పరస్పర విరుద్ధాంశాలను సమన్వయించే సంస్కృత రచన గీత
హైందవ సంప్రదాయంలో 'భగవద్గీత'కు ప్రత్యేక స్థానముంది. క్రైస్తవానికి బైబిలు', ముస్లింలకు 'ఖురాను', హిందువులకు 'భగవద్గీత' అలాంటిది పండితుని నుండి పామరుని వరకు గీతను జీవన వేదంగాను, కర్మయోగంగాను భావించి. మనిషి ఆధ్యాత్మక జీవితానికి కావలసిన అన్ని అంశాలు 'గీత'లోనే ఉన్నాయనే భ్రమను కల్పించారు. అందుకే భగవద్గీతా పదనమంటేనే బొందితో కైలాసం చేరినట్లు భావిస్తారు. సాధారణ అస్థికులు,
వ్యాసుని ప్రోక్తమైన 'భగవద్గీతలో ధ్యానమార్గాలు, ఆత్మ-పరమాత్మల
ప్రస్తావన అధికం. వైష్ణవమత తత్వమంతా నిండి ఉంది. అందుకే శ్రీ కృష్ణుడే...
"ధర్మయుక్తమైన, సంవాదరూపకమైన, గీతా శాస్త్రాన్ని పఠించేవారు. జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వారవుతారు". 'ఏ సరుడైనా అసూయలేక శ్రద్ధతో గీతను వింటాడో, అతడు పాప విముక్తుడై పుణ్యలోకాలు పొందుతాడు".
"దీనిని పరిస్తేచాలు నీవిక ఏమీ చేసే అవసరం లేకుండానే నన్ను పూజించినంత పుణ్యం కలుగుతుంది. అట్టివారికి పునర్జన్మలులేని పుణ్యలోకాలు, ప్రాప్తిస్తాయి" అంటాడు భగవద్గీతలో, గీతలోని 18 అధ్యాయాలు కాని, లేదా సగంకాని, 6 అధ్యాయాలుకాని, ఒక అధ్యాయం కాని, కనీసం ఒక శ్లోకంగాని నిత్యం పారాయణం చేసే వాడే బ్రహ్మజ్ఞాని".
గీతా దర్శనంలో మనకు ఆసాంతం కనిపించేది వైష్ణవమత వ్యాప్తి దురదే. పోవోయ్, నాకు నేనే సృష్టికర్తను, నేను పరిణితి చెందుతున్నాను. నా బాల్యదశలోని అజ్ఞానంవలన, భయంవలన ఎందరో దేవుళ్ళను సృష్టించాను. అలాగే స్వర్గ నరకాలను సృష్టించాను. ఇప్పుడు వాటన్నింటినీ కూలగొడుతున్నాను" అనే మనిషి సహజసిద్ధ తెగువ ఇందులో కనిపించదు. అందుకే పండితులు 'గీత పరస్పర విరుద్ధ్యాలను సమన్వయించే సంస్కృత రచన మాత్రమే. వ్యతిరేక, విరుద్దాలను దిగమింగే ప్రయత్నం జరిగింది" అంటారు.
ఫ్రాంక్లిన్ ఎడ్గర్లకి గీతను సమైక్కరచనగా పేర్కొన్నాడు. కృష్ణుడు గీతను రాయలేదని, యుద్ధ రంగంలో గధ్యంలో జరిగిన సంభాషణ అంతా శ్లోకాలలో చొప్పించారనీ అభిప్రాయపడ్డారు. మొత్తం ముగ్గురు రచయితలు గీతను పూర్తి చేశారని భావించాడు. అంతేగాని వ్యాసుని ప్రోక్తంకాదు.
'గీత రచనా కాలం కూడా వివాదాస్పదమే. మనవారికి చారిత్రక జ్ఞానం లేదు. కాల జ్ఞానం లేకపోవటమే అందుకు కారణం. డి.డి. కోశించి ప్రకారం - భగవద్గీతలో వినియోగించిన సంస్కృతం క్రీ.శ. 3వ శతాబ్దికి చెందింది. అంతకుముందుగా రచన జరిగినదనటానికి వీలులేదన్నాడు. గీతను ప్రాచీనతకు నెట్టివేయాలనే వారు గీతలో బ్రహ్మసూత్ర ప్రస్తావన తెస్తారు. బాదరాయణిని బ్రహ్మసూత్రమే గీతలో ఉంటే బౌద్ధం అనంతరమే భగవద్గీత వచ్చి ఉండాలి. బ్రహ్మసూత్ర ప్రస్తావన అలా ఉంచి గీతలో వేదాంత ప్రస్తావన కూడా వుంది. బౌద్ధం అనంతరం. బ్రహ్మసూత్ర అనంతరం గీత వచ్చిందనటానికి ఇదొక ఆధారం.
గీత వేదమూ కాదు, వేదాంగమూ కాదు. దీనికి పవిత్రత తరువాత ఎప్పుడోగాని రాలేదు. ఆదిశంకరాచార్యుడి ముందు గీతను ఎవరూ తీవ్రంగా పట్టించుకోలేదు. ఇబ్బంది కలిగించే మాటలను తనకనువుగా మార్చుకున్నాడు. శంకరాచార్యుని అనంతరమే గీతకు ఆధిపత్యం లభించినదని యస్.కె. బెల్వాల్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఈ 'గీత దర్శనాన్ని' పరిశీలిస్తే అన్ని విషయాల కన్నా 4 లేక 5 అంశాలపై దృష్టినిలిపింది. దీనిలోని ప్రధాన అంశం' కౌరవులను తక్కువ చేయటం, పాండవులను ఎక్కువ చేసిచూపటం', గీతలో ఆసాంతం కౌరవులను హీనులుగా చూపే ప్రయత్నమే మనకు కనిపిస్తుంది.
"ధృపద పుత్రుడు వ్యూహాత్మకంగా నిర్మించిన పాండవ సైన్యాన్ని చూడండి. సాత్యకి, విరటుడు, దృపదుడు, దుష్టకేతువు, చేరితానుడు, వీరకాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, శైఖ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపధేయులు - అంతా మహారధులే. ఇక మనసైన్యంలో ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, అపరిమితం. పాండవ పక్షం పరిమితం".
పాండవులది మహాసైన్యమంటూ 18 మంది యోధుల పేర్లు, కౌరవపక్షం
విశిష్టులను 8 మందిని మాత్రమే పేర్కొంటాడు. ఇవి నిజంగా దుర్యోధనుని మాటలేనా? "కౌరవ శంఖారావాలు భయంకరంగా దిక్కులు పిక్కటిల్లేటట్లు చేశాయి. పాండవపక్షం మహాయోధులు మహాశుభానినాదాలకు భూమ్యాకాశాలు దద్దరిల్లటమేకాక దార్తరాష్ట్రుల హృదయాలు కకావికలమయ్యాయి"
ఇలా వ్యాసుడు భగవద్గీతలో మొదటి నుండి కౌరవులను తక్కువజేసి చూపటం, పాండవులను గొప్పజేసి చూపటం జరిగింది. అలా దుర్యోధనుని చేతనే చెప్పించటం విశేషం.
భగవద్గీత హింసాబోధకు, ఆ పేరున వైరాగ్యాన్ని, ఆధ్యాత్మికత అనే దాన్ని కప్పిపుచ్చుకునే సాకు మాత్రమే. అపార కౌరవసైన్యాన్ని, బంధుమిత్రులను, హికులను చూచిన అర్జునుడు పలాయనం చిత్తగించగా అతనికి చేసిన జ్ఞానబోధే 'భగవద్గీత..
"ఈ మనుషులు లేనినాడు రాజ్యం ఎక్కడుంది. సుఖాలు ఎలా లభిస్తాయి. ఏ ప్రయోజనాన్ని ఆశించి యుద్ధ ప్రకటన జరిగిందో ఆ ప్రయోజనమే లేనపుడు ఇక ఈ యుద్ధందేనికి". ఇది భయకంపితుడై అర్జునుడు చేసిన ఆర్తనాదంగా అండనా వేయలేము. యుద్ధ వినాశం, దానివల్ల జరిగే అపారనష్టం గురించి అంచనాలేనివాడు కాదు అర్జునుడు. ఇదంతా ఓ విచిత్రం.
"అధర్మం జరిగితే కులస్త్రీలు ధూషితులవుతారు. వర్ణ సాంకర్యం జరుగుతుంది. కనుక యుద్ధం చేయటంతగదు... వద్దు కృష్ణా... ఈ పాపం నేను చేయను". అప్పుడు శ్రీ కృష్ణుడు "అర్జునా నీవు శోకంలో వున్నావు. ఈ ప్రాణం
గురించి ఏమేమో మాట్లాడుతున్నావు. ఆత్మ శాశ్వతం. దీనిని ఎవ్వరూ నాశం చేయలేరు. ఈ శరీరాలు నశిస్తాయి. ఆత్మ నాశనం కాదు. ఇది పుట్టదు, గిట్టదు. కనుక నీవు యుద్ధం చేయి. పుట్టిన వానికి మరణం, మరణించిన వానికి పునర్జన్మ నిశ్చయం. జనన మరణాలకు నీవు కారకుడవుకావు".
"జాతస్యహిదువో మృత్యుః; ద్రువం జన్మమృదస్యచ" “తధాదేహాచరప్రాప్తిః" "వాసాం సి జీర్ణాని" "నైనం చిదంతివస్త్రాని”
యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం, గెలిస్తే రాజ్యబోగాలు. కర్మ చెబుతూనే ఏ ఫలాపేక్ష లేకుండా కర్మ చేయమంటాడు కృష్ణుడు. ఇలా సాగుతుంది గీతా కృష్ణుడు బోధన, ఆత్మ, పరమాత్మ - నాశనం.
లేనిదైన ఆత్మ అంటూ ఆత్మసారాన్ని బోధించాడు. మరి ఆత్మలే చనిపోతే, ఆత్మలే యుద్ధాలుచేస్తే, ఆత్మలే మనిషిని నడిపితే మరి మనిషి ప్రయత్నం ఏమిటి? సంకల్పం ఏమిటి? అయినా యుద్ధ భూమిలో ప్రవేశించాక కృష్ణార్జునులిద్దరూ 700 శ్లోకాలు
పాడుతుంటే, ఆ యుద్ధభూమికి చేరిన వారంతా చోద్యం చూస్తూ వుండిపోయారా? అర్జునా! నా మతాన్ని అనుసరించనివారంతా అజ్ఞానులే. కామంవలన జ్ఞానం కప్పబడటం వలన అజ్ఞానంతో, మోహంలో పడిపోతారని, అర్జునుని భ్రమింపజేయటం దీని ఆంతర్యం.
'అజ్ఞాత జ్ఞానం' -
కురుక్షేత్రంలో 11 అక్షౌహినుల మత వ్యతిరేకులు (వైష్ణవమతం) ఉన్నారు. కనుక వారిని వధించటం. అందుకే యుద్ధం అన్నట్లు వుంది గీతాబోధన. గీతా
ప్రదేశంలో శ్రీ కృష్ణుడు ద్వంద్వవైఖరితో తానేమి చెపుతున్నారో, ముందు ఏమంటారో. చచ్భిన్నంగా ఏ మాట అంటున్నాడో కూడా తెలియని యుద్ధ మోహంలో ఉంటాడు శ్రీకృష్ణుడు, కామం జ్ఞానాన్ని కప్పుతుంది. నేనే జ్ఞానాన్ని అంటాడు కృష్ణుడు. తప గొప్ప మహిములు ఎవరికి అంతుచిక్కవంటూ తలాతోకా లేకుండా మాట్లాడటం శ్రీ కృష్ణుని వలకు
"నేను జన్మరహితుణ్ణి, సమస్త ప్రాణులకు ఈశ్వరుణ్ణి
"అజ్ఞానులు నన్ను జన్మరహితునిగాను, శాశ్వతునిగాను తెలుసుకోలేదు" "నన్ను జన్మరహితునిగాను, లోకేశ్వరునిగాను తెలుసుకునే వాడే అని "అధర్మం పెరిగినప్పుడు దుష్టశిక్షణకోసం నేను యుగయుగాల్లో పుడకాను.
ఇదీ కృష్ణుని ఉవాచ తనను తాను పొగుడుకోవటం, మిగిలిన వారిని తక్కువకేసి చూపటం మినహా మనకేమి కనిపించదు. ఇక కర్మయోగం గురించి. కృష్ణుణి ఉవాచ......
"అర్జునా! నా జన్మలు, కర్మలు దివ్యాలు"
"కాబట్టి నీవు పూర్వలాగా కర్మల్ని ఆచరించు.
"వేదాల్లో చెప్పబడ్డ కర్మలు చేసేవారు, సోమరసపానం చేసేవారు పావు రహితులై యజ్ఞాలద్వారా నన్ను సేవించి స్వరాన్ని పొందుతారు."
వేదాలు చెప్పిన యజ్ఞాలన్నింటినీ ఆచరించమని ఒకచోట, వేడ ప్రతిపాదిత యజ్ఞకర్మలు త్రిగుణాత్మక భోగాలకు సంబంధించిన వికారంగా వాటిని త్యజించమని
వేరొకచోట చెపుతాడు.
"శరీరాలలో ఆత్మగావున్న కుష్టుని ద్వేషిస్తారట' - అలా ద్వేషించే వారిని
అసురయోనులలో పడేస్తారట.
"సర్వప్రాణులలో ఆత్మరూపుడైన పరమాత్మను నేనే"
"దాతను, తల్లిని, తండ్రిని, ఓంకారాన్ని, వేదాలను నేనే" "సర్వప్రాణుల ఉత్పత్తి బీజం నేనే"
"నా పుట్టుకను దేవతలు, మహర్షులు కూడా ఎరుగరు
పరస్పర విరుద్దాలు, పరాటోపాలమయం గీతాదర్శనం. కృష్ణుడు అర్జునుని యుద్ధానికి పురికొల్పాలనే లక్ష్యంతో తానేమి మాట్లాడుతున్నాడో తెలియని స్థాయిలో మాట్లాడాడు. ఇంకాఏమేమి మాట్లాడాడో చూద్దాం.
"ద్వాదశ ద్విజుల్లో విష్ణువును నేనే"
"జ్యోతిర్మయి స్వరూపంలో సూర్యుడ్నినేనే" "నక్షత్రాధిపతినైన చంద్రుడ్ని నేనే"
గీతలోని 18 అధ్యాయాల నిండా యుద్ధబోధే కృష్ణుడు అర్జునిని యుద్ధానికి సన్నద్ధం చేయటమే దీనిలోని రహస్యం.
"పవిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాః ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే".
విష్ణువును చంపదలచుకున్నవారంతా ఎదిరించలేక ఎక్కడో దాక్కున్నట్లు గాని, అతని అవతార మహిమ ఏమైంది. వైష్ణవమత వ్యాప్తి కృష్ణుని ధ్యేయం. ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో యుద్ధం చేయటమేమిటి? మరి చంపిందెవరు? చచ్చేదెవరు? ఆత్మగల శరీరమా? శరీరాన్ని ధరించిన ఆత్మా?
ఇవేకావు. భారతదేశం నేడనుభవిస్తున్న కులబీజాలకు కారణం గీతే. మనుషులను రకరకాలుగా పుట్టుకతోనే విభజించే సంస్కృతి శ్రీకృష్ణుడిదే. అందుకే.
కృష్ణుడు.
"చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః"
నాల్గు వర్ణాలు నాచే సృష్టించబడినవేనంటూ ప్రగల్భాలు పలికే కృష్ణుడు. జనాలను 4 వర్ణాలుగా విడదీసి, వారికి ఉచ్ఛనీచ తారతమ్యాలు ఏర్పరచి, సామాజిక న్యాయలుప్తానికి నాంది పలికాడు.
హైందవ సంప్రదాయంలో ఇలాంటి గ్రంధాలు కోకొల్లలు, వేదాలు,
బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఒకటేమిటి టన్నుల కొద్ది సాహిత్యాన్ని సృష్టించారు మన శ్రేష్ఠులు. ఆధునిక కాలంలో ఏదైనా ఒక సంశయం ఏర్పడితే అన్నీ వేదాలలో ఉన్నాయనే ఉద్ధండులు అధికమయ్యారు.
(చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి రాసిన గీతా దర్శనం నుండి)
కుర్రా హనుమంతరావు, M.A., B.Ed.
అధ్యక్షులు,
భారత హేతువాద సంఘం, ఇంకొల్లు,
(1_9_2013)
Comments
Post a Comment