గాంధీజీ


      గాంధీ భావాలు పై రామకృష్ణ పరమహంస, వివేకానంద ల బోధనల ప్రభావం ఉంది.  పరమతసహనాన్ని ఇదే ఆయనకు నేర్పింది. ఆయన భగవద్గీత చదివి అహింస ప్రాధాన్యత ను అర్థం చేసుకున్నారు. అయితే ఇవన్నీ ఆచరణాత్మకంగా చేసి చూపించారు. భారతీయ తాత్వికతను కొత్త దారిలోకి మళ్లించారు.
        గాంధీ  మత మౌఢ్యం నుండి  ప్రజలను మరల్చి వారిని పోరాటయోధులుగా, కార్యశూరులుగా చేశారు. మూఢ భక్తిని, కుల, మత ఛాందసభావాలను ఎదుర్కొన్నారు. హిందూ ముస్లిమ్ విభేదాలను ఎదుర్కొని ప్రజలందరిని సమైక్యంచేసి స్వాతంత్ర్యోద్యమంలోకి నడిపించారు.
అస్పృశ్యత భారతదేశానికి ఒక శాపం ఒక కళంకం అని ఎలుగెత్తి చాటారు. హిందూ ముస్లిం ఐక్యత కోసం చివరి వరకు పోరాడారు. ఆ పోరాటంలోనే చివరకు ఆర్.ఎస్.ఎస్. మతోన్మాది పిస్తోలు గుండుకు ఆహుతి అయి మరణించారు.

ప్రజం ఆకలిని తీర్చి దారిద్రాన్ని తొలగించి, వారిని ఆత్మ గౌరవం తో  జీవించేటట్లు చేయగల్గినవాడే గాంధీజీ దృష్టిలో నిజమైన దేవుడు, ఆ విధంగా చేసేదే నిజమైన మతం.

 దేవుణ్ణి, మతాన్ని ప్రజల జీవిత సమస్యలతో వూహించినవాస్తవికవాది,తాత్విక వేత్త గాంధీజీ. ముక్తి, మోక్షం పేరుతో ముక్కు మూసుకొని కూర్చోవడం గాక, దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం పోరాడాలన్నదే ఆయన మతం. ఆయన తత్వం.

 గాంధీజీ, దేశ ప్రజలలో శతాబ్దాల తరబడి వ్యాపించిపోయిన అజ్ఞానాన్ని, మూఢ నమ్మ కాలను మూఢ భక్తిని, మత ఛాందసత్వాన్ని "కర్మ సిద్దాం తం"తో వ్యాపించిన ఆకర్మణ్యత్వాన్ని తొలగించడానికి సమోన్నత పోరాటం చేశారు..

దేవుని పేరుతో, మతం పేరుతో జరిగే రక రకాల ఆడం బరాలను. మూఢాచారాలను, ఆయన నిరసించారు. దుర్వ్యయాలను వ్రతాలు, నోములు చేస్తూ స్త్రీలు వంటయింటి బానిసలు కారాదనీ స్త్రీ, పురుషునికి దాసి కాదనీ స్త్రీలు జాతీయో ద్యమంలోకి పురుషులతోపాటు అన్ని రంగాలలోకి రావాలని ఉద్బోదించారు. తొలిసారిగా భారతనారీలోకాన్ని స్వాతంత్య్ర సమరంలోకి తీసుకువచ్చారు. బాల్య వివాహాలు నిర్బంధ. వైధవ్యం వరకట్నాలు మున్నగు సాంఘిక దురాచారాలను
తీవ్రంగా వ్యతిరేకించారు. అన్ని మతాలను ఆయన పరిశీలించారు. సంకుచిత మతాభిమానాన్ని మతోన్మాదాన్ని ఆయన ఖండించారు. అన్ని మతాలు సమానమైనవేనని, అందరు దేవుళ్ళు, ప్రవక్తలు సమానంగా పూజనీయులేననీ, పరమత ఆయనప్రభోదించారు. తన ప్రార్ధనా సమావేశాలలో ఎల్లప్పుడూ పాడించే "రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామ్ " అన్న చరణాలకు "ఈశ్వర అల్లా తేరే నామ్" అన్న చరణాన్ని కూడా చేర్చి పాడించేవారు. ప్రార్ధనా సమావేశాలలో అన్ని మత ప్రార్థనలను జరిపించేవారు. హిందూ ముస్లిం మత సమైక్య సాధనకు ఖిలాఫత్ ఉద్యమాన్ని, స్వాతంత్ర్యోద్యమానికి జోడించారు. మహమ్మదాలీ షౌకతాలీ సోదరులు తాను కలిసి సభా వేదికలపై ఒకే గ్లాసులో మంచి నీరు త్రాగి హిందూ ముస్లిమ్ బేధాభావాన్ని పోగొట్టడానికి ప్రత్యక్ష ప్రదర్శనలు చేశారు.

కాషాయ బట్టలు కట్టుకొన్న వారిని తన ఆశ్రమానికి రావద్దన్నారు. "తిండికిలేని జాతికి మతం ఏమిటి? అన్నార్థులైన ప్రజాకోటికి ఉపకరించే ప్రతీదీ నా కంటికి అందంగా కనబడుతుంది' అని అన్నారు గాంధీ.

జాతిపిత మహాత్మా గాంధీ తన బలహీనతల
 గురించి కూడా పేర్కొన్నారు.

గాంధీ తనని తాను మహాత్మా అని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. 
 గాంధీ భారత దేశంలో అడుగు పెట్టకముందు స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక దిశానిర్దేశం లేదు.
గాంధీ తన రాజకీయ గురువైన గోపాల కృష్ణ గోఖలే బాటలో నడిచి,స్వాతంత్ర్య ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపారు.
వివిధ వర్గాల వారు ఉద్యమం లో పాల్గొంటేనే బ్రిటిష్ వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన భావించారు. గాంధీ దేశమంతా పర్యటించడం వల్ల ఆయన దేశంలో క్రేత్ర స్థాయిలో ఉన్నసామాజిక,ఆర్ధిక పరిస్థితులు క్షుణ్ణంగా అర్ధం చేసుకోగలిగారు.ఆయన హిందూ మత ధర్మాన్ని అనుసరించినా,పరమత సహనాన్ని ప్రదర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింలని పెద్ద ఎత్తున భాగస్వాములని చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు.గాంధీజీ
వచ్చాకే మహిళలు సైతం పెద్ద సంఖ్యలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 
 గాంధీ దక్షిణ ఆఫ్రికా లో వున్నప్పుడు జాతి వివక్షకు గురయ్యారు.అందుకే ఆయన
దేశం యొక్క భౌగోళిక స్వాతంత్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.



జాతీయతని సామాన్య ప్రజల్లోకి తీసుకుపోయి, దేశం అనే భావనను సామాన్య ప్రజల వరకు తీసుకు పోయింది గాంధీ మాత్రమే. 


అసలు గాంధీకి జాతిపిత అనే టైటిల్ ని ఇచ్చిందే సుభాష్ చంద్రబోస్ బోస్ 



ఈ రోజు నా శరీరం రెండుగా చీల్చబడింది నేనెట్లా సంబరాలు జరుపుకొను అంటూ స్వాతంత్ర్య సంబరాలు బహిష్కరించాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు గాంధీ ఎంత బాధపడ్డారో దేశవిభజన వల్ల. చివరికి దేశ విభజన కాకూడదు అని నెహ్రు ని కాదని జిన్నా ని ప్రధానమంత్రి ని చేయడానికి కూడా ఒప్పుకున్నాడు చివరికి. కానీ మతోన్మాద జిన్నా వినలేదు. గాంధీ దేశ విభజన ను ఆపడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు!!


గాంధీ సపోర్ట్ చేసింది అహింస వాదానికి. హింస ఎవరిమిద జరిగినా కూడా వద్దన్నాడు. అది హిందువుల పైన అయినా సరే ముస్లిం ల పైనా అయినా సరే. అయినా ఊచకోత జరిగింది అతివాద హిందు ముస్లిం గ్రూపుల వల్ల. వాళ్ళని అడ్డుకోవడానికి కలకత్తా లో నిరాహార దీక్ష కు పునుకొని హింసను ఆపగలిగాడు. అక్కడ పాకిస్థాన్ లో జరుగుతున్న హిందువుల ఊచకోత ఆపడానికి కూడా పాకిస్థాన్ కి వెళ్లి పాకిస్థాన్ తో చర్చ లు జరపాలి అనుకున్న సమయంలో ఓ హిందూ మతోన్మాదుడి చేతిలో చనిపోయారు.
గాంధీ అస్పృశ్యత నివారణ కోసం, దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేశారు దళితులను హరిజనులు అంటూ వాళ్ళకి హిందు సమాజంలో సమాన హోదా కల్పించడానికి ప్రయత్నించాడు.
 న్యూక్లియర్ ఆయుధాల కన్నా శక్తివంతమైన సత్యం అహింస ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచ చరిత్ర లో ఉద్యమాల పంథా ని మార్చాడు.
ఈ గాంధేయ మార్గం వల్లే మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి మహానుభావులు కూడా రక్తం చిందించకుండా ప్రాణ నష్టం జరగకుండా తమ ఉద్యమాలని నడిపి సఫలీకృతం అయ్యారు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం