రంజాన్‌







పండుగ అంటే శుభవేళ, ఉత్సాహం అని అర్థం. పండుగలు మన భారతీయ సంస్కృతిలో
ఒక భాగం. అది ఏ మతమైనా భారతీయులు కలిసిమెలిసి చేసుకుంటారు. ఒకరి పండుగను
ఇంకొకరు గౌరవించుకుంటారు. పండుగ మనుషుల జీవితాల్లో వెలుగు తెచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా
భావిస్తారు. పండుగ రోజు ఆనందంగా ఉండటం సహజం. ఒక్కో పండుగ ఒక్కో కారణంగా
ఏర్పడింది. కాకపోతే ఎక్కువ భాగం రుతువులను బట్టి ఏర్పడినాయి. దీనికి ప్రధాన కారణం
పూర్వం (ప్రజలు ప్రకృతిని ఆరాధించటమే. తరువాత కాలక్రమంలో దైవభావన తోడై ప్రతిపండుగకు
దేవున్ని స్మరించడం ఒక అలవాటుగా మారిపోయింది.

రంజాన్‌ పండుగ ముస్లింలు అత్యంత పవిత్రగంగా జరుపుకొనే పండుగ. ముస్లింలు
చంద్రమాన కాలపట్టికను అనుసరిస్తారు. చంద్రమానం (ప్రకారం వచ్చే తొమ్మిదవనెల రంజాన్‌.
దీనిని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. 'ఖురాన్‌' గ్రంథం ఈనెలలో ఆవిర్భవించడం వల్ల
ఈనెలను పవిత్రమాసంగా పరిగణిస్తారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికచింతనల కలయికే “రంజాన్‌ మాసం'.

రంజాన్‌కు 'రమదాన్‌” అని కూడాపిలుస్తారు. రమీదా లేదా అద్‌రమద్‌ అనే అరబ్‌ మూలపదం
నుంచి రమదాన్‌ అనే పదం వచ్చింది. రంజాన్‌ అనేది రోమన్‌ పదం. ఈనెల £29 నుండి
8౦రోజుల పాటు ఉంటుంది. చివరిరోజు అమావాస్యముగిసి నెలవంక కనిపించగానే పండుగ
జరుపుతారు. మక్కానుండి మదీనాకు ముస్లింలు వలసవెళ్ళిన రెండో సంవత్సరంలో షాబాన్‌నెలలో
“రమదాన్‌” ను తప్పనిసరి చేసినారు.

రంజాన్‌ నెలలో ఉపవాసం(రోజా) ఉంటారు. రోజాను ఉదయం సూర్యోదయం నుండి
సూర్యాస్తమయం వరకు పాటిస్తారు. రోజా (ఉపవాసదీక్షులో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్నిగాని,
పానీయాలుగాని, పొగతాగడంకాని చేయరాదు. కనీసం ఉమ్మికూడా మింగరాదు. ఎలాంటి
లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనరాదు. అలాగే ఇతరులను అవమానపరచడంగాని శాపనార్థాలు
పెట్టడంగాని, చాడీలు చెప్పడంగాని, అబద్దాలు చెప్పడంగాని చేయరాదు. ఆత్మరక్షణకు తప్ప
ఇతరులతో పోట్లాడరాదు. అయితే జబ్బుతో బాధపడేవారు, వృద్ధులు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు,
చక్కెర వ్యాధిగ్రస్తులు, బహిస్టు అయినవారు, దీర్ధకాలిక రోగాలతో బాధపడేవారు ఈ ఉపవాసదీక్ష
ఉంచి మినహాయించబడినారు. కాకపోతే రోజాలో ఉండటం ఐచ్చికం. తప్పనిసరేమీకాదు.

రంజాన్‌ మాసంలో (ప్రపంచంలోని ముస్లింలంతా ఉపవాస దీక్షలు ఉంటారు. ఇది ముస్లింల
మధ్య ఐక్యతను పెంపొందిస్తున్నది. ఉపవాసం ఉండటం వల్ల సహనశక్తి, మానసిక ఏకాగ్రత,
ఆకలి గురించి తెలియటం, ముఖ్యంగా ధనికులకు పేదల ఆకలిగురించి తెలియటం, వారిపట్ల
సహానుభూతి ఏర్పడుతాయని భావిస్తారు.
(ప్రాతఃకాలంలో ఉపవాస దీక్ష(రోజా) (ప్రారంభానికి ముందు చేసే భోజనాన్ని 'సుహూర్‌'
లేదా "సెహరి” అని, సూర్యాస్తమయ మయ్యాక ఉపవాస దీక్ష ముగించిన తరువాత చేసే భోజనాన్ని
“ఇఫ్తార్‌” అని అంటారు. రోజాలో మొదటచేసే ప్రార్ధనను 'ఫజర్‌” అంటారు. రంజాన్‌ మాసంలో
ఉపవాసంతోపాటు ప్రార్ధనలు(సలాత్‌), ఖురాన్‌ చదవడం, దాతృత్వం, మంచిపనులు చేయటం
కూడా ఆచరించాల్సి ఉంటుంది.

ఇస్లాం మతాన్ని అనుసరించేవారు ఐదు విధులు తప్పనిసరిగా చేయాలని చెపుతారు. ఇవి
ఈమతానికి మూల స్తంభాల్లాంటివి. అవి : 1. కలీమా (విశ్వాసంతో ప్రార్థన) 2. నమాజు(ప్రార్థన)
౩8. రోజా(ఉపవాసం) 4. జకాత్‌ (దానం చేయడం) 5. హజ్‌యాత్ర (మక్కాను సందర్శించడం).

1) కలిమా: “లా ఇలా:హా ఇల్లల్లా: మహమ్మదుర్‌ రసూలల్లా” అంటే అల్లా తప్ప వేరే
దేవుడు లేడు. మహమ్మదును ఆదేవుని ప్రవక్తగా పంపినాడు అని విశ్వసించి రోజూ జపించాలి.

2) నమాజు (ప్రార్ధన): మసీదు నుంచి అజా యిస్తారు. అజా నమాజుచేయటానికి
పిలుపు. వచ్చినవారంతా పేదగొప్ప తారతమ్యాలు లేకుండా అందరూ వరుసగా నిలబడతారు.
ఇమామ్‌ (పూజారి)వారి ముందు నిలబడి నమాజ్‌ చేయిస్తారు. నమాజ్‌ చేసేటప్పుడు ఖురాన్‌లోని
సూరాఃలె (పంక్తులను) చదువుతారు. మక్కా దిక్కుకు అభిముఖులై నమాజు చేస్తారు. ఇదొక
సామూహిక ప్రార్థన. మహిళలు మాత్రం ఇళ్ళలోనే నమాజు చేస్తారు.

3) రోజా (సౌమ్‌) : రంజాన్‌ మాసంలో చేసే ఉపవాసాన్ని రోజా అంటారు. దీనిని విధిగా
ఆచరించాలని ఖురాన్‌ చెపుతుంది. ఉపవాసాన్ని పార్సీభాషలో రోజా అని, అరబ్బీ భాషలో 'సౌమ్‌”
అని పిలుస్తారు.

4) జకాత్‌ : ఇస్లాంలో దాతృత్వం చాలాముఖ్యమైనది. ముఖ్యంగా రంజాన్‌ మాసంలో.
దీనిని 'జకాత్‌' అంటారు. తాను సంపాదించి పొదుపు చేసుకున్నమొత్తంలో కొంత భాగాన్ని పేదలకు
ఇవ్వాలి. ధనికులు తమ సంపద నుండి 30శాతం మొత్తాన్ని, ధనవస్తుకనకాలను ఏమైనా నిరుపేదలకు
దానం చేస్తారు.

పేదలు కూడా అందరితో పాటు వండుగచేసుకోవడానికి ఈ “జకాత్‌” పద్దతి ఉ
పయోగపడుతుంది.

