మనుస్మృతిలోని కొన్ని దుర్మార్గాలు.



మనుస్మృతిలోని కొన్ని దుర్మార్గాలు..
(ఇవి మనలో కొందరికి గొప్పగా అనిపించడం విడ్డూరం)
✍ మనుధర్మశాస్త్రం 1-31 ప్రకారం - విరాట పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టారు.
✍ మనుధర్మశాస్త్రం 2-31 ప్రకారం - బ్రహ్మణులకు శుభ సూచకంగాను, క్షత్రియులకు బలసూచకంగాను, వైశ్యులకు ధనసూచకంగా, శుద్రులకు నీచంగాను పేర్లు ఉండాలి. (వ్యక్తి గుర్తింపు పేరు. ఆ పేరులోనే వాడు ఏ వర్ణానికి చెందుతాడో తెలిసిపోతుంది. అందుకే మనుషుల పేరునే దగా చేశారు)
✍ మనుధర్మశాస్త్రం 8-281 ప్రకారం - పై మూడు వర్ణాల వారికి సేవ చేయడం తప్పితే శూద్రుడికి మరే పని ఉండకూడదు. చదవొద్దు. డబ్బు సంపాదించొద్దు. (వీళ్లకు విధించే శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. వీళ్లు తప్పు చేయకపోయినా శిక్షలు విధించొచ్చు. బ్రాహ్మణులు సహా పై కులాల వాళ్లు తప్పులు చేసినా ఏమనొద్దు)
✍ మనుధర్మశాస్త్రం 2-18 ప్రకారం - దేశమందు వర్ణములన్నింటికి వంశపారంపార్యంగా వచ్చిన ఏ కులాచారాము కలదో అవే సదాచారము అనబడును. (మంచి చెడులు అనేవి మనుషులు చేసే పనుల్లో కాకుండా కేవలం పుట్టుకలోనే సృష్టించారు. శూద్రుడు ఎన్ని మంచి పనులు చేసినా దరిద్రుడే. బ్రాహ్మణుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా పత్తిత్తే. మొదట్లో వీటిని అలవాటు చేయించడానికి మంచి పనులు చేస్తే నువ్వు కూడా బ్రాహ్మణుడివి అవుతావని చెప్పారు. అయితే మరణం వరకు కాకపోవడంతో పూర్వ జన్మ పాపం అని చెప్పడం ప్రారంభించారు. ఇప్పటికీ అదే నడుస్తోంది)
✍ మనుధర్మశాస్త్రం 10-123 ప్రకారం - బ్రహ్మణుల సేవయే శుద్రునికి పవిత్రమైంది. మరేం చేసిన అతనికి ఫలితం '0'. (ప్రపంచ వ్యాప్తంగా బానిసత్వం ఉంది. కానీ ఇండియాలో బానిసత్వానికి తోడు అంటు ఉంది. అంటే ఒక మనిషిని ముట్టుకోకూడదు అనే దుర్మార్గం ఎక్కడా లేదు. లక్ష లీటర్లు, వంద సబ్బులు, వంద షాంపూలు వాడినా ఆ అంటు పోదు. వాడు బతికినన్ని రోజులే కాదు, చచ్చినా కూడా అంటే ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే వాడి పేరు పలికినా అంటే)
✍ మనుధర్మశాస్త్రం 2-10,11 ప్రకారం - వేదాలు, స్మృతులు ధర్మానికి ప్రతీకలు. వాటిని గూర్చి వ్యతిరేక ఆలోచనలు చేయకూడదు. హేతవాదంతో పరిశీలించకూడదు. అలా ఐతే వారిని నాస్తికునిగా భావించి బహిష్కరించాలి. (నాస్తికులను చంపేయాలి, రాజ్యం నుంచి తరిమేయాలి అంటూ చాలా శిక్షలే వేశారు. వాటిని ప్రశ్నిస్తే శూద్రులకు, మహిళలకు కూడా అదే పరిస్థితి)
✍ శతపత బ్రాహ్మణం ప్రకారం - యజ్జం జరిగేటప్పుడు శుద్రుడు అక్కడ కనిపించకుడదు.
(0-0 మొదటిది భాగం, రెండవది శ్లోకం)
మనుస్మృతిలో శూద్రుల నియమాలు..
✍ బ్రాహ్మణులకు దాస్యం (slavery) చేయడం కోసమే శూద్రులను బ్రహ్మ సృష్టించాడు.
✍ బ్రాహ్మలకు సేవచెయ్యడం వల్ల శూద్రుడు స్వర్గానికి వెళ్తాడు.
✍ శూద్రుడు చదువుకోకూడదు, వాడు ఉండగా వేదాలు చదవకూడదు.
✍ శూద్రునికి ఎంగిలన్నం (సగం తిని వదిలేసింది) కూడా పెట్టకూడదు.
✍ శూద్రుడు డబ్బు-ఆస్తిపాస్తులు సంపాదించుకోవద్దు. సంపాడిస్తే బ్రాహ్మణుల్ని హింసిస్తాడు.
✍ శూద్రుడు ధర్మోపదేశం చేస్తే వాడి చెవిలోను, నోటిలోను కాగిన నూనె రాజు పోయించాలి.
✍ శూద్రుడు బ్రాహ్మడిని తిడితే నాలుక కోసేయాలి.
✍ శూద్రుడు బ్రాహ్మడ్ని పేరు పెట్టి పిలిస్తే నోట్లో 10 ఇంచుల ఇనుప చువ్వ కాల్చి దూర్చాలి.
✍ బ్రాహ్మడ్ని కొట్టడానికి చెయ్యి, కాలు ఎత్తితే వాటిని నరికేయాలి.
✍ బ్రహ్మడితో సమానంగా కూర్చున్న శూద్రుడు నడుము కాల్చి పిరుదుల్ని (Butt) కోసేయాలి.
✍ శూద్రుడు ధనాన్ని బలవంతంగా లాక్కోవచ్చు. శూద్రుడు అడ్డుచెప్పొద్దు.
✍ శూద్రుడి ధనాన్ని యాచించి (భిక్ష) తెచ్చి యజ్ఞం చెయ్యకూడదు. దొంగిలించి గానీ బలాత్కారంగా లాక్కుని గానీ యజ్ఞం చెయ్యవచ్చు. (వాస్తవానికి వాడికి యజ్ఞానికి పర్మిషన్ లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్రాహ్మణుడే సలహా ఇస్తాడు)
మనుస్మృతిలో శూద్రుల కంటే దారుణంగా స్త్రీల గురించి..
✍ తండ్రి ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడో వాడికి జీవితాంతం సేవ చేయాలి. ఒక వేళ వాడు చస్తే వేరొకరిని పెళ్లి చేసుకోద్దు, వేరొకరితో శారీరక సంబంధం (sexual relationship) పెట్టుకోవద్దు. ఇలా చేస్తే పరలోకంలో ఉన్న భర్తను ఇబ్బంది పెట్టినట్టు.
✍ భర్త ఎంత దుర్మార్గుడైనను, వేరొక స్త్రీతో సంబంధం ఉన్నా ఏ పనీపాటా చేయకపోయినా వాడిని ఎల్లప్పుడూ దేవుడిలా పూజించాలి.
✍ వ్రతాలు, యజ్ఞాలు స్త్రీలకు వర్తించవు. అవన్నీ మగవారి కోసం చేయాలి. భర్తకు సేవ చేస్తేనే స్త్రీకి స్వర్గం లభిస్తుంది.
✍ భర్త చనిపోయిన తర్వాత స్త్రీ ఉప్పు-కారం తినొద్దు. దుంపలు లాంటివి తిని సెక్సువల్ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ, వేరే మగాడి పేరు కూడా పలకొద్దు.
✍ స్త్రీలను బలవంతంగా కాపాడుట ఎవ్వరితరము కాదు. కాబట్టి తనను తానే కాపాడుకుంటూ తన శీలాన్ని కాపాడుకోవాలి. ఇంటి పనులతోనో, పూజలతోనో ఆమెను ఎప్పుడూ బిజీగా ఉంచాలి.
✍ భర్త ఎంత అందహీనుడైనను (దరిద్రంగా ఉన్నా) వాడిని అవమానించకుండా వాడిని సుఖపెట్టాలి.
✍ భర్త మరొక వివాహం చేసుకున్నా కోపం తెచ్చుకోవద్దు. ఒకవేళ వస్తే కోపం తగ్గే వరకు ఆమెను కట్టేయాలి, గదిలో బంధించాలి, లేదంటే తల్లి దండ్రుల వద్ద విడిచిపెట్టి రావాలి.
✍ పురుషుడిని చూడగానే అతడితో సంగమించాలనే (sex) కోరిక స్త్రీకి వస్తుంది. స్త్రీకి వ్యభిచార దోషం వల్ల అలాంటివి కలుగుతుంటాయి.
✍ మగాడు ఎంత మంచివాడైనను స్త్రీ పాడు చేయగలదు. కాబట్టి ఆమెను ఎప్పుడూ నియంత్రణలో ఉంచాలి. ఆమెకు ఏ రహస్యం చెప్పొద్దు, ఏ అధికారం ఇవ్వొద్దు, ఎవరినీ కలవనివ్వొద్దు. ఆమె చెంచల మనస్తత్వం (తరుచూ మరిపోవడం) కలది.
✍ స్త్రీకి అలంకారాలు, కామం, కోపం, ద్రోహ స్వభావం, కపట బుద్ధి సహజంగా ఉంటుంది.
✍ స్త్రీలు స్నేహానికి పనికిరారు.
✍ స్త్రీ పాఛికల వంటిది, మధ్యం వంటిది. దుఃఖానికి కారణం. స్త్రీ శనితో సమానం.
✍ మగాడిని అనుమానితుడిని, కాపలాదారుడిని చేసింది స్త్రీనే.
✍ స్త్రీల హృదయాలను తోడేళ్ళ హృదయాలవంటింది.
✍ గొడ్రాలైనా స్త్రీని బలివ్వాలి.


దేశమందు వర్ణములన్నింటికి వంశపారంపార్యంగా వచ్చిన ఏ కులాచారాము కలదో అవే సదాచారము అనబడును. మనుధర్మశాస్త్రం 2-18

బ్రాహ్మణ స్త్రీకి - శూద్ర పురుషునికి పుట్టినవాడు ‘చండాలుడు’ అని మనుస్మృతి చెప్తుంది. 
శూద్రుని వలన వైశ్య స్త్రీకి పుట్టిన వాడు అయోగుడు. క్షత్రియ స్త్రీకి పుట్టినవాడు క్షత. వీరంతా వర్ణసంకరులు. వీరే అవర్ణులు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం