ఆదిగ్రంధమే సిక్కుల తాత్విక చింతన



గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంధం . అదే ఆఖరి గురువు.దీని ఆధారంగానే సిక్కుల జీవన్ విధానం ఉంటుంది.
     గురు అర్జున్ దేవ్ (1563-1606) ఈ ఆది గ్రంధాన్ని కూర్పు చేశాడు. ఇందులో మొదటి ఐదు సిక్కు గురువులు మరియు హిందూ ముస్లింల సాంప్రదాయాలకు చెందిన అనేక గురువుల గురించి రాశారు. గ్రంధానికి అసలు రూపం ఇచ్చినవారు భాయ్ గురుదాస్ .ఆ తరువాత భాయ్ మణిసింగ్. పదవ గురువు పరమదించిన తరువాత, ఆదిగ్రంధ్ చేతివ్రాత ప్రతులను బాబా దీప్ సింగ్ తయారుచేసి పంచిపెట్టాడు. గురుగ్రంధ సాహిబ్ గ్రంధము 1430 పుటలు కలిగిన గ్రంధము. సిఖ్ గురువుల కాలంలో, 1469 నుండి 1708 వరకు గ్రంధరూపం ఇవ్వబడినది. ఈ గ్రంధం స్తోత్రం రూపంలో వున్నది. ఇందులో దాదాపు 6,000 శ్లోకాలున్నాయి.

ఆది గ్రంథం అన్ని ప్రార్థనా కేంద్రాలైన గురుద్వారా లలో (సిక్కు ఆలయాలు)  ఉంటుంది. దీన్న ఉదయం తెరిచి,   రాత్రి మూసివేసి భద్రంగా ఉంచుతారు. ప్రత్యేక సందర్భాలలో దాని నిరంతర పఠనాలు నిర్వహిస్తారు.ఇది 2 నుండి 15 రోజుల వరకు ఉంటుంది. సిక్కు అమరవీరుల జ్ఞాపకార్థం, గురువుల వార్షికోత్సవాలలో , గ్రంథాన్ని కొన్నిసార్లు ఊరేగింపుగా తీసుకువెళతారు.ఇందులోని భాష  ఎక్కువగా పంజాబీ లేదా హిందీ, మరాఠీ, పర్షియన్ , అరబిక్ పదాలతో నిండిఉంది.ఇందులో కథలు లేవు. జీవనమార్గాన్ని సూచించే సూక్తులు, విశాలతత్వంతో జీవించే మార్గాలూ వున్నాయి.


గురుగ్రంథ్ సాహిబ్ చెప్పిన ముఖ్యమైన భావాలు

1.ప్రపంచంలోని మానవులంతా సమానమే
2.స్త్రీలందరూ సమానమే
3.అందరికీ ఒకే భగవంతుడు
4.సత్యమునే పలికి సత్యముగా జీవించు
5.ఐదు విషయాలపట్ల శ్రద్ధ వహించు
6.దేవుడి ఆజ్ఞపై జీవించు (ఒకే దేవుడి నిర్ణయం)
7.మానవత్వం, దయ, జాలి, ప్రేమ లను ఆచరించు
8.జీవించి యుండగానే పరమాత్మను చేరే మార్గ తత్వము.
9.గురువు బోధనల ద్వారా దైనందిన జీవితంలోని సమస్యలనుండి బయటపడటం.


       గురు గోవింద్ సింగ్ (1666-1708), సిక్కుల గురువు లలో పదవ గురువు.ఆయన ముందు గురువుల కొన్ని బోధనలు కలిపి ఆది గ్రంధ్ ను తన వారసురాలిగా, అందరకీ గురువుగా ప్రకటించాడు.మనుషులను గురువులుగా ప్రకటించే విధానాన్ని స్వస్తిపలికాడు.  "ఆది గ్రంధ్" ను తన తరువాత గురువుగా ప్రకటించాడు.  గ్రంధం పది-గురువుల జీవనవిధానంగానూ , ప్రార్థనలకొరకు ఒక వనరుగా పరిగణించాడు. సిక్కుల  ప్రార్థనలో ఆదిగ్రంధం ఒక భాగమైంది.

     గురు గ్రంథ్ సాహిబ్‌పై తమ విధేయత మరియు విశ్వాసాన్ని చూపించడానికి గురు గ్రంథ్ సాహిబ్‌కు నమస్కరిస్తారు.గురు గ్రంథ్ సాహిబ్‌కి నమస్కరించడం ద్వారా, వ్యక్తి తన స్వంత ఆలోచనలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మరియు గురు గ్రంథ్ సాహిబ్ ఆలోచనను తన మనస్సులో నింపాలని కూడా సూచిస్తుంది.ఈ నమస్కారాన్ని"మఠా టెక్నా" అని పిలుస్తారు.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం