సింధూ ప్రజల తాత్విక చింతన

సింధూ ప్రజల తాత్విక చింతన

      ఆర్యులు ఇరాక్ నుండి వలస రాకముందే భారత దేశంలో వున్న సింధూ నాగరికత ప్రజలు ఉన్నారని 1922లో జరిపిన   తవ్వకాల ద్వారా  తెలిసింది.
వీరి కంటే ముందే ఇండియాలో ఐదు లక్షల సంవత్సరాల నుండి మానవ సంచారం ఉందని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అడిచన్నలూరు, కర్నూలు చిత్తూరు వంటి ప్రదేశాల్లో లభించిన ఆధారాలను బట్టి పాతరాతి యుగం లోనూ కొత్త రాతి యుగం లోనూ మానవుల సంచరించినట్లు గా తెలుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు కె.ఎస్.చలం తన ఇండియాలో సామాజిక పరిణామం గ్రంథంలో వివరించారు.సింధు ప్రజలే  ద్రావిడులన్న వాదన ఉంది. వీరి తరువాత ఆర్యులు భారతదేశం దేశంలోకి ప్రవేశించాలని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.కాకపోతే వీరి కన్నా ముందే మన దేశంలో బిల్లులు చెంచు,యానాది ,సవర సంతాల్ ,ముండా వంటి తెగలు మూలవాసులుగా ఉన్నారు.
       సింధూ నాగరికత కు పూర్వమే సాధారణ శకం 6000 ప్రాంతాల్లోనే బెలూచిస్థాన్ మెహర్గిడ్  కొండల మధ్య ప్రాంతాలలో ప్రజలు వ్యవసాయం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.  మరో వెయ్యేళ్లకు కుండల తయారీ మొదలైంది .వీరంతా సింధ్, పంజాబ్ వంటి ప్రదేశాల్లో స్థిరపడసాగారు. క్రీ.పూ. 4000ల నాటికి వీరికి  సంస్కృతి సంప్రదాయాలు ఏర్పడసాగాయి.  వీరు బఠాణీలు నువ్వులు కర్జూరం మొదలైన పంటలు పండించడం,రకరకాల జంతువుల పెంపకం నేర్చుకున్నారు.అలంకరణకు  అవసరమైన రాళ్లు, పూసల వంటి వాటి కోసం  దూర ప్రాంతాల వారితో వ్యాపార సంబంధాలు  ఏర్పరుచుకున్నారు.క్రీ.పూ. 3000 నాటికి రావి నది(హిమాచల్ ప్రదేశ్ ,పాకిస్తాన్ తూర్పు ప్రాంతం) ప్రాంతంలో సింధూ నాగరికతకు పునాది ఏర్పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి  లిపి కూడా ప్రారంభమైంది. అయితే దాన్ని ఇప్పటివరకు ఎవరూ  అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు.
         సింధూ ప్రజలు మరో వెయ్యేళ్లకు(క్రీ.పూ.2000)  నేటి భారతదేశంలో గుజరాత్, ఉత్తర  రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, సింధ్ ,చండీఘర్ , పాకిస్థాన్ లో పంజాబ్,బెలూచిస్థాన్ ప్రాంతంలో తమ నాగరికతను  అభివృద్ధి చేసుకున్నారు.ఇది మొహంజదారో ,హరప్పాలో బాగా వికసించింది. సింధు నది,రావి నది పరీవాహక ప్రాంతంలో ప్రజలు నివసించేవారు. సింధు పరీవాహక ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు.అందువల్ల పురావస్తు వేత్తలు ఈ నాగరికత ను సింధు  నాగరికత అని పిలిచారు.
       ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1922  నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే లభించాయి.

         సింధు లోయ నాగరికత (క్రీ.పూ6000 - క్రీ.పూ.1750) ప్రస్తుత భారత దేశం మరియు పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలు బయటపడినాయి.  హరప్పా నగరం మొదటగా బయట పడటంతౌ దీన్ని హరప్పా నాగరికత అని కూడా అన్నారు. ఈ హరప్పా నాగరికత క్రీ పూ 2600 లో ప్రారంభమై 600  సం.లు అవిచ్ఛిన్నంగా సాగినట్లు సాయి పాపినేని తన మూలవాసులు అనే వ్యాసంలో పేర్కొన్నారు (misimi జూలై 2015).సింధు నాగరికత, మెసొపొటేమియా( నేటి ఇరాక్)  , ఈజిప్టు నాగరికత లకు సమకాలికమైనది. ఇవి కంచు యుగాలకు సంబంధించినవి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన సింధు నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు.  అశోకుని కాలంలో బ్రాహ్మి లిపిలో శాసనాలు రాశారు. కానీ దీనికి సింధు నాగరికత నాటికి వున్న లిపికి సంబంధం  ఎంత మాత్రం లేదు . ఈ నాగరికత కాలంలో లో కొన్ని గుర్తులు ముద్రల పైన, సరిహద్దు రాళ్లపైన, చిన్న పాత్రల మీద, మెడలో ధరించే తాయత్తు లాంటి వాటిమీద కనిపిస్తున్నాయి. వీటి అర్థం ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారు.
     క్రీ.పూ 2600 నాటికి ఉచ్చ దశ కు చేరిన సింధూ నాగరికత (హరప్పా నాగరికత)క్రీ.పూ 1500 లలో ఆర్యులు వచ్చే నాటికి పతనమైంది.
 సింధూ నాగరికత వ్యవసాయం పై ఆధారపడింది
క్రీస్తు పురం 6000 ప్రాంతంలో లో సింధూ నది పశ్చిమ కనుమల్లో నివసించే ప్రజలు రాతి పనిముట్లు తోనే ధాన్యాలు పండించే వారు. దాంతో పాటు మేకలు, గొర్రెలు, ఆవులు వంటి జంతువులను పెంచేవారు. ఇతర ప్రాంతాలతో వర్తకం చేసేవాళ్ళు. మూడు వేల సంవత్సరాల కు పైగా జరిగిన ఈ పరిణామాలు మొహంజోదారో, హరప్ప వంటి నగరాల నిర్మాణానికి కారణమయ్యాయి.

మెసపుటోమియా (ప్రస్తుత ఇరాక్ )లోని ప్రాచీన సంప్రదాయాన్ని సుమేరియన్ నాగరికత అంటారు తర్వాత కాలంలో అది బాబిలోనియా గా ప్రసిద్ధి చెందింది. వీరితో సింధు నాగరికత ప్రజలకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. వస్తుమార్పిడే ఆనాటి వ్యాపారం.

 ఆర్యుల రాక పూర్వం భారతదేశంలో ఉన్న సింధూ  నాగరికత ద్రావిడ నాగరికత అని అన్నారు. ఈ నాగరికత గా పేర్కొన్న హరప్పా కాలిబంగన్ బలూచిస్తాన్ లోని కలత్ ప్రాంతంలో  బ్రా హి భాషను (తమిళ భాష కుదగ్గరగా గల భాష ఇది)ఇప్పటికీ 2.5 లక్షల మంది మాట్లాడుతున్నారు ఈ భాష ఇరాన్ సరిహద్దులు దాటి ఎవరు మాట్లాడడం లేదు .దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ ద్రావిడ నాగరికత కు వారసులు అవుతారు.
ఈ ద్రవిడ జాతి కూడా ఇండో-యూరోపియన్ జాతీయ అని చరిత్రకారులు చెబుతున్నారు వీరు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలలో కంటే ముందుగా మధ్యధరా సముద్ర ప్రాంతం నుండి వచ్చారని భావిస్తున్నారు అదే ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని  వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆర్యులుసింధు నాగరికతను ధ్వంసం చేసి ఉంటారని ఆ రకంగా ద్రావిడులను దక్షిణ భారత దేశంలోకి కి తరిమి కొట్టడంతో వారంతా దక్షిణ భారతంలో కి వెళ్లి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు.
 
         సింధు ప్రజల నాగరికత పట్టణ నాగరికత.
దీనికి సమకాలీనంగా ఉన్న ఏ నాగరికత లోను ఇంతటి అభివృద్ధి చెందిన నాగరికత లక్షణాలు కనిపించలేదు.
         సింధు కాలంలో పట్టణ జనాభా దాదాపు రెండున్నర లక్ష ఉండింది. పట్టణం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చుట్టుపక్కల పల్లెలు ఉండి తీరాలి. ఆ పల్లెల జనాభా పట్టణ జనాభాకు 15 రెట్లు తప్పనిసరిగా ఉంటేనే పట్టణ జనాభాకు తగినంత ఆహారం లభిస్తుంది. ఆ రకంగా పల్లెలు పట్టణ జనాభా కలిస్తే దాదాపు 40 లక్షల వరకు ఉండి ఉండాలని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.సింధూ నాగరికత కాలం లో ప్రతి చదరపు కి.మీ.కు సుమారు 6గురు ఉండేవారు.1901 న ప్రతి చదరపు కి.మీ.కు 50మంది,1991 నాటికి 180మందీ ఉఃడేవారు.

    సింధూ కాలపు ప్రజలకు రాయడం, చదవడం కూడా తెలుసు. వాళ్ళు ఇటుకలతో రెండంతస్థుల మేడలు కూడా కట్టుకున్నారు. మురుగుకాలువలు నిర్మించారు. ఇళ్ళలో స్నానాలగదులుండేవి. స్విమ్మింగ్ పూల్ లాంటి ఒక కోనేరు ఒకటి ఉండేది. రుగ్వేదగానం చేసే ఆర్యుల కన్నా సింధు ప్రజలే నాగరికులని చరిత్రకారుల అభిప్రాయం. అయితే సింధూ సంస్కృతి ఎలా పతనమైందో ఇప్పటికీ ఎవ్వరూ కనుగొన లేకపోయారు. అయితే సింధు నది కి వచ్చిన వరదల వల్ల సింధు సంస్కృతి నాశమైందని కొందరు భావిస్తున్నారు.
      ఆర్యుల దాడుల కారణంగా నేటి ఆధునిక సంస్కృతి తో సమానంగా ఉన్న ఆనాటి సంస్కృతి పతనమైంది మరికొందరు భావిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఇంద్రుని పురందరేశ్వరుడని( నగర ధ్వంసకుడు) రుగ్వేదం లో కీర్తించడమేనని చెప్పారు.  
      సింధు ప్రజలు నేడు మనం పాటిస్తున్న ఆధునిక విధానాలను వారు అవలంబించారు. వారికో భాష ఉంది.దానికో  బొమ్మలలిపి ఉంది. ఇది స్వదేశీ లిపి.దీన్ని 1853లో కనుగొన్నారు. అయితే దానిని ఇంతవరకు ఎవరూ చదవలేకపోయారు. వీరి జీవనవిధానం క్రీ.పూ.6000 నుండి క్రీపూ.1750 వరకూ సాగింది. వీరు హరప్పా మొహంజదారో ప్రాంతం లో నివసించారు.ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ని సింధ్,పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్స్ వరకు ఉంది.వీరు నేటి నాగరిక విధానాలను ఆనాడే అవలంబించారు.
తరువాత కాలంలో ఆర్యులతో వీరు కలిసి పోవడమో, దూరంగా పారిపోయి దక్షిణ భారత దేశంలో కి రావవడమో జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు.
            అమ్మతల్లి విగ్రహం  
     
      సింధూ ప్రజల కళల ద్వారా వీరి మతసంప్రదాయాలను గుర్తించారు ఇర్ఫాన్ హబీబ్.ఒకే కొమ్ములు మూపురం లేని ఎద్దు ఎక్కువ గా లభించిన ముద్రలలో కనపడింది.ఎద్దును కులం దైవంగానో వంశపారంపర్యంగా నో పూజిస్తూ ఉండవచ్చు.ఎద్దు తరువాత ఏనుగు,పులి, కుందేలు,గేదె. ఆవు దాదాపు లేదు.
      తలకు గేదె కొమ్ములు కలిగి మానవ రూపంలో ఉన్న దేవత ముద్ర దొరికింది. ఈ దేవతను 
 పశుపతి అనుకున్నారు పరిశోధకులు. ఈ దేవతకు ఒకవైపు ఖడ్గమృగం నీటి బర్రె మరోవైపు ఏనుగు పులి ఉన్నాయి ఈ దేవత యోగ భంగిమలో ఉంది అంటే శక్తిని ఆరాధించేవారు. ఈ దేవతను శివునిగా పోల్చలేమంటాడు ఇర్ఫాన్ హబీబ్. ఈ పోలికలన్నీ మాతృదేవతకు ఉన్నాయి.కాబట్టి శివుడిగా భావించలేమని చెప్తాడు. కొంతమంది పరిశోధకులు
ఈ పశుపతి అనే పురుష దేవుడే  తరువాత కాలంలో శివుడిగా మారి ఉంటాడని  భావిస్తున్నారు. వేదసాహిత్యంలో ఈ దేవుడు లేడు. పశుపతిని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ఆరు ముఖాల మూర్తి, ఆ మూర్తి చుట్టూ  ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉన్నాయి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, సర్పాలను ,అగ్ని ని కూడాపూజించేవారు.పశువులను బలిచ్చేవారు. (ఆంధ్రులు నాగుల్ని పూజిస్తారు)
       మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదసాహిత్యాన్ని బట్టి మనకు తెలిసేదేమంటే వేదకాలపు ఆర్యులకు,సింధూ ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి.వేదాలలో అక్కడక్కడా వీరి ప్రస్తావన ఆధారంగా సింధూ ప్రజలు శివున్ని(పశుపతి), శక్తి (అమ్మతల్లి)ని, లింగాన్ని ఆరాధించే వారని తెలుస్తోంది.అక్కడ లభించిన విగ్రహాలు దీన్ని రూఢీ చేశాయి. సింధూప్రజలు మనిషి మరణిస్తే పూడ్చేవారు. తరువాత వలస వచ్చిన  ఆర్యులు మాత్రం శవాన్ని కాల్చేవారు(దహనం చేసేవారు).

       పురావస్తు ఆధారాల ప్రకారం సింధు నాగరికత కాలం క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,500. ఈ నాగరికత   క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 వరకు.ఉన్నత దశలో ఉండేది. సింధు నాగరికత   250 ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. అందులో  హరప్పా బయటపడిన మొట్టమొదటి పట్టణం. 2 వరుసల్లో నిర్మించిన 6 ధాన్యాగారాలు, పంటలు నూర్చే వృత్తాకారపు వేదికలు బయటపడ్డాయి.తవ్వకాల్లో బయటపడిన మరో అతి పెద్ద సింధు నాగరికత ప్రాంతం మొహంజోదారో: మొహంజోదారో అంటే సింధు భాషలో మృతుల దిబ్బ ని అర్థం. కాల్చిన ఇటుకలతో నిర్మించిన 39×23×9 అడుగుల విస్తీర్ణం గల మహాస్నానవాటిక బయటపడింది. అనేక స్తంభాలతో కూడిన అసెంబ్లీ హాలు నిర్మాణం‌కూడా బయట పడింది.
  సిరాబుడ్డి  దొరికింది.పూసలు, ఆభరణాలు తయారుచేసే పరిశ్రమ ఆనవాళ్లు వెలుగుచూశాయి.
నాగలితో పొలం దున్నిన ఆనవాళ్లు ఇక్కడ కనిపించాయి. యజ్ఞ యాగాదులకు గుర్తుగా 2 అగ్నిహోమాలు బయటపడ్డాయి.
  రంగాపూర్ ప్రాంతంలో హరప్పాకు పూర్వం ఉన్న సంస్కృతి వెలుగుచూసింది.ధాన్యపు పొట్టుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.
  కోట్-డిజి:  సింధు నాగరికతకు పూర్వమే విలసిల్లిన నాగరికత విశేషాలు ఉన్నాయి. ధోలవీర ప్రాంతం భారతదేశంలో బయల్పడిన సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణం.
 
 ఆర్థిక పరిస్థితులు
  వ్యవసాయం: సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. గోధుమ, బార్లీ ముఖ్య పంటలు. వీటిని రబీ సీజన్‌లో అధికంగా పండించేవారు. ఇతర ముఖ్య పంటలు నువ్వులు, ఆవాలు,  బఠాణీలు తదితర లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన పంటలను పండించేవారు. నవంబర్‌లో విత్తనాలు చల్లి ఏప్రిల్‌లో కోతలు కోసేవారు. సింధు ప్రాంత ప్రజలు తొలిసారిగా పత్తిని పండించారు. వీరు తొలిసారిగా పత్తిని పండించటం వల్ల గ్రీకులు పత్తిని సిండర్ అని పిలిచేవారు.
     వ్యవసాయ మిగులు ఎక్కువగా ఉండేది. మిగులును ధాన్యాగారాల్లో భద్రపరిచేవారు. వ్యవసాయ మిగులుతో అంతర్గతంగా ఎద్దుల బండి ద్వారా, అంతర్జాతీయంగా పడవల ద్వారా వ్యాపారం చేసేవారు.
  ఆవు, ఎద్దు, బర్రె, మేక, కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులతో పాటు ఏనుగు, పులి, ఖడ్గమృగం వంటి అడవి జంతువులు కూడా వీరికి తెలుసు. సింహం గురించి వీరికి తెలియదు. కుండలు, పూసల తయారీ, బొమ్మలు (టైట బొమ్మలు) - ముద్రలు, తాయెత్తులు, పడవల తయారీ పరిశ్రమలు ముఖ్యమైనవి.
       అంతర్జాతీయ వ్యాపారం మెసపటోమియాలోని సుమేరియన్లతో ఎక్కువగా జరిగేది. మెసపటోమియాలో లభించిన అనేక హరప్పా వ్యాపార ముద్రికలు దీన్ని బలపరుస్తున్నాయి.
  వ్యవసాయ ఉత్పత్తులైన గోధుమ, బార్లీ, పత్తితోపాటు దంతాలతో చేసిన సామగ్రి, కుండలు, బొమ్మలు, పూసలు తదితరాలను ఎగుమతి చేసేవారు.
       ఆఫ్గానిస్తాన్ నుంచి తగరం, అఫ్గ్గానిస్తాన్, పర్షియా నుంచి బంగారం, రాజస్థాన్ నుంచి రాగిని, సౌరాష్ర్ట నుంచి కాంబ్‌షల్స్ (విలువైన రాయి)ని దిగుమతి చేసుకొనేవారు. వస్తు మార్పిడి విధానం ద్వారానే వ్యాపారం జరిగేది.

___ kumaraswaamy 9490122229

 ( Gotelugu.com https://www.gotelugu.com/teluguarticles/view/9433/#.X-mZMq2KbDE.)

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం