గురుదేవ్ రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ అంతర్జాతీయ దృక్పథం

బెంగాలు లో  1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.

* శాంతినికేతన్*

రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 

రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన "జనగణమణ" ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి "జనగణమన" దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా  ప్రకటించాడు. 

 విశ్వకవి' రవీంద్రనాథ్ టాగూర్, 1941 ఆగష్టు 7న మరణించాడు.

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో 
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యలలోకీ నీచే నడవబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
(గీతాంజలి-35, రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ కవితకు చలం

ఎందరో మహానుబావులు అందరికి వందనాలు...........ఓ గొప్ప వ్యక్తి, జాతి గర్వించిన వ్యక్తి, ప్రపంచామంతా బారతీయతని గుర్తిన్చేవిధంగా చేసిన వ్యక్తి, విశిష్ట నోబెల్ బహుమతితో మన దేశ కీర్తి పతాకాలని ఈ అనంత విశ్వానికి చూపిన వ్యక్తి, భారతీయులంతా ఎంతో ముద్దుగా పిలుచుకునే "విశ్వ కవి" మన రవీంద్రుని జయంతి ఈ రోజు......

ఆయన గురించి నాకు తెలిసినవి మీకు తెలియాలనుకుంటున్న నాలుగు విషయాలు మీతో................

విశ్వకవి రవీంద్రునిధీ ఎంతో గొప్ప ఆరోగ్యం. చిన్నతనం నుండి ఏ రోజు ఒక జలుబు జ్వరం వచ్చేది కాదు. బడిలో కూర్చొని పాటాలు చదవడానికి ఎప్పుడు తను సిద్దంగా ఉనెవాదు కాదు. అందరి పిల్లలల తనకు జ్వరమని, జలుబని సాకులు చెప్పలేక బడి ఎగ్గోట్టలేక ఇష్టం లేక పోయిన బడికి వెళ్ళేవాడు. 

అన్నిటికి మించి ఎంత చలికాలమైన తను చన్నీళ్ళ స్నానమే చేసేవారు. తను విశ్వ విద్యాలయ చదువుకి ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు కూడా గడ్డ కట్టే మంచులో కూడా చన్నీళ్ళ స్నానం చేసిన తనని  జలుబు, జ్వరం  దరి చేరలేదు. 

రవీంద్రుడు చదివే విశ్వ విద్యాలయంలో సుప్రసిద్దుడైన హెన్రీ మొర్లే ఇంగ్లిష్ ప్రొఫెసర్ గ ఉండేవారు. హెన్రి విధ్యార్దులన్దరిని భారత దేశం పై వ్యాసం రాసుకొని తెమ్మన్నప్పుడు మన రవీంద్రుడు బ్రిటిష్ వారి హింసని   వ్యతిరేకిస్తూ మన దేశానికి స్వాతంత్రం రావలసిన అవసరతపై వ్యాసం రాసి అది చూసి హెన్రి అరుస్తాడనే భయంతో మిత్రునితో అతనికి అందించాడు. క్లాసులో అందరి ముందు ఆ వ్యాసాన్ని హెన్రి చదివి వినిపించి రవీంద్రుని మాటలతో కీర్తించి అతను ఉన్న హాస్టల్ గదికి స్వయంగా వెళ్లి నీవు భారత దేశానికి ఒక గర్వ కారణం అవుతావని కొనియాడారు. 

రవీంద్రుడు తన 20 వ ఏట వ్రాసిన "సంధ్యా గీతం"  ఒక గంగా నది ప్రవాహంలా పరవళ్ళు త్రోక్కుతుంది. ఈ రచన చదివిన ప్రసిద్ద రచయిత బకించంద్ర చటర్జీ ఒక మిత్రుని వివాహ వేడుకలో అతనికి వేయబోయిన పూల మాలని రవీంద్రుని మేడలో వేసి సంధ్యా గీతం గురించి ఎంతో గొప్పగా పొగిడారు. 

రవీంద్రుడు పాశ్చాత్య వేషధారణను ఏవగించుకునేవారు. అలాగే మాతృ బాష వదిలేసి ఇంటి వద్ద కూడా ఇంగ్లిష్ ని మాట్లాడటాన్ని సహించరాని విషయంగా చూసేవారు. "తల్లి పాలు త్రాగిన బిడ్డ ఏ విధంగా బలంగా ఆరోగ్యంగా ఉంటుందో అలాగే మాతృభాషలో అధ్యయనం చేసిన విద్యార్ధి కూడా గొప్ప వ్యక్తి అవుతాడు" అని మాతృభాష గురించి వక్కాణించారు. 

రవీంద్రుడి చతురత: 

ఒక సారి రవీంద్రుడు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని ముగింపులో తనకు చిరకాల స్నేహితుడైన నేపాలి బాబు అనే ఉపాధ్యాయుడిని "నీకు దండం ఇవ్వాలి వేదిక మీదకు రా" అని పిలిచేసరికి సభలోని వారంతా నేపాలి బాబుకు ఏవో చివాట్లు తప్పవు అని అనుకున్నారు కాని రావీద్రుడు "నేపాలి బాబు! నేకు మతి మరపు మరి ఎక్కువైన్దయ్యా బాబు, నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు నీ చేతి కర్ర మరచి పోయావు, ఇదిగో నీ దండము తీసుకో" అంటూ ఆలింగనం చేసుకుంటూ నవ్వుకున్నారు. 

రవీంద్రుని 80 జన్మదినం సందర్భంగా (అంటే ఈ రోజు) గాంధీజీ "ఎనభై ఏళ్ళు చాలవు నూరేళ్ళు జీవించు ప్రేమతో" అంటూ అభినందనలు పంపితే దానికి సమాధానంగా విశ్వకవి "కృతజ్ఞతలు! ఎనబై ఏళ్ళేక్లేశాదాయకం. నూరేళ్ళు అసలే సహించలేం." అని చెప్పిన కొద్ది రోజులకే తుది శ్వాస విడిచారు. 

1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్‌ (1861) జన్మించారు.జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకుఎదిగారాయన!

‘నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు/ కానీ కలమెత్తితే నాకు/ ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది...’ అంటారు శేషేంద్ర. మరి మూడు దేశాల జెండాల రెపరెపల మధ్య వినిపించే గీతాల కోసం ఎత్తిన ఆ కవి కలానికి ఇంకెంత ఘనత ఉండాలి? అంతటిది– విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ కలం.ప్రపంచ చరిత్రలో, భారత దేశచరిత్రలో టాగోర్‌ శిఖరాయమానమైన వ్యక్తి. కవితలలో తాను పోహళించిన పదాల మీద పాదముద్రలు వేయమని దేశద్రిమ్మర విహంగాలను కోరినవాడు (స్ట్రేబర్డ్స్‌) కదా! ఆ పక్షులు విశ్వకవి నామం మీద తమ పాదముద్రలను వేసి ఉంటాయి. అందుకే ఆ పేరు రెక్కలు ధరించి ఖండాంతరాలకు దూసుకుపోయింది. కాబట్టే ఈ జగత్తు అనంతత్వం అనే తన మహా ముసుగును తొలగించుకుని ఒక చిన్నపాటగా ఆ కవీశ్వరుడి కలంలో ఒదిగిపోయి ఉంటుంది. అలాంటివి ఎన్ని పాటలో! ‘ప్రభు’కు సమర్పించిన ‘గీతాంజలి’ నిండా అలాంటి పాటలే. ఏ గీతంలో అయినా విశ్వమంత భావ వైశాల్యం. సాగర గర్భమంత తాత్వికత.

1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్‌ (1861) జన్మించారు. జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకు ఎదిగారాయన! తాత ద్వారకానా«థ్‌ టాగోర్‌ బ్రహ్మసమాజంలో తిరుగుబాటు వర్గానికి నాయకుడు. తండ్రి దేవేంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సంస్కర్త, దాత, సమాజ సేవకుడు. పదకొండో ఏట తండ్రితో కలసి హిమాలయాలను దర్శించారు రవికవి. తండ్రి చేయి పట్టుకుని భారతావనిని దర్శిస్తూనే కాళిదాసునీ చదివారాయన. సంప్రదాయ విద్య అంటే అప్పటికే లోపల తీవ్ర నిరసన. ఇంగ్లండ్‌లో చదివినా పట్టా పుచ్చుకోకుండానే తిరిగి స్వదేశం చేరుకున్నారు. చిన్నారులకు మాతృభాషలోనే చదువు చెప్పాలన్నది టాగోర్‌ ప్రగాఢ విశ్వాసం. విదేశీ భాషతో బరువైన విషయాలు పిల్లల మనసుల్లో దట్టించాలని చూడడం సరికాదన్నారాయన. నాలుగు గోడల మధ్య బంధించి చదువు చెప్పడం అసలే మంచిది కాదంటారాయన. రుషి వాటికలలోని గురుకులాలను పోలిన వాతావరణంలో ప్రకృతి పరిసరాల నడుమ, ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పాలి. పిల్లలు అలాగే వినాలి. ప్రకృతే ఉత్తమ గురువన్నది ఆయన అభిప్రాయం. అందుకే శాంతినికేతన్‌ ఏర్పాటు చేసిన తరువాత తరగతి గదులలో పిల్లలని బంధించకుండా చెట్ల నీడను చదువు చెప్పేవారాయన. వందేళ్ల క్రితమే ఆయన పిల్లల కోసం రాసిన ‘చిలుక కథ’ సంప్రదాయ విద్య పట్ల టాగోర్‌కు ఎంత ఏవగింపో తెలియచేస్తుంది.  ఆ కథ ఒక అద్భుతం. రాజగురువులు చెప్పిన చదువును తట్టుకోలేక ప్రాణాలు వదిలిందా చిలుక– ఇప్పటి చిన్నారుల బాధను గుర్తుకు తెస్తూ.

‘చిలుక కథ’ మాత్రమేనా! ఎన్నెన్ని గొప్ప రచనలు చేశారని! నవలలు, నాటకాలు, నాటికలు, కథలు, చిన్న పిల్లల కథలు... ఇక కవిత్వం సరేసరి. ద్విపదుల వంటి స్ట్రేబర్డ్స్‌ కవితలు, మరణం కూడా ఉత్తరం లాంటిదేనని చెబుతూ రాసిన ‘పోస్టాఫీస్‌’ నాటకం అమోఘం  బెంగాల్‌కే కాదు, భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగిన కళాహృదయుడు టాగోర్‌. ఆయన రాసిన 103 గీతాల మాలిక ‘గీతాంజలి’. ఎలాంటి గీతాలు! ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో... ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ నా దేశాన్ని మేల్కాంచేటట్టు అనుగ్రహించు’ అన్నారాయన (అను: బెల్లంకొండ రామదాసు). ఈ గీతం మధ్యలోనే రాసిన మరో వాక్యం చదివితే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది, ‘ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో...’ అలాంటి చోటికి దేశాన్ని నడిపించాలని ఆకాంక్షించారాయన. అందుకే మరి, విఖ్యాత ఇంగ్లిష్‌ నాటకకర్త బెర్నార్డ్‌షా ఉండగా, బానిసదేశంలో ఎదిగిన కవికి సాహిత్య నోబెల్‌ (1913) ఇవ్వడం ఏమిటని శ్వేత దురహంకారం ప్రశ్నించినా, వాటికి విలువ లేకుండా పోయింది. టాగోర్‌కు పురస్కారం సబబేనంటూ విలియం బట్లర్‌ యేట్స్‌ అక్కడ ఉద్యమించాడు. గీతాంజలి ఆంగ్లానువాదానికి ఆ ఐరిష్‌ మహాకవే ముందుమాట రాశారు. అందులో అంటారాయన, ‘ఈ అనువాదాల వ్రాత ప్రతిని కొన్ని రోజుల పాటు నా వెంట తీసుకుని రైళ్లలో, బస్సులలో, రెస్టారెంట్లలో చదివేవాడిని. అది నన్ను ఎంతగా కదిలించి వేసిందో.. కొత్తవారు ఎవరైనా చూస్తారేమోనని తరుచుగా పుస్తకం మూసివేయవలసి వచ్చేది’.  చిత్రమేమిటంటే నోబెల్‌ బహుమతి స్వీకారోత్సవానికి టాగోర్‌ హాజరు కాలేదు. ఆ సంవత్సరం నవంబర్‌లో విజేతలను ప్రకటించారు. డిసెంబర్‌లో ఉత్సవం జరిగింది. 1914 జనవరిలో నాటి బెంగాల్‌ గవర్నర్‌ దానిని రవీంద్రుడికి అందచేశారు. జనులందరిలోను నిన్ను నీవు, నీలో జనులందరినీ దర్శించుకుంటే నీవు ఎవరినీ ద్వేషించవు’ అని అర్థం చెప్పే ఒక ఉపనిషత్‌ శ్లోకంతో కూడిన ఉపన్యాసాన్ని టాగోర్‌ నోబెల్‌ కమిటీకి పంపారు. దానిని అప్పుడు చదవలేదు. ఎనిమిదేళ్ల తరువాత అది బయటపడింది. స్వీడిష్‌ అకాడమి దానిని భద్రపరచింది. టాగోర్‌కు వచ్చిన పుష్కరం తరువాత 1925లో షాకి ఆ పురస్కారం దక్కింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోను, యుద్ధం తరువాత తాము ఎదుర్కొన్న సంకట స్థితికి ప్రాగ్దిశ నుంచి వచ్చిన సమాధానంగా ‘గీతాంజలి’ని పాశ్చాత్యులు భావించారు. అంత సాంత్వన ఇచ్చిందా కవిత్వం.

గాంధీజీ, టాగోర్‌ల బంధాన్ని గమనించినా ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. గాంధీజీని ‘మహాత్ముడు’ అని మొదటిగా సంబోధించినవారిలో టాగోర్‌ ఒకరు. గాంధీజీ టాగోర్‌ను గురుదేవ్‌ అని పిలిచేవారు. గాంధీజీ ఉద్యమకారుడు. జనాన్ని కదిలించారాయన. కానీ ఉద్యమానికి తాత్వికతను అందించినవారు టాగోర్‌. జాతీయోద్యమం పట్ల  టాగోర్‌ ఒక కవిగా, తాత్వికునిగానే స్పందించారు. 1915లో గాంధీజీ భారతదేశానికి వచ్చిన తరువాత కలుసుకున్నవారిలో టాగోర్‌ ఒకరు. కానీ గాంధీజీ చెప్పిన ప్రతి మాటనీ, ప్రతి చర్యనీ టాగోర్‌ సమర్థించలేదు. 1921 నాటికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో భారతదేశం ఊగిపోయింది. కానీ ఆ ఉద్యమాన్ని టాగోర్‌ సమర్థించలేదు. గాంధీజీ శాంతినికేతన్‌కు వచ్చి మద్దతు అడిగినా అంగీకరించలేదు. అలాగే రోజూ అరగంట చరఖా వడకమని, దీనితో స్వాతంత్య్రం వస్తుందని గాంధీజీ చేసిన ప్రకటనకు ‘చరఖా వడకడంతోనే ఆరు మాసాలలో వచ్చే స్వాతంత్య్రం కోరుకోదగిన స్వాతంత్య్రం కాబోదు’ అని టాగోర్‌ జవాబు ఇచ్చారు.

టాగోర్‌ మహోన్నత దేశభక్తుడు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఎంతో ప్రేమించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1886లో భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి వార్షిక సమావేశం కలకత్తాలోనే జరిగింది. ఇందుకోసం టాగోర్‌ ఒక దేశభక్తి గీతం రాశారు. బెంగాల్‌ విభజన (1905)కు వ్యతిరేకంగా పెల్లుబికిన వందేమాతరం ఉద్యమంలో టాగోర్‌ చురుకుగా పాల్గొన్నారు. 1911 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ‘జనగణమన అధినాయక జయహే...’ అంటూ ఎలుగెత్తి పాడారు.  నిజమే, గాంధీజీలో తనకు నచ్చని అంశాన్ని టాగోర్‌ నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం విషయంలోనూ అంతే. అందుకే ఆయన నిజమైన కవి అనిపిస్తాడు.  నోబెల్‌ పురస్కారం అందుకున్న తరువాత టాగోర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం 1915లో ‘సర్‌’ బిరుదుతో సత్కరించింది. కానీ 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ మారణహోమానికి నిరసనగా ఆ బిరుదాన్ని తిరిగి ఇచ్చేశారాయన. టాగోర్‌ అంతర్జాతీయవాది. కానీ ఆయన అంతర్జాతీయవాద దృష్టిని దారుణంగా భగ్నం చేసిన ఘట్టం మొదటి ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధం ఆయనను కలచివేసింది. 

మృత్యువును అతిథిగా భావించారాయన. ‘ఓ.. నా అతిథి ఎదుట నా పూర్ణ జీవిత కలశాన్ని ఉంచుతాను. రిక్తహస్తాలతో అతడిని ఎప్పటికీ తిరిగిపోనివ్వను’ (గీతాంజలి–90

విశ్వకవి రవీంద్రనాథ టాగూర్ భావకవిత్వంలో మునిగితేలి నా అభ్యుదయ కవులైన వారికి సదా ఆరాధ్యకవి. “టాగూర్ నా ఎలర్జీ” అని శ్రీశ్రీలాగా ఎక్కువ మంది కవు లనలేదు. సినారె వంటి సమన్వయవాద అభ్యుదయకవికి రవీంద్రకవీంద్రుడు ఆరాధనీయు డు కావడం ఆశ్చర్యమేమీ కాదు.“అక్షరాలగ వాక్షాలు”లో రవీంద్రుని మీద రెండు కవితలు రాసి, ఆయనను స్మరించుకున్నారు.
ఓ కవితారసాల పుంస్కోకిలమా!వ్యాసులమౌ
మాజాతికి నీగీతిక మధుమాసమెదయమ్ము (పైది: పు.82)
రవీంద్రకవి ప్రాక్పశ్చిమాల సమ్మేళనం, భావాభ్యుదయ కవిత్వాల సంగమం. సంప్రదాయాధునికతల కలనేత. సినారెలో ఈ లక్షణాలు ఉన్నాయి, తొలినాళ్ళలో
భావకవితా స్వర్ణపీఠము / పైన అచ్చరతో సమమ్ముగ
బిచ్చకత్తెకు చోటొసంగిన/ పిండివెన్నెలమనసు నీయది (పైది: పు.98)
అని సినారె నిర్వచించారు రవీంద్రుని.సైన్స్‌, హిస్టరీ, తర్క శాస్త్రం పునాదులపై మానవతావాదాన్ని అభివృద్థి చేసేందుకు విద్యాసాగర్‌ పరితపించారని రవీంద్రుడు పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం