మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన తాత్విక సిద్ధాంతాల ఆచరణాత్మక ఉపయోగం ఏమిటని కొంతమంది తత్వవేత్తలను అడుగుతుంటారు.శాంతి, పర్యావరణ శాస్త్రం వంటి వాటికి వాటితో ఎలాంటి సంబంధం ఉంది? ఆచరణాత్మక జీవితానికి సిద్ధాంతాన్ని ఎలా వర్తింపజేయాలన్న తాత్విక ఆలోచనా విధానం ఉందా? అని చాలామంది ఆలోచిస్తుంటారు.తాత్వకత కేవలం మనసుకు సంబంధించినదా లేదా జీవితాచరణకు సంబంధించినదా అన్న మీమాంస కు సమాధానం "నా జీవితమే నా సందేశం" అన్న గాంధీ జీవితమే. గాంధీ గుజరాత్ లోని పోరుబందరులో కరంచంద్ గాంధీ ,పుత్లీబాయి గాంధీ దంపతులకు అక్టోబరు 2, 1869 న జన్మించారు.జనవరి 30, 1948 న ఆయన మతోన్మాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. టాల్ స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు (The Kingdom of God is Within You), జాన్ రస్కిన్ రాసిన అన్టుది లాస్ట్ (Unto the Last) , భగవద్గీత ,బైబిల్ అతన్ని బాగా ప్రభావితం చేశాయి. వీటి ద్వారా ఆత్మజ్ఞానానికున్న ప్రాముఖ్యత, నిష్కామ కర్మ అర్థమయ్యాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా అతను గ్రహించాడు. వీటి ద్వారా ...
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక తాత్విక చింతన భారతదేశంలో ఎవరినైనా గుర్తించాలంటే అతని కులాన్ని మొట్టమొదట చూస్తారు. ఆ తర్వాతే అతని గుణగణాలు లెక్కలోకి వస్తాయి.దానికి భిన్నంగా కులమతాలకు అతీతంగా భారతీయ భౌతిక వాద తాత్వికతకు, ఆధునిక మానవవాద భావాలకు ప్రతిరూపంగా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని మౌ(Mhow)'అనే army regiment గ్రామంలో కీ.శ. 1891వ సంవత్సరం ఏప్రిల్ 14న రాంజీ మలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించారు.జై భీమ్ అని, బాబా సాహెబ్ అని ప్రేమగా ఆయన్ను అందరూ పిలుస్తారు. వీరి పూర్వీకులది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబావాడే గ్రామం. రాజ్యాంగ నిర్మాతగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, భారతీయ భౌతిక వాద తాత్వికునిగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు. ఆయనది సాఫల్య జీవితం. ఉత్తేజభరిత జీవితం. విద్యార్థిగా అవమానాల్ని ఎదుర్కొని అంటరాని తనానికి, వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా ధిక్కార స్వరంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటబావుటాగా నిలిచారు...
భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పైగా అది అనేక కారణాల వల్ల కూడా క్షీణిస్తూ వచ్చింది. గుప్తకాలం (320-650సీ.ఈ) పరిసమాప్తమైన తర్వాత, బౌద్ధ సంఘాలకు ఆర్థిక వనరులు తగ్గుతూ వచ్చాయి. అప్పుడు ఉన్న చిన్న చిన్న రాజ్యాల పరిపాలకులు హిందూ సంస్థలకు, బ్రాహ్మణులకు సహాయం అందిస్తూ ఉండేవారు. దానితో శైవులు, వైష్ణవులు బలపడుతూ వచ్చారు. రాజకీయంగా కూడా వారి పెత్తనం కొనసాగడం ప్రారంభమైంది. మరో వైపు బౌద్ధారామాల మీద బౌద్ధ భిక్కుల అజమాయిషి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో 7-8 శతాబ్దాలలో వచ్చిన కర్కోటక, ప్రతిహర, రాష్ట్రకూట, పాండ్య, పల్లవ వంశాల రాజకుటుంబాలన్నీ హిందూ ధర్మం వైపు, బ్రాహ్మణవాదం వైపు మొగ్గుచూపాయి. అందువల్ల బౌద్ధారామాలు మార్చుకోవడం, బౌద్ధ విగ్రహాలు మార్చుకోవడం తేలికైంది. అంతకు ముందు వెయ్యి సంవత్సరాలుగా విస్తరించిన బౌద్ధం క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. భారతదేశపు ఉత్తర ప్రాంతం నుంచి హుణులు, మంగోలులు, పర్షియన్లు చొరబడ్డారు. ఢిల్లీ సల్తనత్ జనరల్ మహ్మద్‌బిన్ భక్తియార్ ఖిల్జీ బెంగాల్ బీహార్లలో ఇస్లాంను వ్యాపింపచేశాడు. నలంద, విక్రమశిల, ఒదంతపురి లాంటి వన్నీ ధ్వంసం చేశాడు. బౌద్...
Comments
Post a Comment