వశిష్టుడు


హిందూ పురాణాలలో ఒక గొప్ప రుషి వశిష్టుడు. మహాతపస్సంపన్నుఁడు. సప్త రుషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకరు. 
వేదాల ప్రకారం ఇతను మిత్ర , వరుణా దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. 
 అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయన  అరుంధతిని వివాహమాడాడు. వీరికి 100 మంది కుమారులు కలిగారు. వారిలో శక్తి మహర్షి జేష్టుడు. ఈతని భార్య అదృశ్యంతి. 
శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు. 
వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్భకుడు, వసుబృద్ధాకుడు, ద్యుమన్తుడు ఉన్నారని ప్రసిద్ధ గ్రంథాల వలన తెలుస్తోంది.


మరో కథనం ప్రకారం
వశిష్టుడు దక్షప్రజాపతి కూఁతురైన  ఊర్జను వివాహమాడతాడు. ఆమె ద్వారా రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందాడు. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుఁడు. నిమి శాపంతో మరణిస్తాడు. మిత్రావరుణులకు మరల జన్మిస్తాడు. 
ఒకసారి మిత్ర, ఊర్వశిని చూచి వీర్య స్ఖలితమవుతుంది. అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడు, అగస్త్యుఁడు పుడతారు.ఇక్కడ కుంభమనగా కుంభం గుర్తుగా గణమని అర్థం.  కనుక వీరిరువురుని కుంభజులు అంటారు.

సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం