అంబేద్కర్ ఆధునిక తాత్వికత , దార్శనికత

భారతదేశంలో  ఆధునిక తాత్వికుడు, మానవతావాది  అంబేద్కర్‌ 
           Ambedhkar buddha

జై భీమ్ అని ప్రేమగా పిలుచుకునే ‌భీంరావ్ అంబేద్కర్‌ 1891, ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మౌ ప్రాంతంలో రాంజీ, భీమాబాయ్‌ దంపతులకు జన్మించాడు. 1956 డిసెంబర్‌ 6న మరణించిన ఆయనది సాఫల్య జీవితం. ఉత్తేజభరిత జీవితం. విద్యార్థిగా అవమానాల్ని ఎదుర్కొని అంటరాని తనానికి, వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా ధిక్కార స్వరంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటబావుటాగా నిలిచారు.

 అత్యంత కష్టభూయిష్టమైన వివక్షతల, అవరోధాల మధ్య, ఏటికి ఎదురీదుతూ కఠినమైన శారీరక, మేధోపరిశ్రమతో, సంఘర్షణాత్మక దృక్ఫదంతో ,పీడిత ప్రజలకు విముక్తి మార్గాన్ని, సమానత్వం తో కూడిన సామాజిక విప్లవం తో కూడిన గొప్ప తాత్విక దృక్పథాన్ని అందించాడు.అవి ఆధునిక భారతంలో జరిగిన రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం లో  గణనీయ పాత్ర వహించాయి.


భారత దేశం ఒక ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక, స్వయం సంపన్న దేశంగా ఎదగడానికి అవసరమైన విధానపరమైన అభివృద్ధి నమూనాను, అందుకు ఆధారమైన రాజ్యాంగ వ్యవస్థల్ని సృష్టించారు. ఆయన దళితులకు మాత్రమే ఆరాధ్యుడు కాదు, భారతదేశంలోనే కాదు ఆమాటకొస్తే ప్రపంచంలోని నేతలు, మేధావుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు. 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది' అన్న కాళోజి మాటలకు నిలువెత్తు ప్రతిరూపం ఆయన. నమ్మిన సిద్ధాంతాలకు, ఆదర్శాలకు జీవితమంతా కట్టుబడి పనిచేశారు. వెలివాడల బతుకుల్లో తను ఒక వెలుగుల ప్రస్థానం అయ్యారు. అమానవీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమ కేంద్రమయ్యారు. ఆయన జయంతిని ఐక్యరాజ్యసమితి అధికారికంగా జరుపుతున్నదంటే, అంతర్జాతీయంగా పెరిగిన ఆయన ప్రాధాన్యతను, ప్రాసంగికతను అర్థం చేసుకోవచ్చు.

డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ వేల సంవత్సరాల అమానవీయ కులవివక్షను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రజలకు అందించారు. దేశానికి 'సామాజిక డాక్యుమెంట్‌'గా ప్రశంసించబడ్డ ఒక లిఖిత రాజ్యాంగాన్ని అందించారు.

అంబేద్కర్‌ రాజ్యంగ నిర్మాతగా అణగారిన వర్గాలు, మహిళా విముక్తి ప్రధాతగా ప్రాచుర్యం పొందాడు. ఇదే సమయంలో భారత వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి లోతైన అధ్యయనంతో విలువైన సూచనలు చేసి, ఆర్థిక వ్యవస్థ కు బలమైన పునాదులను ఏర్పరిచారు. సామాజిక అభివృద్ధికి భూసంస్కరణల అమలు అవశ్యకమైనదిగా భావించాడు. పెట్టుబడిదారి వ్యవస్థ సృష్టించే అసమానతలు, మానవ మర్యాదకు రాజ్యాంగ ఔన్నత్యానికి ప్రమాదకరమని తెలియజేశాడు.

1907లో ఎల్ఫిన్‌ స్టోన్‌ (బాంబే యూనివర్సిటీ) నుండి మెట్రిక్‌లేషన్‌ పాసయ్యారు. 1912లో అదే యూనివర్సిటీ నుండి ఆర్థికశాస్త్రం, రాజనీతి శాస్త్రాలు అంశాలుగా డిగ్రీ పాసయ్యారు. బరోడా రాజసంస్థానం స్కాలర్‌షిప్‌తో న్యూయార్క్‌లో కొలంబియా యూనివర్సిటీలో చేరి అర్ధశాస్త్రంలో ఎం.ఎస్‌సి పట్టా, పరిశోధనా పత్రాలు సమర్పించి పి.హెచ్‌డి పట్టాలు పొందారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుండి డిఎస్‌సి (ఎకనమిక్స్‌) సాధించారు.

1915లో ప్రాచీన భారత వాణిజ్యం, బ్రిటిష్‌ ఇండియాలో ప్రాంతీయ ఆర్ధిక వికాసంలపై పరిశోధనలను చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం లో డాక్టరేట్‌ అందుకున్నాడు. 1921 లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ”ప్రొవిన్షియల్‌ ది సెంట్రలైజెషన్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా”, రూపాయి సమస్యల పై పరిశోధన పత్రాలను సమర్పించి, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పట్టాను పొందాడు. భారత కరెన్సీ, బ్యాంకింగ్‌ చరిత్ర పై వివరణాత్మక పుస్తకాలను వ్రాశాడు. వీటిలో బ్రిటిష్‌ సామాజ్రవాద ఆర్ధిక విధానాలను విమర్శిస్తూ వాటి వలన ఇండియాలో ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయని, భూమి శిస్తు అధికంగా ఉండి, రైతుల పై పెనుభారాన్ని కలిగిస్తుందని అన్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అధికారులు, వ్యాపారుల పై ఏలాంటి పన్నులు వసూలు చేయడం లేదని, ప్రభుత్వ రాబడులలో 80% రక్షణ, న్యాయ పాలన పై వ్యయం చేస్తున్నారని ప్రజల ప్రగతికి తొడ్పడే మౌళిక రంగాలైన విద్య, వైద్యం, నీటిపారుదల, రహదారులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అర్ధశాస్త్ర ఆచార్యుడిగా బోంబాయిలోని ఎల్ఫిన్ స్టన్ కళాశాలలో ,బెనారస్ హిందు కళాశాలలో పనిచేసాడు .


విద్యాభ్యాసం పూర్తయి స్వదేశానికి తిరిగొచ్చాక అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టారు. దళితులకు జీవించే హక్కున్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని భావించాలని అంబేద్కర్ అభిప్రాయ పడ్డారు.బహిరంగ చెరువుల్లో నీరు తాగే హక్కుకోసం 1927లో దళితుల్ని సమీకరించారు. నాసిక్‌ దేవాలయ ప్రవేశం కోసం 1930లో ఉద్యమించారు. సంపద, ఉత్పత్తి సాధనాలు కొందరి సొత్తుగా వుంటే బడుగుల బతుకులు బాగుపడవని 1937 సెప్టెంబర్‌ దళిత మహాసభలో హెచ్చరించారు. భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం 1938లో కొంకణ్‌ రైతాంగ ప్రదర్శనలో పాల్గొన్నారు. జాతిని చైతన్య పరిచేందుకు మూక్‌ నాయక్‌, బహిష్కృత భారత్‌ పత్రికలకు సంపాదకత్వం వహించి నడిపారు. ప్రపంచమంతా వర్గసమాజ చరిత్ర అని, భారత దేశం ఇందుకు మినహాయింపు కాదని, ఇక్కడ వర్గంలోనే కులం ఇమిడి వుందని సిద్ధాంతీకరించారు.వారు గౌరవప్రదంగా  జీవించాలంటే వారికి కొన్ని చట్టబద్ధంగా సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగంలోవారికి నియమాలను రూపొందించారు.

మన దేశ వ్యవసాయ రంగంలో చిన్న కమతాల వలన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుందని, దానికి పరిష్కారం కమతాల సమీకరణ అనే వాదాన్ని తోసిపుచ్చాడు. 1928లో అంబేద్కర్‌ ”ఇండియాలో చిన్న కమతాలు – పరిష్కారాలు” అనే రచనలో పెట్టుబడి, ఉత్పత్తి సాధనాలను సరైన పాళ్ళలో ఉపయోగిస్తే గరిష్ఠ ప్రతిఫలం, రాబడి ఉంటాయన్నారు. పెట్టుబడులకు మించిన రాబడులు వస్తే, అది లాభాసాటి కమతం అవుతుందని చెప్పాడు. అక్టోబర్‌ 10, 1927లో బొంబాయి శాసనమండలిలో మాట్లాడుతూ భారతదేశంలో సాధారణ జీవన ప్రమాణాన్ని పెంచాలంటే వ్యవసాయంగా నుండి కొంత మంది శ్రామికులను పరిశ్రమల వైపు మళ్ళించాలని సూచించాడు. ఫలితంగా ఈ రెండు రంగాలలో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. దీని కొరకు ”స్టేట్‌ సోషలిజం”ను ప్రతిపాదించాడు. భూమిని ప్రభుత్వ యజమాన్యంలో ఉంచి సమిష్టి, సహకార వ్యవసాయ పద్దతిని అనుసరించాలి. వ్యవసాయానికి పరిశ్రమలకు కావల్సిన మూలధనాన్ని ప్రభుత్వము సమకూర్చాలి. దీని వల్ల నిరుపేదలకు ఉపాధి భద్రత, కనీస ఆదాయాలు లభించి గ్రామీణ పేదరికం, సంపద మరియు ఆదాయాల పంపిణిలో అసమానతల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందన్నాడు.

రాజ్యాంగ సభకు తను సమర్పించిన డ్యాకుమెంట్‌లో ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థ దేశానికి మార్గమన్నారు. వ్యవసాయ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని, యాంత్రీకరణ అవసరమని అన్నారు. సాగుకు యోగ్యమైన భూముల్ని నష్టపరిహారం చెల్లించి భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలన్నారు.


జర్మన్‌ తత్వవేత్త పెర్డినాండ్‌ లాసెల్లే ప్రతిపాదించిన స్టేట్‌ సోషలిజం నమూనా బీదలు ఎక్కువగా ఉన్న మన దేశంలో సమానత్వం, సామాజిక భద్రతకు దోహదం చేస్తుందని భావించాడు. ఈ భావనను తనదైన శైలిలో విస్తరిస్తూ ”స్టేట్స్‌ అండ్‌ మైనారిటిస్‌” అనే రచనను 1947లో రాజ్యంగ పరిషత్తుకు మెమోరాండంగా సమర్పించాడు. 

 1945లో తాను రాసిన స్టేట్స్ అండ్ మైనారిటీస్' అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమినీ, భారీ పరిశ్రమలనూ, బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు.

అవన్నీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలని ప్రతిపాదించాడు. భీమారంగం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండి ప్రతి పౌరునికి ఆదాయానికి తగిన జీవిత భీమా చేయించాలని, సూచించాడు. పరిశ్రమలను రాజ్యం నిర్వహించినప్పుడు వచ్చే మిగులును మళ్ళీ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించాలన్నాడు. పెట్టుబడిదారి విధానానికి లాభార్జన తప్ప మానవముఖం ఉండదని తెలియచేసాడు . తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించాలని అప్పుడే సాంఘీక భద్రత చర్యలు అమలుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. వ్యవసాయం పైన ఆధారపడిన జనాభాకు భద్రత అత్యంత అవసరమని గుర్తిస్తూ, పంటల భీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి, తద్వారా మనదేశంలోని గ్రామీణ ప్రజల బ్రతుకులను మెరుగుపరచడంలో, కరువు కాటకాల భయానక పరిస్థితులను తగ్గించడంలో ప్రగతి సాధించవచ్చునని తెలియజేశాడు. భూసేకరణలో నష్టపరిహారాన్ని చాలా ఉదారంగా చెల్లించాలని ప్రతిపాదించాడు. ప్రవేట్‌ వ్యక్తుల ఆధీనంలో వున్న పరిశ్రమలు, భీమా సంస్థలు, మరియు వ్యవసాయ భూముల యాజమాన్య హక్కులను ప్రభుత్వం స్వీకరించి, వారికి నష్టపరిహారాన్ని డిబెంచర్ల రూపంగా చెల్లించాలని ప్రతిపాదించాడు. సమిష్టి వ్యవసాయం ద్వారానే అణగారిన, అస్పృశ్య వర్గాల శ్రామికులకు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నాడు. అప్పుడే ప్రతి వ్యక్తికి ఒకే విలువ అను ప్రజాస్వామ్య సూత్రం అర్థవంతమవుతుందని చెప్పినాడు.

దేశానికి స్వేచ్ఛ ఎలా జన్మహక్కో... ప్రతి కార్మికుడికి సమ్మె హక్కు జన్మహక్కని ముంబయి అసెంబ్లీలో ఉద్ఘాటించారు. 

అంబేద్కర్‌ ”స్టేట్‌ సోషలిజం”ను రాజ్యాంగ చట్టంగా రూపొందించాలని, ప్రాథమిక హక్కులలో చేర్చాలని ప్రయత్నం చేసాడు. ఈ ప్రతిపాదనలను రాజ్యాంగపరిషత్‌ సంపూర్ణంగా అంగీకరించలేదు. దీనికి అంబేద్కర్‌ స్పందిస్తూ రాజ్యంగ బద్ద హక్కులతో ప్రతి వ్యక్తి తనకు వచ్చిన పనిని చేసుకోవచ్చు.కానీ అదే సమయంలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఇతరులను పాలించే, పెత్తనం చెలాయించే అధికారాలను కట్టబెట్టకూడదని చెప్పాడు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు ఉండే స్వేచ్ఛ , అమానవీయ, ఆధిపత్య దోపిడి హింసలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. అంబేద్కర్‌ తన సమశీల వాదనలతో ఉపాధి హక్కు, విద్య, ఆరోగ్య హక్కు, ఆర్ధిక వనరులలో భాగానికి హక్కు, విద్య, ఆరోగ్య హక్కు, సంపద సమాన పంపిణి వంటి అంశాలు ఆదేశిక సూత్రాలలో చేర్చబడ్డాయి. అయితే ఇవి రాజ్య వ్యవస్థకు మార్గదర్శక సూత్రాలేగాని, తప్పనిసరిగా అమలు పరచాల్సినవి కావు. సామాజిక ఆర్ధికాభివృద్ధి అంశాలలో అంబేద్కర్‌ ఆలోచనలను సోషలిస్టు దృక్పథం ఉన్న నెహ్రూ తన హయాంలో వీలైనంత వరకు అమలు పరిచాడు. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం నిర్వహణ, భూసంస్కరణలు అమలు, రవాణా, శక్తి, ఇంధనం, గనులు, రక్షణ రంగాలలో ప్రభుత్వ రంగంలోనే భారీగా పరిశ్రమలు స్థాపించడం చేశాడు. ప్రైవేట్‌ పరిశ్రమలు, వ్యాపార సంస్థల పై గుత్తాధిపత్యం నియంత్రించే చట్టాలను రూపొందించాడు.

1990 నుండి పాలకులు అమలు జరుపుతున్న అనేక ఉదారవాద పెట్టుబడిదారీ సంస్కరణ విధానాలు రాజ్యాంగంలో ఉన్న అనేక సామాజిక, ఆర్థిక హక్కులను, ప్రజాస్వామ్యవ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. సంక్షేమ రాజ్య, సామాజిక భద్రతతో స్థాపించబడిన ప్రభుత్వ యాజమాన్య పరిశ్రమల నుండి పెట్టుబడులను ఉపసంహరణ కోసం రాజ్యాంగ దార్శనికతకు విరుద్ధంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది పాలకవర్గం. ఇప్పుడు మొత్తం అమ్మకానికే పెట్టింది.కార్పొరేట్ సంస్థలకు లక్షలాది రూపాయల పన్ను రాయితీలను ఇస్తున్నది.ఈ సంస్థలు సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా మాహమ్మారి సమయంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఉన్న దేశాలు నియంత్రణలో మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పాలకులు తప్పుల తడకల రాజకీయ ఆర్థిక విధానాలు ఆర్ధిక నేరస్థులకు ఫలవంతమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. రిజర్వు బ్యాంకుతో సహా ఇతర జాతీయ బ్యాంకుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 10 శాతంగా ఉన్న ధనవంతుల ఆదాయాన్ని అనుహ్యంగా అనేక వేల రేట్లు పెంచింది. ఉద్యోగ కల్పనలో తీవ్ర వైఫల్యం చెందింది. 2017-18లో గత 45 సంవత్సరాలలో ఎన్నడు లేన్నంతగా అత్యధిక నిరుద్యోగ రేటు నమోదు అయ్యింది.


వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సామాజిక భద్రత, విద్య, ఆరోగ్యం, ఆహారభద్రత రంగాలు తక్కువ కేటాయింపులతో నిర్లక్ష్యానికి గురైనాయి. అనేక పంటలకు కనీసం మద్దతు ధర ప్రకటించకపోవడం, ప్రకటించిన పంటలను సేకరణలో వైఫల్యంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది.ఇప్పుడు ప్రజా ,రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు చావు దెబ్బ తీస్తున్నాయి. నోట్ల రద్దు చర్యతో వ్యవసాయం పై ఆధారపడిన అనేక జీవితాలు, అసంఘటిత రంగంలోని శ్రామికుల జీవితాలు తీవ్ర కల్లోలానికి లోనైనాయి. 

ప్రవేటీకరణ, సరళీకరణ ప్రపంచీకరణ విధానాలతో రాజ్యం సంక్షేమ రంగాలను నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వ పరిశ్రమలను అమ్మడం, స్వదేశి, విదేశి పెట్టుబడుల పై నియంత్రణ ఎత్తివేయడం, అన్ని రకాల అనుమతులను, మినహాయింపులను సులువుగా ఇవ్వడంతో సాధారణ ప్రజల జీవనం వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెషన్‌ 2020 నివేదిక ప్రకారం దేశంలో ఒక శాతం జనాభా అధీనంలో 50శాతం సంపద కేంద్రీకృతమైనదని, 10 శాతం జనాభా 3/4 వంతు సంపదను అనుభవిస్తునదని పేర్కొన్నది. స్వయం ప్రతిపత్తి గల గణాంక సంస్థలను ప్రభావితం చేస్తూ తప్పుడు లెక్కలతో ఆర్థిక వృద్ధి రేటును ఎక్కువగా చేసి చూపెడుతుంది. కావున పెరుగుదల రేటు ఒక డొల్ల తనంగా నిరూపితమైనది. ఆర్థిక వ్యత్యాసాలు కని విని ఎరగని స్థాయిలో విస్తరిస్తున్నాయి.


ఈ నేపధ్యంలో అంబేద్కర్‌ ప్రవచించిన విద్య వైద్యం వనరులు ఆధీనంలోకి ఉంచుకునే స్టేట్‌ సోషలిజం, ఆర్థికాభివృద్ధి భావనలకు మరింత ప్రాసంగికత ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న సాంఘీక రాజకీయ ఆర్థిక అసమానతలను తొలగించడానికి ప్రజలను దారిద్య్రం నుండి ఆర్థిక దోపిడి నుండి అంబేద్కర్‌ సూచించిన సంక్షేమ  విధానాలు దీపస్థంభంగా నిలుస్తున్నాయి. వీటి అమలుకు  ప్రజా ఉద్యమాల నిర్మాణం వైపు పౌర సమాజం కదలాలి. 26 జనవరి, 1950న అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో ”సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిరాకరించడాన్ని మనం ఎక్కువ కాలం కొనసాగించినట్లైతే మన రాజకీయ ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుంది. ఈ పరస్పర వైరుద్దాన్ని మనం వీలైనంత త్వరగా తొలగించాలి. లేకున్నట్లైతే ఈ రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి, నిర్మించినటువంటి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానత్వం వల్ల బాధపడే వారు తుత్తునియలు చేస్తారాని నొక్కి చెప్పారు”. జోకింఅల్వా అను జర్నలిస్టు బాబా సాహెబ్‌ గురించి ”డా|| అంబేద్కర్‌ ప్రతి చోట పిడుగులు కురిపించాడు, తన ప్రజల ఉద్దారకుడిగా కీర్తించబడ్డాడు. భూగర్భం నుంచి పైకెగిసి భూమినే అంటిపెట్టుకున్న మనిషి, అసాధారణ శక్తి, అద్భుత వివేకం, కార్యదీక్ష, ధైర్యం ఆయన్ను భారత దేశానికి నిజమైన నాయకుడిగా నిలిపాయి” అని పేర్కొన్నాడు. 

"సంకల్పమే వ్యక్తికి శక్తినిస్తుంది, నాకు కలిగిన జ్ఞానమంతా  నా శ్రమ ఫలితమే అని అంబేద్కర్ అంటారు. జ్ఞానం గురించి చెబుతూ తన విజ్ఞానమంతా తన కష్ట ఫలితమే అంటారు.జ్ఞానం వస్తువు కాదు. అది పని, శ్రమలతో సముపార్జించుకోవాలి. ఇందుకు ఏకాగ్రత ముఖ్యం. నాకు  దేవుళ్ళు, దెయ్యాలు, మహిమల పట్ల నమ్మకం లేదు. ఎవరైతే కష్టపడతారో వారు ఇతరుల కన్నా ఒక అడుగు ముందుంటారు. జ్ఞానం కేవలం అధ్యయనం ద్వారా మాత్రమే లభిస్తుంది."
 అన్నాడు Dr.B.R.Ambedkar.

అంబేద్కర్‌ దళితుల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం మాత్రమే పనిచేసిన నేతగా ప్రచారం చేయడం సరైంది కాదు. దేశానికి అవసరమైన విధానపరమైన మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడా యన. ప్రజాస్వామ్యంపై, సామాజిక న్యాయంపై ఆయన చేసిన తాత్విక ప్రతిపాదనలు మరో వందేళ్లదాకా ఆయన ప్రాసంగికతను పెంచుతున్నాయి. బోధించు, సమీకరించు, పోరాడు అన్న ఆయన నినాదం ఎప్పటికీ స్ఫూర్తి మంత్రమే. దేశ ప్రజల వాక్‌ స్వాతంత్య్ర హక్కు ఆయన రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష. 


1913 నుంచి 1917 వరకు అంబేడ్కర్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ఆయనను ఒక తాత్వికుడిగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశా న్నిచ్చింది. దానికి ప్రధానమైన వ్యక్తి ఆయన గురువు ప్రొఫెసర్ జాన్ డ్యూయీ. పంతొమ్మిదవ, ఇరవైవ శతాబ్దాలలో అమెరికాలోని తాత్వికుల్లో జాన్ డ్యూయీ అగ్రగణ్యుడు.ప్రజాస్వామ్య భావనను ఆధునికంగా ఆలోచించిన వాడు జాన్ డ్యూయీ. ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ సహా అనేక మంది పరిపాలనా సంబంధమైన విషయంగా వ్యాఖ్యానిస్తే, జాన్ మాత్రం దానిని ఒక సామాజిక అంశంగా, యావత్ సమాజానికి సంబంధించిన విషయంగా, మానవ సంబంధాలకు విస్తరింపజేశాడు.'ప్రజాస్వామ్యం - విద్య' అనే పుస్తకంలో రాసిన విధంగా, అంబేడ్కర్ ప్రకారం "ప్రజాస్వామ్యం కేవలం పాలనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల మధ్య, ప్రజల జీవనానికి సంబంధించినది. వారి మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించేది". అయితే అంబేడ్కర్ తన మొత్తం ప్రయాణంలో ప్రజాస్వామ్య తాత్విక పునాదిని అర్థం చేసుకున్నాడు. అంబేడ్కర్ ప్రజాస్వామ్యాన్ని అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా మలుచుకున్నాడు. ఆయన 1916లో కులాల పుట్టుక అనే అంశంపై పరిశోధన చేసి, దానిని కుల నిర్మూలనలో ఒక లక్ష్యంగా చేసుకొని, బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా మనకు అందించారు.

    మహిళల ఆస్తి హక్కు కోసం ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్లును మితవాదుల ఒత్తిడికి తలొగ్గి నెహ్రూ ప్రభుత్వం ఉపసంహరించుకోగా, ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

     దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి. గత 45 సంవత్సరాలలో దేశంలో ఎన్నడూలేని స్థాయిలో నిరుద్యోగత పతాకస్థాయికి చేరుకొని భయపెడుతున్నది. ఉపాదికి ప్రైవేటు రంగమే శరణ్యమైపోయింది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వసాధారణమైపోయాయి.

అత్యధిక గ్రామీణులు ఆధారపడ్డ వ్యవసాయాన్ని కాపాడే పద్ధతుల్లో సాగు చట్టాలు లేవు. దళారీ వ్యవస్థకే ప్రభుత్వం కొమ్ము కాస్తున్నది. కార్పొరేట్‌ వ్యవసాయానికే మొగ్గు చూపుతున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలని మార్కెట్‌ ఇష్టారాజ్యానికి వదిలేసారు. అత్యంత కీలకమైన కోవిడ్‌ సంక్షోభ కాలంలో కేంద్ర పాలకులు వ్యవహరించిన తీరు మురికివాడల్లో, పారిశ్రామిక వాడల్లో, వెలివాడల్లో నివసించే అభాగ్యులకు అండగా నిలబడే పద్ధతిలో లేకపోయింది. స్థూల జాతీయోత్పత్తి కనాకష్ట దశకు చేరుకుంది. సంపద పంపిణీ మాట దేవుడెరుగు, అంతరాల భూతం జాతిని భయ పెడుతున్నది.

 సామాజికార్థిక విప్లవకారుడు అంబేద్కర్‌ పోరాట ఫలితాలను అనుభవిస్తున్న బహుజన సమాజం, మహిళలు ఆయన ఆరంభించిన, అనేక వేల అడుగులను ముందంజ వేయించిన సామాజిక విప్లవాన్ని కొనసాగించడానికి, ప్రతిన పూని బాధ్యతతో పని చేయాలి. ”సమాజానికి తిరిగి చెల్లించు”అనే భావన ను ఆచరించడంలో అగ్రగామిగా పనిచేయటమే భారతదేశం లో పుష్పించిన సుందర మానవతా మందారం ఐన మన అంబేద్కర్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి.

భారతదేశ చరిత్ర మొత్తం "బౌద్ధానికి బ్రాహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబేడ్కర్ విశదీకరించారు.తాను జన్మించిన మతంలో కులపరమైన వివక్షకు పరిష్కారం లేదని నమ్మి 1956 అక్టోబర్‌ 14న ఆరు లక్షల మంది తన అనుయాయులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరించారు.





అమెరికన్ పాత్రికేయుడు విన్సెంట్ షీన్(1899-1975) డా:అంబేడ్కర్ గారితో, ఆయన అనుభవాలను కొన్ని వ్యాసాలలో వివరించారు.ఆయన ప్రకారం  డా:అంబేడ్కర్, ఆయన బారతీయ హిందూవులందరికంటే భిన్నమైన వ్యక్తి. ఆయన తాను ప్రభుత్వంలో బాగస్వామిగా ఉన్నా కూడా..వ్యవస్తలో లోపాలను ఎత్తి చూపాల్చి వచ్చినపుడు తీవ్ర స్వరంతో ప్రభుత్వాన్ని సైతం విమర్శించేవారు.
అంబేడ్కర్ ఈ దేశంలోని కులా, వర్న వ్యవస్త గురించి చర్చిస్తున్న సమయంలో అన్న మాటలు.."భ్రాహ్మణుల తెలివి మీకు ఇష్టమైతే వాళ్ల తెలివితో మీ అమెరికాలో పాలన చేసుకోండి..ఇక్కడ మీకన్నా మేం దిగజారిపోడానికి వారి తెలివీ,బావజాలమే కారణం"

8.బుద్దుని గురించి ఆయన చేసిన పరిశోధన మరే భౌద్దం అనుచరణలో ఉన్న ఏ దేశస్తులూ చేసి ఉండకపోవచ్చు.

9.మేము గాంధీనీ, బుద్దుడినీ పోలిక చేసినపుడు అసలా పోలికే సరికాదనేవారు.గాంధీ ఈ దేశ సనాతనం తయారు చేసుకున్న ఒక ముసుగని చెప్పడం చాలాసార్లు విన్నాము.

10.ఒక వ్యక్తి అంబేడ్కర్ లా ఉండడమనేది, మేధస్సుకు సంబందించిన విషయం మాత్రమే అని ఖచ్చితంగా చెప్పగలను.








 











WhatsAppTelegramFacebookTwitterLinkedInPinterestShare

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం