స్టీఫెన్ హాకింగ్
స్టీఫెన్ హాకింగ్ ఓ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించేవారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగారు. 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు . ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. స్టీఫెన్ తన 17వ యేట, 1959 వ సంవత్సరం10వ నెలలొ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలొ చేరాడు. 1985 లో కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ. . . ‘కాలం కథ’ పేరుతో వెలువడింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి, మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం. . . ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. అన్నం తినాలన్నా. . . కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా. . . స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది. . . తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా! కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా. . . చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా. . . కృష్ణ బిలాలపై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.
ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే! విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్నమహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించాడు.
Comments
Post a Comment