో ప్రమేయం లేదు కాబట్టే అది మనకు చరిత్ర లేకుండ చేసింది. కాలం సహితం కాలచక్రం అయింది. గుండ్రంగా తిరిగే ఈ చక్రంలో దేనికి మొదలు లేదు. అన్ని అనాది అయి పోయాయి.
Comments
Post a Comment