సామాజిక తత్త్వవేత్త శ్రీ నారాయణ గురు.
భారతదేశపు చీకటి రాజ్యం లో సామాన్యుల కుత్తుకల మీద విలయతాండవం చేసిన సామాజిక వ్యవస్థ కులం. హిందూమతం లో అశాస్త్రీయ భావాలతో సాగిన
సతీ సహగమనం, బాల్య వివాహం, కులవ్యవస్థ, మూర్ఖత్వంగా సాగుతున్న మూఢ విశ్వాసాలను చాలా మంది తాత్విక వేత్తలు ప్రతిఘటించారు.“స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం, సమానత్వం” వంటి విప్లవాత్మక ఆధునిక భావాలపట్ల ఆకర్షితులై భారత దేశం లో ని సమస్యలన్నిటినీ రూపుమాపడానికి నిస్వార్థం గా అమూల్యమైన సేవ కూడా చేసారు వీరు. ఇలాంటి నిశ్శబ్ద భారతీయ సామాజిక తాత్విక వేత్త లలో శ్రీ నారాయణ గురు ఒకరు.
నారాయణగురు క్రీ.శ. 1854 ఆగస్టు 20న కేరళలో తిరువనంతపురానికి కూతవేటు దూరంలో 'చెంపాజండీ' గ్రామంలో ఈళవ అనే హరిజన కులంలో మదన్ ఆశాన్, కుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు. అందరూ ఆయనను 'నానూ' అని పిలిచేవారు. చట్టాంబీ స్వామి అనబడే కుంజన్ పిల్లె వద్ద సంస్కృత అధ్యయనం చేశాడు. తిక్కాడ్ అయ్యబూ వద్ద యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. నారాయణగురు అరవీపురం అడవుల్లో ధ్యానంలో ఉండి చాలాకాలం తపస్సు చేశాడు. ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందనే జీవన రహస్యాన్ని తెలుసుకున్నాడు. అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు.
నారాయణను వారు ప్రేమగా 'నానూ' అని పిలుచుకునేవారు. ఐదవ ఏట ఆయన తన విద్యాభ్యాసాన్ని పాత 'గురుకుల' పద్ధతిలో పొరుగునే ఉన్న పాఠశాలలో ప్రారంభించారు. మాదన్ ఆశన్ కూడా ఉపాధ్యాయుడే. ఆయనకు జ్యోతిశ్శాస్త్రంలోనూ, ఆయుర్వేదంలోనూ మంచి ప్రవేశం ఉంది. నారాయణగురు చిన్నతనంలోనే సంస్కృతాన్ని అభ్యసించారు. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆయుర్వేద విద్యను కూడా ఆయన చిన్నతనంలోనే నేర్చుకున్నారు.
ప్రఖ్యాత సంస్కృతవిద్వాంసుడు రామన్ పిళ్ళై ఆశాన్ వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. మేనమామ కూతురే అయిన తన భార్యను అర్ధాంతరం గా వదిలేసి చెప్పాపెట్టకుండా దేశాటను వెళ్ళిన నారాయణ దక్షిణా భారత దేశం అంతా తిరిగాడు. పేదరికం తో సహజీవనం చేసాడు. స్వయం గా అవర్ణుడై ఉండటం చేత జనం సమస్యలను అతి దగ్గర గా గమనించాడు. సంఘం లో ని దురాచారాలను దగ్గరి గా గమనించి ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాడు.
అంటరానితనం, స్వార్థపరులైన ఒక వర్గపు ప్రజలు కోట్ల మంది ప్రజలపై సాగిస్తున్న పెత్తనం, లెక్కలేనన్ని కులాలు, కులాల్లో మళ్ళీ ఉపకులాలు, ఉప కులాల్లో తెగలు, తెగల్లో వైషమ్యాలు, తలాతోకా లేని నమ్మకాలు… పంచములకు ఆలయ ప్రవేశం లేదు! ఇవీ ఆ కాలపు కేరళ పరిస్థితులు.
అరువిప్పురం అనే గ్రామం లో 1888 లో, వారికోసం ఉదయం వేళ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠాపించాడు.ఒక పంచముడు – విగ్రహ ప్రతిష్ఠాపన చేయడాన్ని సహించ లేని బ్రాహ్మణులు ” అవర్ణుడివి, అందునా ఈళవ కులస్థుడివి, నీకు విగ్రహ ప్రతిష్ఠాపన చేసే హక్కు ఎవడిచ్చాడు?” అని అడిగారు. అందుకు నారాయణ గురు “క్షమించాలి. ఈ విగ్రహం బ్రాహ్మణ శివునిది కాదు. ఈళవ శివునిది.” అన్నాడు. ఒక్కదెబ్బతో దురహంకారుల గుండెలు చీల్చాడు నారాయణ గురు. అంతే వారు నోరు మూసుకున్నారు.
Comments
Post a Comment