మనుస్మృతి గురించి కొంత
రఘ వంశం రెండో సర్గ లో దిలీప మహారాజు ధర్మపత్ని దక్షిణాదేవి వేదార్థాన్ని స్మృతి మాదిరిగా నందినీ ధేనువు వెళ్ళే దారిని
అనుసరించిందని కాళిదాసు వర్ణించారు. (....మను ష్వేశ్వర ధర్మపత్ని శ్రుతేరి వార్థం
స్మృతి రస్వగచ్ఛత్). శృతి అందే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం.
“వేదో ధర్మ మూలం" అన్నాడు గౌతముడు. సమస్త ధర్మాలకూ వేదమే మూలం. ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేది ధర్మశాస్త్రం. ఇది వేదంతో సమానమై పధ్నాలుగు విద్యల్లో ఒకటయింది
ధర్మశాస్త్రం ధర్మాన్ని తెలుపుతుంది. జైమిని "చోదనా లక్షణోర్థో ధర్మః"అని చెప్పాడు. చోదన అంటే పురికొల్పటం అని అర్థం. వ్యక్తి చేయదగిన విధుల్ని బోధించేది ధర్మం. ధర్మాలు సామాన్యమనీ, విశేషమనీ రెండు రకాలు. సత్యం, అహింస, దయ, శౌచం మొదలయిన వన్నీ సామాన్య ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు
విశేష ధర్మాలు.
భారతదేశంలో ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనవి. మానవసమాజంతోనే సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి. సమాజం స్థాణువు కాదు కాబట్టి, పరిణామం చెందే తత్వం కలిగింది.కావున ధర్మాలను కూడా కాలానుగుణంగా మార్పుల చేర్పులతో తిరిగి నిర్ణయించు కోవటం తప్పనిసరియింది. అప్పుడు శిష్ట పరిషత్తులు వేదవిరుద్ధంగాని విధంగా దేశ కాల కులాచారాలను సమీక్షించి ధర్మాలను ప్రతిష్ఠిందాయి. జార్జిబుహ్లర్ పరిశోధనను బట్టి మొదట ఈ విధంగానే ధర్మసూత్రాలు అవతరించాయి.
వచన రూపం ధరించిన ఈ ధర్మసూత్రాలు కాలక్రమాన ఛందో రూపాన్ని సంత రించు కొన్నాయి.
భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు స్మృతులున్నాయి. వీటిల్లో మను స్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజవల్క స్మృతి, పరాశరస్మృతి మొదలయినవి లెక్కకు వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని ఎవరికైనా తెలుస్తుంది.
అయితే ఈ మను వెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యం.
రుగ్వేదంలో పితృ మనువు ప్రస్తావన ఉన్నది. శతపథబ్రాహ్మణంలోని జలప్రళయ కథలో మనువు కనబడతాడు. పురాణాల ప్రకారం పద్నాలుగు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మ పుత్రుడైన
స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు. అమరకోశం కూడా మనువు
వలన పుట్టినవారు మానవులనీ (మనోద్ఘాతా మను-1) మనువు సంబంధమయినవారు
మానవులనీ (మ కోరేమే మానవా!) పేర్కొంటున్నది. అయితే రామాయణం మాత్రం
కశ్యప ప్రజాపతికి ఎనిమిది మంది భార్యలున్నారని, వారివల్ల మానవునితోపాటు
సమస్త ప్రాణులూ జన్మించాయనీ (ఆరణ్య కాండం. 14 సర్గం) చెప్తున్నది. కశ్యప
ప్రజాపతి భార్యల్లో మనువు ఒకటి. ఆమె బ్రాహ్మణాది వర్ణములతో కూడిన
మనుష్యులను కన్నది. (గ్ 28)
మనువుల్లో రెండవవాడు స్వారోచిషుడు. ఇతడు స్వరోచికి, వనదేవతకూ
పుట్టినవాడు. అల్లసాని పెద్దన్న మనుచరిత్రంలో ఇతని వృత్తాంత మున్నది. మనువుల్లో ఏడవవాడు వైవస్వత మనువు. ఇతడు సూర్య పుత్రుడు. సూర్యవంశ రాజుల మూల పురుషుడు. కాళిదాను వేదాలకు ఓంకారం మాదిరిగా రాజులకు మొట్ట మొదటి
వాడయిన వైవస్వతుడని ప్రసిద్ధికెక్కిన మనువున్నాడని రఘువంశంలో (సర్గం 1.
శ్లోకం 11) వర్ణిస్తాడు.
ఒక్కొక్క మనువు జీవిత కాలానికి మన్వంతరం అని పేరు. ఒక్కొక్కబ్రహ్మకల్పం లో పద్నాలుగు మంది మనువులు మారతారు. ఒక మనువు పరిపాలనా కాలం 4,32,000 మనుష్య సంవత్సరాలని భాగవతం మూడో స్కంధంలో ఉన్నది. మనువు విశ్వపరిపాలనం చేసే ధర్మ నిర్ణేత అని భారతీయుల విశ్వాసం.
ఇది మనువృత్తాంతం.
ఇప్పుడు మనకు లభించిన మనుస్మృతిని రచించిందెవరు? పౌరాణిక విశ్వాసం వేరు. చారిత్రక పరిశోధనం వేరు. మనుస్మృతి క్రీ.పూ.
500లో అవతరించిందని కొందఱు పరిశోధకులు పేర్కొన్నారు. మరి కొందరు
క్రీ. పూ. 2వ శతాబ్ది,క్రీ.శ. 2వ శతాబ్ది మధ్య కాలంలో ఇప్పటి మనుస్మృతి రూపొందింద న్నారు. ఏది ఏమయినా భృగు వంశీయులు మనుస్మృతిని రచించి ప్రజలకు దానియందు భ క్తి గౌరవాలు కలగటానికి మనువు దాని సృష్టికర్త అని చాటారనే మాట మాత్రం సత్యం. మనుస్మృతి మొదటి అధ్యాయమే దీనికి సాక్ష్యం. దీనిలో మనువు తన దగ్గరకు వచ్చిన రుషులకు సృష్టి క్రమాన్ని వివరించి
తర్వాత సకల మానవుల కుపయోగకరంగా తాను సృజించిన స్మృతిని వారి కుపేదేశింపుమని భృగువు నాజ్ఞాపించాడు. మనుస్మృతి భృగుసంహితగా పేరు పొందిందని
మనం మరచిపోరాదు.
మనుస్మృతిలో ప్రక్షిప్తాలున్నాయి, అందువల్ల దానిలో స్వవచన వ్యాఘాతాలూ, పునరుక్తులూ చోటు చేసుకొన్నాయి. మహాభారతంలో మనుస్మృతుల్లోని సమానమయిన శ్లోకాలనూ అర్థ భావాలను మనం గుర్తింపవచ్చు.
పతంజలి మహాభాష్యంలో మను ప్రస్తావన ఉంది. శబరస్వామీ, శంకరాచార్యులు రచించిన భాష్యాల్లో మనుస్మృతి శ్లోకాలున్నాయి. క్షీరస్వామి అమరకోశ వ్యాఖ్యాత కొన్ని శ్లోకాలుదహరించాడు. భారవి, యశస్తిలక చంపూ రచయిత
సోమదేవసూరి మనుధర్మాన్ని ప్రస్తావించారు. వలభిరాజుల శాసనాల్లో కూడా దానిని
మనం చూస్తాము.
మనుస్మృతి వర్ణ ధర్మాలూ, ఆశ్రమ ధర్మాలూ, ధర్మ నిర్ణయాలూ, అభియోగవిచారణమూ వివిధ దండన విధానాలు, రాజ్య సంబంధి విషయాలు మొదలయిన వాటిని విపులంగా ప్రతిపాదిస్తుంది. నామకరణం, బిక్షాటనం మొదలయిన విషయాల్లో
మనుస్మృతి తీరు విచిత్రంగా నిరంకుశంగా గోచరిస్తుంది. ఇది శూద్రులపట్ల కఠినాతి
కఠినంగా, క్రూరంగా వ్యవహరిస్తుంది. స్త్రీలపట్ల ఔదార్యం చూపదు.
భారతదేశం విభిన్న జాతులకూ, పలు తెగలకూ నిలయం. భారతీయ సంస్కృతి విభిన్న జాతుల సంస్కృతి .ఈ సత్యాన్ని కప్పి పుచ్చి సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఈనాడు భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చాలని ప్రతీపశక్తులు ప్రయత్నిస్తున్నాయి.ప్రజా
స్వామ్యం ప్రసాదించే స్వత్వాలను కాలరాచి వేయడానికి కంకణం కట్టుకొన్నాయి
భారతీయ సంస్కృతి మంచి సెబ్బరలను తెలిసికొని దేశంలో విచ్చలవిడిగా పెచ్చుపెరిగి తిరుగుతున్న దుష్ట శక్తుల త్రుళ్ళు అణచి వేయటానికి, అసమానత్వాలను నామరూపాలు లేకుండా నశింపజేయటానికి మను స్మృతి ని తప్పకుండా అధ్యయనం చేయాలి.
- నాగళ్ళ గురు ప్రసాదరావు
(కృష్ణా రెడ్డి రాసిన మనుస్మృతి గ్రంధానికి ముందు మాటలో)
Comments
Post a Comment