మతంగులు
మతంగుడు (మతంగ మహర్షి) గౌతమ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. అతను మంచి గుణాలు కలిగి నీతిమంతుడై, వేదశాస్త్రాలన్నీ చదువుకొని యజ్ఞకర్మలు చేసాడు.
" ఓ బ్రాహ్మణుడా, నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు"అని దారిని పోయే దానయ్య అన్నాడు.
తండ్రితో జరిగిన విషయమంతా చెప్పి, అసలు నిజం చెప్పాలని అడిగాడు. తాను బ్రాహ్మణుడు కానని తెలుసుకున్నాడు.
ఇంద్రుని దగ్గర కు వెళ్లి మతంగుడు తనకు బ్రాహ్మణత్వం ప్రసాదించమని అడిగాడు. అపుడు
ఇంద్రుడు "బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శుద్రుడు వైశ్యుడు కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా ! చెప్పు " అన్నాడు. "బ్రాహ్మణత్వము నీకెందుకు?" ఎలాగూ కొన్ని విద్యలు తెలుసుకదా.మీ గణం పూజలందుకుని సుఖపడు అని సలహా ఇచ్చాడు.
అరుంధతీదేవి మాతంగ కన్య అయినట్లే, కాటికాపరి అయిన పరమేశ్వరుడు కూడా మాతంగుడే. మతంగ మహర్షి సంతానం మాల మాదిగలు. అరుంధతీ దేవి అక్క చెల్లెండ్రు అనసూయ మొదలైన వాళ్ళంతా మతంగ వంశీయులే. అరుంధతీదేవి తమ్ముడు కపిలమహర్షి కూడా మతంగుడే. అరుంధతీదేవి, వసిష్ఠులకు పుట్టినవాడు శక్తి మహర్షి. శక్తిమహర్షికీ మాతంగ కన్యకు పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. బ్రాహ్మణ స్త్రీకి - శూద్ర పురుషునికి పుట్టినవాడు ‘చండాలుడు’ అని మనుస్మృతి చెప్తుంది. శూద్రుని వలన వైశ్య స్త్రీకి పుట్టిన వాడు అయోగుడు. క్షత్రియ స్త్రీకి పుట్టినవాడు క్షత. వీరంతా వర్ణసంకరులు. వీరే అవర్ణులు. అంటే, ఏ వర్ణానికీ చెందనివారు. వారే ‘పంచమ వర్ణం’ వాళ్ళు!
--బోయి భీమన్న, దార్ల వెంకటేశ్వరరావు.
Comments
Post a Comment