విశ్వాస పరీక్ష (బక్రీద్)








#బైబిల్ ప్రకారం..
ఇస్సాకు అబ్రాహాము యొక్క ఏకైక కుమారుడు. యితడు దేవుని వరము వలన అబ్రాహాము, శారాలకు వృద్ధాప్యంలో పుట్టినవాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరేండ్లవాడు. దేవుడు అబ్రాహాముతో “నీ సంతానాన్ని ఆకాశనక్షత్రాల వలె, సముద్రతీరంలోని యిసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను” అని వాగ్దానము చేశాడు. ఇస్సాకును అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేవాడు. అయితే ఒకసారి దేవుడు అబ్రహాముతో “నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి యివ్వు" అన్నాడు. అబ్రాహాము దేవునికి ఎదురు చెప్పలేదు. తన కుమారుని బలి యివ్వడానికి సిద్ధపడ్డాడు.
అబ్రాహాము ఇస్సాకును వెంట తీసికొని మోరియా పర్వతానికి చేరుకొన్నాడు. కొండపైకి ఇస్సాకు చేతులు కట్టి, బలిపీఠం పై పరుండబెట్టి వధించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు తండ్రికి ఏమీ ఎదురు మాట్లాడలేదు. తండ్రిపట్ల పూర్తి విధేయత చూపాడు. అబ్రాహాము తన చెయ్యి చాపి ఇస్సాకును చంపడానికి కత్తి ఎత్తగానే యెహోవా దూత పరలోకము నుండి "అబ్రహామా! ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యవద్దు. అతన్ని చంపవద్దు" అన్నాడు.
ఇస్సాకునకు బదులుగా దేవుడు పంపిన ఒక పొట్టేలును అబ్రాహాము బలిగా అర్పించాడు. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రాహాము, ఇస్సాకు యిద్దరూ
ధైర్యంగా వున్నారు.

#ఖురాన్ ప్రకారం..
అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఇబ్రహీం దంపతులకు చాలా కాలం సంతానం కలగదు. లేకలేక పుట్టిన కొడుక్కి ఇస్మాయిల్‌ అని పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు ఓ రోజు ఇబ్రహీంకు కల వస్తుంది. అల్లా ఖుర్భానీ కోరుతున్నాడమోనని భావించి ఒంటెను బలిస్తారు. కానీ మళ్లీ అదే కల వస్తుంది. దీంతో అల్లాహ్ తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా.. అల్లా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు ఇబ్రహీం సిద్ధపడగా.. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింలు నమ్ముతారు.

ఇలాంటి కథే గొడగూచి కథ.

బసవ పురాణం లో ఉంది. పాల్కురికి సోమనాథుడు రచించాడు.గొడగూచి
తండ్రి గొడగూచిని చంపిఅతని మాంసాన్ని కూర చేసి శివుని కి పెడతాడు.శివుడు అతని భక్తి కి మెచ్చి మళ్ళీ గొడగూచిని బతికిస్తాడు.

ఇలా పిల్లలను మహిళలను దేవుళ్ళకు నైవేద్యం గా పెట్టిన అరాచక పద్దతులు అన్ని దేశాల్లో నూ ఉండినాయి.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం