భారత కథ
[28/07, 12:03 PM] Pilla Vijay: ధృతరాష్ట్రుని కుమారులు నూరుగురు వారే దుర్యోధనాదులు. వారిని కౌరవులని కూడ అంటారు. పాండురాజు కుమారులు అయిదుగురు ధర్మజ భీమార్జున నకుల సహదేవులు వీరిని పాండవులు అంటారు. పాండురాజు వేటకు వెడుతూ రాజ్యభారాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించిపోయాడు. దురదృష్టవశాన తిరిగిరాలేదు. పాండవులను వెంటబెట్టుకుని కుంతీదేవి మాత్రం తిరిగివచ్చింది. ధృతరాష్ట్రుని కొడుకులు వాళ్ళని నానా హింసల పాలు చేశారు. ఎలాగైనా వాళ్ళని వదిలించుకుని రాజ్యం మొత్తం దక్కించుకొందామని చూశారు. ఆఖరియత్నంగా లక్క యిల్లు ఏర్పాటుచేసి, అందులో వాళ్ళని బూడిద చేద్దామని చూశారు. పాండవులు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. ద్రుపదుని కుమార్తెను పరిణయమాడి, ఆ వియ్యం వల్ల మరింత బలపడ్డారు. ధృతరాష్ట్రుడు పాండవులు అక్కడే ఉంటే తనకు, తన బిడ్డలకు ప్రమాదమని గుర్తించి, వాళ్ళను హస్తినకు రప్పించి, ధర్మజుని యువరాజుగా చేశాడు. అంతేకాదు, ఖాండవప్రస్థానికి రాజుగా కూడా చేశాడు. అంతటితో పాండవులు విజృంభించి, తమ బలపరాక్రమాలు ప్రదర్శించి, నాలుగు దిక్కులూ జయిమ్చి, మహావైభవంగా రాజసూయం నిర్వహించి, సార్వభౌములుగా సుప్రతిష్టితులయ్యారు. పాండవుల వైభవం దుర్యోధనుడికి సహింపరానిదయ్యింది. వాళ్ళని ఎలాగైనా సరే ప్రాభవశూన్యులుగా చేయాలని సంకల్పించాడు. శకుని సహాయంతో మాయద్యూతంలో ఓడించి, నిండుసభలో ద్రౌపదినీ, పాండవులనూ అవమానించాడు. మళ్ళీ అనుద్యూతంలో ఓడించి, వాళ్ళను పన్నెండేళ్ళూ అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యండని పంపేశాడు. కిమ్మనకుండా నియమపాలన చేసి, మా రాజ్యం మాకివ్వండని పాండవులు ధృతరాష్ట్రుడికి కబురంపారు. కనీసం అయిదుగురికీ అయిదూళ్ళిచ్చినా సరిపెట్టుకొంటామన్నారు. దుర్యోధనుడు ససేమిరా ఇయ్యనన్నాడు. వాడిసూదిమొన మోపినంత మేరనయినా తనంత తానుగా ఇవ్వననీ, కావాలంటే యుద్ధం చేసి గెలుచుకోండనీ తేల్చి చెప్పాడు. మరింక గత్యంతరం లేకపోయింది. పద్ధెనిమిది అక్షౌహిణుల సేనతో పద్ధెనిమిది దినాలు మహాఘోరంగా కురుక్షేత్ర సంగ్రామం నడిచింది. రక్తం వరదలై పారింది. రాజ్యం పీనుగుపెంటలయింది. స్త్రీబాలవృద్ధులు మినహా మహాజనసంక్షయం జరిగిపోయింది. పునఃప్రతిష్ఠితుడై ధర్మరాజు మరో ముఫ్ఫై ఆరేళ్ళు పృధ్వీపాలనం చేసి, పరీక్షిత్తుకు పట్టం కట్టి, మహాప్రస్థానానికి తరలివెళ్ళిపోయాడు.
[28/07, 12:22 PM] Pilla Vijay: హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
హస్తినాపురం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఉన్న పట్టణం మరియు గ్రామ పంచాయతి. ఈ స్థలం మహాభారతంలో కౌరవుల రాజధాని గా ఉండేది.
[28/07, 12:22 PM] Pilla Vijay: ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
ఖండవవనం నాశనం అయిన తర్వాత పాండవులు స్థాపించిన ప్రదేశం ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం. ఈ పట్టణం పాండవుల రాజధాని.
[28/07, 12:23 PM] Pilla Vijay: ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
మహాభారత కాలంలో ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలను కలిపి పాంచాల దేశంగా పిలిచేవారు. ఇది ద్రుపద మహారాజు ఏలిన రాజ్యం గా ఇతిహాసంలో పేర్కొన్నారు.
[28/07, 12:23 PM] Pilla Vijay: ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
మహాభారత కాలంలో ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలను కలిపి పాంచాల దేశంగా పిలిచేవారు. ఇది ద్రుపద మహారాజు ఏలిన రాజ్యం గా ఇతిహాసంలో పేర్కొన్నారు.
[28/07, 12:24 PM] Pilla Vijay: గోకుల్, మధుర దగ్గర, ఉత్తర్ ప్రదేశ్
వ్రేపల్లె లేదా గోకులం అని పిలువబడే గోకుల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర సమీపంలో ఉన్నది. ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు.
[28/07, 12:27 PM] Pilla Vijay: కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు.
[28/07, 12:28 PM] Pilla Vijay: బోధ్ గయ, బీహార్
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం
Comments
Post a Comment