7.5తులాల బంగారం లేదా 82.5 తులాల వెండి లేదా దానికి సమానమైన ధనంలో
2.5% జకాత్‌గా పేదలకు దానం చేయాలని పూర్వులు చెప్పినారు. 7.5 తులం బంగారంకు
(ప్రస్తుతం ఉన్న విలువ ప్రకారం (తులం రూ.30,000) రూ.2,25,000లు అవుతుంది. దీని
(ప్రకారం రూ.2,25,000లో 2.5% అనగా రూ.5,625లు చొప్పున తమ ఆదాయాన్ని లెక్కించి
పేదలకు దానం చేయాల్సి ఉంటుంది.
జకాత్‌తో పాటు ఉపవాసాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడిపట్ల కృతజ్ఞతగా
పేదలకు ధనికులు విధిగా దానం చేస్తారు. దీనినే ఫిత్రాదానం అంటారు. ఈ ఫిత్రాదానంలో
ర5్‌0గ్రాములు తక్కువ రెండు కిలోల గోధుమలుగాని, ఇతర ఆహార ధాన్యాలుగానీ, దానికి సమానమైన
ధనాన్నిగాని దానం చేయాలి. ఈదానం కుటుంబ సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి.

5. హజ్‌యాత్ర: అరేబియా దేశంలో ఉన్న మక్కామసీదును సందర్శించటం జీవితకాలంలో
ఒకసారైనా చేయాలి. అప్పులు చేసి వెళ్ళరాదు. అప్పులుంటే తీర్చివెళ్లాలి.

ఖురాన్‌ ప్రకారం రంజాన్‌మాసం మానవాళికి ఒక దిక్సూచిలాగా తోడ్పాటు లాగా ఉంటుంది.
అల్లా మనిషిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని, ఎలాంటి కష్టాలకు గురి చేయ్యడని ఈనెలను దీక్షతో
ముగించాలి. అల్లాతోడునీడగా దారిదీపంలాగా ఉన్నందుకు మనిషి కృతజ్ఞతను చాటుకోవాలి అని
ఖురాన్‌ చెపుతుంది.

రంజాన్‌ నెలంతా ఇలా ఉపవాసాలతో దాన ధర్మాలతో (జకాత్‌) ముగుస్తుంది. ముగిసేరోజున
“షవ్వాల్‌' లేదా హిలాల్‌రోజున నెలవంక కనిపిస్తుంది. ఈ నెలవంక దర్శనంకాగానే ఉపవాసదీక్షను
విరమించి, మరుసటిరోజు రంజాన్‌ పండుగను జరుపుకొంటారు. షవ్వాల్‌నెల మొదటిరోజున
జరుపుకొనే రంజాన్‌ పండుగను “ఈదుల్‌ఫితర్‌' అని అంటారు.

రంజాన్‌ పండుగరోజు సేమ్యాతో ఖీర్‌(పాయసం), బిరియానీ చేసుకుంటారు. కొత్తబట్టలు
ధరించి ఈద్లాలలో మసీదుల్లో సామూహిక ప్రార్ధనలు చేస్తారు. మహిళలు తమ ఇళ్ళలోనే నమాజు
చేస్తారు. (ప్రతి ఒక్కరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్‌ ముబారక్‌ (శుభాకాంక్షలు)
చెప్పుకుంటారు. తల్లిదండ్రులు లేదా బంధువుల సమాదుల దగ్గరకు వెళ్ళి ప్రార్ధనలు కూడా చేస్తారు.
నమాజ్‌కోసం వెళ్ళినపుడు ఒకదారిలోవెళ్ళి వచ్చేటప్పుడు మరొకదారిలో వస్తారు.

రంజాన్‌ పండుగ మరుసటిరోజుల్లో వనభోజనానికి వెళుతూ ఉంటారు.

- పిళ్లా విజయ్
5.6.2019 Wednesday, India

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం