పెరియార్ రామస్వామి లోకాయత దృక్పథం
దడదడలాడుతున్నది,దశలో ఇల్లుగలాయన రఋఋదదర
ఒఈఓ
పెరియార్ రామస్వామి లోకాయత దృక్పథం
భారత దేశంలో సింధు నాగరికత తర్వాత కాలం నుండి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసినవారు చార్వాకులు.వీరినే లోకాయతులు( లోకమంతా ఉన్నవాఘ దరు) అని పిలిచేవారు. వీరు పూర్తిగారర భౌతికవాదులు.వీరు వేదాలను,దేదృవుడి భావనను తిరస్కరించారు. వీరి పరంపర మధ్యయుగాల్లో మిణుకు మిణుకు మనింది. వేమన, తిరువల్లువార్ లాంటి వారు ఒకరిద్దరు తప్ప మరెవ్వరూ మనకు కనపడరు.
ఆధునిక కాలంలో వీరి లాగా సమాజం ముందుకు వచ్చి యావత్ ప్రపంచాన్ని కదిలించిన వారు పెరియార్. మన ఆంధ్రప్రదేశ్లో గోరా ఒకరు. చార్వాక తాత్విక చింతనే ఆయుధంగా ఆయన పలు రచనలు, ప్రసంగాలతో ఉద్యమం కొనసాగించాడు. తన జీవితాన్నే ఉద్యమం చేసుకున్న ధీరుడు పెరియార్. ఆయన 'దేవుడు లేడు' అన్న నాస్తికుడే కాదు, ఆయన ఒక ఉద్యమకారుడు,ఉద్యమాన్ని తర్వాత తరాలకు అందించిన నాయకుడు; మార్గదర్శి.
తమిళనాడులో ద్రావిడ ఉద్యమానికి అంకురార్పణ చేశారు పెరియార్. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన నౌకను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాడాయన. ద్రావిడ ఉద్యమం హిందూ మతానికి వ్యతిరేకంగా సాగిన సామాజిక, మత సంబంధమైన తిరుగుబాటు. ఈ ఉద్యమం హిందూ మతం పేర్కొంటున్న సామాజిక జీవనానికి వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటుగా భావించవచ్చు.తమిళ బ్రాహ్మణేతరులు జాతిపరంగా బ్రాహ్మణులకు భిన్నమైన వారని, వారి సంస్కృతి సంప్రదాయాలు వేరని వాటిని భాషా సాహిత్యాల ద్వారా పరిరక్షించుకోవడం జరుగుతుందని ద్రావిడ ఉద్యమం చెప్పింది.బ్రాహ్మణులు ఆర్యులు సంతతి వారని అందువల్ల ద్రావిడ, ఆర్యుల మధ్య జాతి పరమైన విభేదాలు కొట్టొచ్చినట్లున్నాయని వాదించిందీ ఉద్యమం.
తమిళనాడు ఈరోడ్ పట్టణంలో 1879 సెప్టెంబరు 17న జన్మించిన పెరియార్ రామస్వామి 1973 డిసెంబరు 24న మరణించారు. పెరియార్ అంటే దేశాభిమాని అని అర్థం. పెరియార్ అంటే తమిళంలో రుషి లేదా జ్ఞాని అని అర్థం. పెరియార్ అసలు పేరు ఈ.వి.రామస్వామి .
ఆయన సంపన్న కుటుంబంలో పుట్టాడు. విలాసవంతమైన జీవనాన్ని గడిపే అవకాశమున్నా అణగారిన ప్రజల కోసం, స్త్రీల కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేశారు.
