3000BCEలో  వికసించిన సింధు నాగరికత కాలంలో సింధు ప్రాంత ప్రజలు తమకు పెద్దగా ఉన్న    అమ్మతల్లిని పూజించేవారు. దీనికి కారణం మాతృస్వామిక వ్యవస్థ ఉండటమే. ఈ విధానం వల్ల వీరి జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు భాగమయ్యారు. ఈ దేవత గ్రామాన్ని చల్లగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ,  పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ,  భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుందని నమ్మేవారు.  ఆ దేవతే గ్రామదేవత.   కల్లూ, సార, జంతుబలి, నైవేద్యం ఈ దేేేేేేేవతలకు సమర్పిస్తుంటారు.    

   వారి జీవనాధారం గా ఉన్న పంటనే దేవతగా భావించి పూజించేవారు. కుంకుల్లు బాగా పండే ఊర్లలో  కుంకుళ్ళమ్మ ను దేవతగా,గోగులు బాగా పూచే ఊర్లలో   గోగులమ్మ    దేేేేేవతగా చేసుకున్నారుు.జొన్నలుపండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే  వరి పండే  ప్రాంతాలలో వారి దేవతను నూకాళమ్మ అని పిలుచు కున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ దేవతకు నివేేదిస్తారు.  పూజ చేసే  పూజారికి  అందరూ ఆ పంటను తలా ఇంత ఇస్తారు. దాన్ని  సొమ్ముగా మార్చుకొని అతడు జీవిస్తాడు. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా  ఆ దేవతకు పొలి పెట్టి దాన్ని చేలో చల్లేవారు .  అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో  జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూ  ఉంది.

      వ్యవసాయానికి నీళ్లు ముఖ్యం కాబట్టి వ్యవసాయ దారుల దేవత గంగమ్మ అయింది. ప్రతి ఊర్లో ను గంగమ్మ గుడి ఉంటుంది.పగటిపూట వెలుగునిచ్చే   సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట వెలుగునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ  నూ దేవతలుగా చేసినారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ  పౌర్ణమినాడు పూజిిస్తారు. కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఉండేే దేవత పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవం   ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు. చాలా ఎత్తులో ఆకాశాన్ని  కొండమ్మ గా భావించి ఆకాశ దేవతకు ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు,  మెరుపులు,  గాలివాన లాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ దేవతను యేర్పాటు చేసుకున్నారు. ఇలాంటి దేవతలంతా రాతియుగంలో ఏర్పడ్డారు.ఈ రాతియుగపు దేవతలంతా స్త్రీలేే.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం