సింధు ప్రజలు, ఆర్యులు ఆవులను,ఇతర జంతువులను ఇలా ఉపయోగించుకునే వారు. అదే ఆనాటి వారి సంపద. వారు జంతువుల వేట నుంచి వాటి పరిరక్షణకు, పెంపకానికి, వాటి ద్వారా పాడికి వ్యవసాయకులుగా, పశు గణాల పెంపకందారులుగా పరివర్తన చెందారు.
భూమి అనే గోవు నుంచి వారు పాలనేగాక అవసరమైనవి ఏవైనా సరే పిండుకునేవారు. అందుకే వారి దృష్టిలో భూమి ( గోవు) ఒక కామధేనువు.
జంతువులను ఉపయోగించుకోవడం నేర్చుకోవడంతో మిగులు ఆహారఉత్పత్తి సాధ్యమైంది.క్రీ. పూ. 2000 ప్రాంతంలో మనిషి గుర్రాల స్వారీ చేయడం నేర్చుకున్నాడు.
గుర్రాలపై స్వారీ చేయడం నేర్చుకోవడం వల్ల మనిషి ఇతర ప్రపంచం మీద పైచేయి సాధించాడు. గుర్రాలు యుద్ధ రథాలకు పూన్చేందుకు, విశాలమైన మైదానాలలో పశుపాలనకు ఉపయోగపడేవి. వాటిని యాగాలలో బలివ్వటం మినహా ఆహారం కోసం ఉపయోగించేవారు కాదు. గుర్రాల మేతకోసం వేదకాలపు మనుషులు తరుచు కొత్త గడ్డి భూములను వెతుకుతూ పోయేవారు. ఇతర పశువులకు భిన్నంగా గుర్రాలు గడ్డిని వేళ్లతో సహా పీకి వేసి మొదలంటా తింటాయి. అక్కడ గడ్డి తిరిగి మొలిచేందుకు కొన్నేళ్లు అవసరం. కనుక వారు కొత్త చోట్లకు తరలిపోవటం, కొత్త భూములు ఆక్రమించుకోవటం జరిగేది. గుర్రాలను యాగాలలో బలి ఇచ్చినప్పుడు ఇతర పశువులకువలె వాటిని నరికి చంపకుండా, ఊపిరాడకుండా చేసి చంపేవారు. ఆ తర్వాతనే శరీరాన్ని ఖండాలుగా నరికి కొన్ని భాగాలను అగ్నికి ఆహుతిచ్చేవారు. వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకునేవారుకాదు. అప్పటివారికి గుర్రాలతో గల అనుంధమే దీనికి కారణమై ఉంటుంది.(హిందువులు,వెండీ డోనిగర్) జంతువులను తన పనులకు ఆహారాన్ని సంపాదించడంలో ఉపయోగ పెట్టడం తో కొంత అదనపు ఉత్పత్తిని మనిషి సాధించ గలిగాడు.
నదీ తీరాలలోనే పశుగ్రాసం పుష్కలంగా ఉంటుంది గనుక నదీతీరాల వెంబడి
మానవుడు విస్తరించాడు. చేపలు పట్టడం నేర్చుకున్నాడు. నదీతీరాలలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. దానితో స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు. ఇళ్ల పైకప్పులుగా చెట్ల ఆకులు వాడారు. చెట్ల బెరళ్ల నుండి పీచు తీసి నారదుస్తులు అల్లడం నేర్చుకున్నారు. బుట్టలు అల్లడం, కుండలు చేయడం అవసరం అయి అవి కూడా నేర్చుకున్నారు.
వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. చేతివృత్తులు దానికి ఉపాంగాలుగా అభివృద్ధి చెందాయి. వేట క్రమంగా వినోదంగా మారింది.
ప్రకృతితో భౌతిక అవసరాల కోసం పడే సంఘర్షణలో ఆలోచనలు వికసించాయి.
కలిసి వేటాడుతున్న సందర్భంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
దానికోసం మౌన సంకేతాలు ఉపయోగించడం మొదలు పెట్టాడు.గుహల్లో బొమ్మలు గీచేవాడు.మెల్లగా ప్రకృతి ని అనుకరిస్తూ పదాలను, భాషను అభివృద్ధి చేసుకుని తన భావాలను వెల్లడించేవాడు.వేటగాని, పనిముట్లు తయారీగాని ఎవరికివారు ఇతరులతోడ్పాటు లేకుండా చేసుకోగలిగిన పనులు కావు. ఉమ్మడిగానే ఇవి జరిగేవి. దానితో ఒకరి భావాలని ఒకరికి తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. భావాలని తెలియజేసే మార్గాలు (1) నోటితో రకరకాల ధ్వనులు పలకడం, (2) చేతులతో సంజ్ఞలు చేసుకోవడం, (3) గుహలలో బొమ్మలు గీయడం ద్వారా తెలియజెప్పడం.
నోటితో రకరకాల ధ్వనులు పలకడం - పాటలు, సంగీతం, భాష పుట్టింది. చేతులతో సంజ్ఞలు - అభినయం, నృత్యం
గుహల్లో బొమ్మలు - చిత్రలేఖనం పదేపదే గీయాల్సి వచ్చినప్పుడు బొమ్మల బదులు సంకేతాలు, దానినుండి క్రమంగా లిపి వచ్చింది.
రాతి పనిముట్ల తరువాత లోహపు పనిముట్ల వాడకం పెరగడం తో వేటాడే సామర్థ్యం పెరిగింది. పెద్ద పెద్ద జంతువుల్ని కూడా వేటాడగలిగాడు. ఆ జంతువుల చర్మాలను దుస్తులుగా, గుడారాలకు కప్పుగా వాడసాగాడు.
మనిషి మరణించాక శరీరం నశించి గాలి, వెలుతురు,మట్టి,నీరు,మొక్క ల్లోకి చేరిపోతుందని
క్రీ.పూ.1500 నాటి కాలంలో భావించేవారు. పశుపోషణ దశలో ఉన్న సమాజమది. రుగ్వేదంలోని ఒక కవిత( శ్లోకం) మృతుడిని ఉద్దేశించి, “నీ నేత్రాలు సూర్యుని వద్దకు, జీవన శ్వాస అనంతవాయువుల్లోకి చేరుగాక. నీ స్వభావాన్ని బట్టి ఆకాశానికి గాని భూమిలోకి గాని ప్రవేశించు. నీ కర్మ ఆ విధంగా రాసి పెడితే నీటిలో నిమజ్జనంకా. నీ అంగాలతో మొక్కలలో వేరుగా మారిపో" అని చెప్తుంది. కానీ 500 ఏళ్లు గడిచేసరికి ఈ భావన నుంచి మారిపోయారు.
రుగ్వేదం ప్రధానంగా ఉన్న నాలుగు వేదాల్లోని విషయాలను గమనిస్తే, "నాకు ఆకలిగా ఉంది. ఆహారం బాగా దొరికేలా చేయి, గోవుల మంద బలిసి పాలు బాగా ఇచ్చేలా అనుగ్రహించు' లాంటి ఇంద్ర వరుణాది దేవతలనుద్దేశించి పాడిన పాటలు, చేసిన స్తుతులు నిండి ఉన్నాయి.వేదాల్లో ప్రస్తావించిన యజ్ఞయాగాలూ "సంతానం కావాలనో, 'పంటలు బాగా పండాలనో, యుద్ధాల్లో జయం కావాలనో" కోరి ఉద్దేశించినవే. ఇవన్నీ ఆదిమ సమాజపు లక్షణాలను తెలియ జేస్తున్నాయి.
క్రీ .పూ.2000లో ఆర్యులు ఇరాన్ నుంచి వచ్చి ఇండియాలోని సింధు నాగరికతను ధ్వంసం చేసినారు. గోవులను అపహరించేవారు.
ఇతరుల భూమిని సొంతం చేసుకొని సొంత ఆస్తిని ఏర్పరచుకున్నాడు.
Comments
Post a Comment