_చార్వాక,లోకాయతుల తాత్విక చింతన_ మనకు కనిపించే ప్రకృతి, ప్రపంచం,విశ్వం,జన్మలు, మరణాలు మొదలైన వాటి గురించి చింతన ఉపనిషత్తులలో మొదలైనప్పటికి అది భావవాదంలో కూరుకు పోయింది. ఈ ఉపనిషత్తులు 700-500 BCE కాలానికి చెందినవి.బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు శారీరక శ్రమను చాలా నీచంగా చూశాయి. ఉపనిషత్కారులు శారీరక శ్రమ చేసేవారని పందులతో, కుక్కలతో సమానంగా చూశారు. (ఛా.ఉ.5.10.9). వీరు కనిపించే వాస్తవాన్ని నిరాకరించారు. శారీరక శ్రమను నీచంగా చూశారు.శ్రమ చేసేవాణ్ణి అసహ్యించుకున్నారు. ఈ మూడు అభిప్రాయాలతో పాటు ఆత్మ, పరమాత్మ ల సిద్ధాంతం , పునర్జన్మ సిద్ధాంతం ప్రధాన సిద్దాంతాలు గా ప్రవేశ పెట్టారు. అవే అంతిమ సత్యాలుగా, వాటిని గురించి తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానంగా ప్రచారం చేశారు ఉపనిషత్కారులు. తాత్విక చింతన హేతువాదాన్ని, తర్కాన్ని ఆధారం చేసుకొని సాగుతుంది. ప్రతి దాన్ని సంశయించి, ప్రశ్నిస్తుంది. అందుకే మన దేశంలో ఎక్కువగా తాత్వికాంశాలు భావవాదాలుగా ఉన్న దేవుడు, నమ్మకాలు, క్రతువుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే భారతదేశంలో భావవాదంతోప...
Comments
Post a Comment