ఇరవై అయిదు సంవత్సరాల వయసులో ఆయన మనసును కలిచివేసిన సంఘటన భారత దేశ సమాజంలో పెనుమార్పుకు దోహదపడింది. కాశీలోని ఒక ధర్మ సత్రంలో ఆకలి దహించి వేస్తుంటే
భోజనం కోసం లోపలికి ప్రవేశించబోయాడు పెరియార్. ఆ ధర్మసత్రంలో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇంతలో అనూహ్యంగా గేట్ కీపర్ అతడిని అడ్డుకున్నాడు. పెరియార్ కు మీసం ఉండడం వల్ల అతడు బ్రాహ్మణేతరుడని గేట్ కీపర్ భావించాడు. మెడపట్టి బూతులు తిడుతూ పెరియార్ ను రోడ్డుమీదికి నెట్టేశారు.పెరియార్ ఆకలికి తట్టుకోలేక ఎంగిలి విస్తర్లలో దొరికే పదార్థాలనన్నా తిందామనుకున్నాడు.కానీ దాన్ని కూడా అడ్డుకున్నారు. కుల వివక్ష అంత పని చేసింది. ఆ అవమానం అతడి మనసును తీవ్రమైన బ్రాహ్మణ వ్యతిరేకతతో నింపేసింది. ఆ క్షణం నుండి కుల వ్యతిరేక పోరాట యోధుడిగా తన జీవితాంతం ఉండిపోయాడు. ఇలాగే గాంధీ దక్షిణాఫ్రికా లో వర్ణవివక్ష కు గురై దానికి కారణమైన బ్రిటీష్ వారి పై పోరాటం చేశాడు. గుండెలోని గాయాలే గేయాలై విప్లవాలను నడుపుతాయి.
మనిషికి మనిషికి మధ్య హెచ్చు తగ్గులను, అసమానతలను పెంచే కులాన్ని నిర్మూలించాలని ఉద్యమాన్ని నడిపాడు పెరియార్ . మానవుల మధ్య ఏర్పడిన అసమానతలకు, అణచివేతకు, కొంత మంది అవమానాలకు కులం ఏ విధంగా కారణమైందో పెరియార్ బయటపెట్టాడు.ఆ అణచివేతల నుండి, ఆత్మ న్యూనతలనుండి బయట పడడానికి స్వాభిమాన ఉద్యమాన్ని నడిపించారు.
పెరియార్ స్వయం కృషి , నీతి నిజాయితీ , సేవాభావం మూలంగా 1917 లో జనం నీరాజనం పలుకుతూ 28ఏళ్ల వయసులోనే ఈరోడు నగరపాలక సంస్థకు చైర్మన్ ను చేశారు.
మద్యపాన నిషేధం, అంటరానితనం నిర్మూలన లాంటి గాంధీ విధానాల పట్ల ఆకర్షితులయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అరెస్ట్ అయ్యారు. మద్యపాన ఉద్యమాన్ని నడిపాడు.1919లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీ యూనిట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1919లోనే ఇరుచ్చిరాపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మహాసభలో అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఒక తీర్మానం ప్రవేశ పెట్టారు. దాన్ని కాంగ్రెస్ లోని బ్రాహ్మణ వర్గమంతా వ్వతిరేకించింది. ఇందుకు నిరసనగా తన పదవులకు రాజీనామా చేశాడు. అలా ప్రతి సభలో ఈ తీర్మానం తిరస్కరించండంతో ఆయన కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ద్రావిడార్ కజగం ను అన్నాదురై తో కలిసి ఏర్పాటు చేశాడు.
ఈరోడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నపుడు నగరంలో ప్లేగు వ్యాధి సోకి వందల సంఖ్యలో రోగులు మరణించారు.పైగా కలరా, ప్లేగు వ్యాధులకు ఇంజక్షన్లు వేయించుకుంటే అమ్మవారి(దేవత) ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న మూఢనమ్మకంతో జనం భయపడి పోయేవారు. వందల సంఖ్యలో నగర వాసులు ప్రతి ఇంటా చనిపోతుంటే రక్త సంబంధీకులు కూడా ఆ శవాలను పూడ్చి పెట్టడానికి కానీ , దహనం చేయడానికి కానీ భయపడి ఇల్లు వాకిలి వదిలిపెట్టి రోడ్లపై శవాలను పడేసి పారిపోయేవారు.ఆ భయంకర పరిస్థితుల్లో పెరియార్ తన సహచరులకు ధైర్యం చెప్పి ఇళ్లలోని , వీధుల్లోని శవాలను తన భుజాలపై మోసుకుంటూ ఎడ్లబండ్లపైన , గుర్రపు బండ్లపైనా తీసుకెల్లి నగర శివారుల్లో దహనం చేశారు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా నగరవాసులకు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాను అందించాడు.దళితుల నివాస ప్రాంతం నుండి పైపు లైన్ నీళ్లు వెళితే తాగడం ఇష్టం లేని వాళ్లతో ఆ కుళాయి నీళ్లను ఎవరికి అవసరమో వాళ్లే వాడుకోవచ్చు, ఇందులో బలవంతమేదీలేదంటూ పైకులాల వారి నోళ్లు మూయించారు.
మనుధర్మం అడ్డుపెట్టుకొని ఆధిపత్య కులాలు ఏర్పరచుకున్న నిచ్చెన మెట్ల వ్యవస్థ గురించి బయట పెట్టారు పెరియార్. భారత రాజ్యాంగంలో కులవ్యవస్థను సమర్థిస్తూ కొన్ని అధికరణలు ఉన్నాయి.రాజ్యాంగంలో కులవ్యవస్థను సమర్థిస్తున్న అధికరణలలో 372 ఒకటి.
ఈ అధికరణ ద్వారా, రాష్ట్రపతి ఒక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా కులం ఆధారంగా ప్రత్యేక కేటగిరీల కోసం రిజర్వేషన్లను అనుమతించవచ్చు. ఈ రిజర్వేషన్లు విద్య, మరియు ఇతర సామాజిక సేవల్లో కులాల ఆధారంగా కల్పిస్తాయి. అయితే, కొంతమంది విమర్శకులు ఈ రిజర్వేషన్లు కులవివక్షను తగ్గిస్తాయని వాదిస్తారు. కొంతమంది విమర్శకులు రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, అవి దీర్ఘకాలంలో కులవివక్షను మరింత లోతుగా చేస్తాయని వాదిస్తారు.
రాజ్యాంగంలోని 372వ అధికరణ ఒక సంక్లిష్టమైన అంశం. ఈ అధికరణ కులవివక్షను అంతం చేస్తుందా లేదా దానిని మరింత పెంచుతుందా అనే దానిపై వివాదం ఉంది.
కుల నిర్మూలన కోసం దీనికి వ్యతిరేకంగా రాజ్యాంగ ప్రతులను16 వేల వేలమందితో తగులబెట్టారు. ఆయన బ్రాహ్మణేతరులకు ద్రవిడ జాతి అనే పేరు పెట్టారు.ద్రావిడ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత ఆయన బ్రాహ్మణ వ్యతిరేక సంస్థ అయిన సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ (జస్టిస్ పార్టీ) అధ్యక్షుడయ్యారు.
మత, కుల వాదనలకు మూఢనమ్మకాలకు సరైన విరుగుడు శాస్త్రీయ దృక్పథమే.
శాస్త్రీయ దృక్పథం అంటే ప్రజలకు అవసరమైన రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక పోరాటాల మార్గాన్ని ఎంచుకునే ఆలోచనను అందించడం. ప్రత్యామ్నాయ జీవన విధానంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయాలను అణగారిన వర్గాలకు అధికారం పొందడానికి సరైన చూపును అందించడం.
ఈ దృక్పథం తోనే ఆయన 1944లో ఆయన స్వాభిమాన ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 'ద్రావిడ కజగం' ఏర్పాటు చేశారు. గత అర్ధ శతాబ్ధ కాలంగా తమిళనాడును పాలిస్తున్న పార్టీలన్నీ దాని నుంచి పుట్టినవే. స్వాభిమాన ఉద్యమానికి లక్ష్యాలను ప్రకటించారు. అవి...
* దేవునిపై నమ్మకాన్ని నిర్మూలించాలి.
* మతాన్ని నిర్మూలించాలి.
* కాంగ్రెస్ నిర్మూలింపబడాలి.
* బ్రాహ్మణిజం నిర్మూలింపబడాలి.
* కులవ్యవస్థ పేరుతో విధించిన నిషేధాలు నశించాలి. చాతుర్వర్ణ వ్యవస్థ , ఐదవదైన పంచమ విభజన హేతు విరుద్దమైనవి.
* అంటరానితనం ఒక నేరంగా ప్రకటించబడాలి.
* ఏ రహదారిలో నైనా నడవటానికి , ఏచెరువునైనా , నూతినైనా , సత్రమునైనా , అవి ఎక్కడున్నప్పటికీ ఉపయోగించుకునే హక్కు అందరికీ ఉండాలి.
* కులం గుర్తును సూచిస్తున్న నామాలను నుదిటిపై గానీ , దేహంపై గానీ రాసుకోవడం మానుకోవాలి.
* దేవాలయాలకు ప్రజలు ధనాన్ని వెచ్చింప కూడదు. పూజారులను ఏవిషయంలోనూ గుర్తించకూడదు. కొత్తగా దేవాలయాలు, మఠాలు, సత్రాలు , వేదపాఠశాలలు నిర్మించకుండా ప్రజలను చైతన్య పరచాలి.
* సంస్కృత భాష ఉపయోగాన్ని నిరోధించాలి.పేర్ల చివరన కులం పేర్లను వాడరాదు.
పెరియార్ ప్రజలను చైతన్యనరచడానికి 'కుడిఅరసు' పత్రికను ప్రారంభించారు. పెరియార్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంలో ముఖ్యమైనది సమధర్మం. ఇది పెరియార్ రూపొందించిన నియోలాజిజం అని AR వెంకటాచలపతి పేర్కొన్నారు. మను ధర్మం, వర్ణాశ్రమ ధర్మం, స్త్రీ ధర్మం మొదలైన వాటికి విరుద్ధంగా అందరి సమానత్వంపై ఆధారపడిన సామ్యవాద కల్పనను సూచించడానికి పెరియార్ సమధర్మం అనే పదాన్ని ఉపయోగించారు, ఇది హెచ్చుతగ్గుల్లేని సామాజిక స్థితిని సూచిస్తుంది . ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండే జీవన విధానాన్ని కూడా ఇది సూచిస్తుంది. సనాతనంగా ఉన్న వర్ణ వ్యవస్థను లింగ వివక్షను కీర్తించే సనాతన ధర్మానికి భిన్నంగా సమధర్మం నిలుస్తుంది.
పిరియర్ చేపట్టిన ఉద్యమం అనాటి కవులను ప్రభావితం చేసింది. సుబ్రమణ్య భారతి భారతి దాసన్ వంటి కవులు అభ్యుదయ సాహిత్యాన్ని సృష్టించారు. తమిళ విప్లవ కవి భారతి దాసన్ పెరియార్ భావజాలంతో అనేక కవితలు కూడా రాశారు. ఆయన ఒకచోట ఇలా అంటాడు.
దిగజార్చే ఆస్తికత్వం ఛాందసత్వం సుఖమా
జగమంతా సమధర్మం స్థాపించడం సుఖమా
కులభేదాలతో సతమతం కావడం మంచిదా
ఆత్మగౌరవంతో ఉన్నతి చెందడం మంచిదా?
శాంతిలో లోకం వర్ధిల్లుట మంచిదా
మత భేదాలతో సతమతమగుట మంచిదా
మనుషుల్ని జాతులుగా విభజించుట సరియా
మానవులందరూ ఒక్క జాతిగా మనుట సరియా'?
స్వాభిమాన ఉద్యమం ప్రారంభించి చాలా మందికి కులాంతర వివాహాలు జరిపించారు. మహిళల స్వేచ్ఛ పట్ల పెరియార్ అభిప్రాయాలు విప్లవాత్మకమైనవి. స్త్రీలు అణచివేతకు గురికావడానికి ప్రధాన కారణం మత విశ్వాసాలు, దైవ భావాలు, పితృస్వామిక భావజాలమన్నాడు. వాటి నుండి బయట పడాలని వారిని చైతన్య వంతుల్ని చేశాడు. స్త్రీలు మానసిక బానిసత్వాన్ని వీడిన నాడే సమానత్వాన్ని సాధిస్తారని చెప్పారు. స్త్రీలకు స్వేచ్ఛనివ్వాలన్నారు. పురుషులకున్నంత స్వేచ్ఛను వారికి కల్పించాలన్నారు. స్త్రీలకు కూడా పురుషుల్లా ఆస్తి హక్కును, వారసత్వపు హక్కును కల్పించాలని, స్త్రీలు కూడా ఏ వృత్తినైనా చేపట్టి జీవించగల సమాన హక్కులను కల్పించాలని తీర్మానం చేశారు. 1930 లోనే మొదటి సారిగా గర్భ నిరోధం ఆవశ్యకతను ప్రభోదిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. గర్భ నిరోధం మూలంగా , కుటుంబ నియత్రణను పాటించడం మూలంగా స్త్రీ తన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా తన సుఖాన్ని, తన కుటుంబాన్ని కూడా పరిరక్షించు కోగలదని వివరించారు.
''ఎక్కడైనా పిల్లి నుండి ఎలుకకు స్వాతంత్య్రం దొరుకుతుందా? ఎక్కడైనా కోడి పిల్లలకు, గొర్రె పిల్లలకు నక్క నుండి స్వాతంత్ర్యం దొరుకుతుందా? యజమాని నుండి కార్మికులకు స్వాతంత్య్రం
దొరుకుతుందా? ఎక్కడైనా బ్రాహ్మణేతరులకు బ్రాహ్మణుల నుండి సమానత్వం దొరుకుతుందా? విదేశీయుల నుండి ఇండియన్లకు ఎక్కడైనా సుఖ సంపదలు దొరుకుతాయా? ఒకవేళ ఈ అద్భుతాలన్ని వాస్తవంగా జరిగినప్పటికీ స్త్రీలకు పురుషుల నుండి ఎన్నటికీ స్వాతంత్రం దొరకబోదు'' అన్నాడు పెరియార్. స్త్రీలు తమ సంకెళ్లను తామే తెంచుకోవాలన్నాడు. బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వంతో పాటు విద్యా ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేశారు.ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు.భాగస్వాములను ఎంచుకోవడానికి, విడిచిపెట్టడానికి మహిళలకు స్వేచ్ఛ ఉండాలన్నారు. పిల్లలను కనడమే మహిళల బాధ్యత కాకూడ దన్నారు. దానికి అతీతంగా పురోమించాలన్నారు. మంత్రాలు తంత్రాల మధ్య పురోహితులతో జరిపే సంప్రదాయ పెళ్లిళ్ల కు భిన్నంగా పూల దండలు మార్చుకుని పెళ్లి చేసుకొనే స్వాభిమాన పెళ్లి విధానాన్ని మొదలుపెట్టి దాన్ని అందరూ పాటించాలని కోరారు.
అసృశ్యత నిర్మూలన కోసం అనేక పోరాటాలు చేశారు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి గ్రంథాలను తగలబెట్టాలని పెరియార్ ప్రజలకు పిలుపునిచ్చాడు.
రావణ వధకు ధీటుగా రాముడు, సీత, లక్ష్మణ దిష్టి బొమ్మలను దహనం చేయడం, వినాయక విగ్రహాలు పగల గొట్టడంలో ప్రజలను పెద్ద ఎత్తున కదిలించారు. ''దేవుడు లేడు - దేవుడు లేనే లేడు'' అని తమిళనాడు అంతటా రాయడం, సభల ముందు ఈ నినాదాన్ని చేయడం సాంప్రదాయంగా పెట్టారు.
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని వైక్కోం అనే చిన్న పట్టణంలో ఒక పురాతనశివాలయం ఉంది. ఆలయ దర్శనానికి రావడానికి ఉన్న నాలుగు వీధులలో కొంత మంది శూద్రులు , అంటరాని కులస్తులు, నాడార్లు బీ.సి.లు చేనేత కులాలు వంటి కులాల వారు పోకూడదన్న నిబంధన ఉండేది.కుక్కలు పందులు మాత్రం ఆ దారిలో వెళ్ళొచ్చు. బ్రాహ్మణేతరులు కుక్క పంది కన్నా నీచమైన వారు. దళితులు తినే అన్నాన్ని పెంట (పెయ్య)అని అభివర్ణించిన బ్రాహ్మణ వాదంపై తిరుగుబాటు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు వైక్కోం దేవాలయ వీధుల్లో అణగారిన వర్గాల కులస్తులు నడిచేందుకు అనుమతించాలని 1924లో సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహం ఊపందుకోవడంతో సత్యాగ్రహులను ముఖ్యులందరని చెరసాలలో పెట్టింది ప్రభుత్వం. బయట సత్యాగ్రహాన్ని కొనసాగించగల నాయకుడు వేరెవరూ లేరు. దాంతో చెరలో వున్న నంబూద్రిపాద్ తన సహచరులతో చర్చించి తమిళనాడులో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈవీ రామస్వామిని సత్యాగ్రహానికి నాయకత్వం వహించమని ఒక రహస్య లేఖ ద్వారా పెరియార్ ని కోరారు. జ్వరంతో బాధ పడుతున్న పెరియార్ ఆ ఆహ్వానాన్ని అందుకొని వైక్కోం వెళ్లి ఆ పోరాటానికి నాయకత్వం వహించారు. గుడిలోకి ప్రవేసించే హక్కు కూడా ఉండాలని పెరియార్ పోరాటంచేస్తే, పెరియార్ ని గాంధీ కలసి సత్యాగ్రహాన్ని విడనాడాలని సూచించారు. దీనికి పెరియార్ స్పందిస్తూ,ఈ వీధుల్లో కుక్కలు , పందులు , గాడిదలు, పశువులు నడుస్తున్నాయ్ ఈ జంతువులన్నీ సత్యాగ్రహాలు చేసి సాధించుకున్నాయా అని ప్రశ్నించారు. సాటి మనుషులు వీధుల్లో నడవటానికి సత్యాగ్రహం చేస్తుంటే విరమించుకోమని చెప్పటం బాగుందా అంటూ గాంధీని నిలదీశారు. దీంతో చేసేదేమిలేక గాంధీ వెనుదిరిగిపోయారు. ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో 1925 లో దేవాలయ వీధులను అందరికీ తెరిచి ఉంచారు.
బ్రాహ్మణుల పట్ల గౌరవ మర్యాదలను కింది కులాలలో నూరిపోసిన కుల వ్యవస్థని, వారి బానిస మనస్తత్వాన్ని సంఘ సంస్కరణ, శాస్త్రీయ విద్య మార్చివేస్తాయని పెరియార్ చెప్పేవారు.
1930లో దేవాలయాల్లో రెండు వేల సంవత్సరాలకు పైగా ఒక కులానికి చెందిన స్త్రీలను దేవదాసీలుగా మార్చి వ్యభిచార వృత్తిలోకి దించడాన్ని వ్యతిరేకిస్తూ పెరియార్ పోరాటం చేశారు. ఈదుష్ట సాంప్రదాయాన్ని నిషేధించాలని డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి మదరాసు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును జాతీయ కాంగ్రెసు ప్రముఖ నాయకులందరూ వ్యతిరేకించారు. దీనిపై ముత్తులక్ష్మి స్పందిస్తూ దేవదాసీ సాంప్రదాయం కొనసాగాలంటున్నవారు తమ కులపు స్త్రీలను దేవదాసీలుగా ఎన్నుకుంటే మంచిదంటూ సూచించారు. దాంతో బిల్లు నెగ్గింది.
1952 లో కమ్యూనిష్టు నేత సింగారవేలర్ తో కలసి దేశంలోని పలుచోట్ల ఎస్.ఆర్.ఎం.యు. రైల్వే కార్మిక సంఘాల్ని పెరియార్ స్థాపించారు. ద్రవిడ వ్యవసాయ కూలీల సంఘాలను నెలకొల్పారు. పెరియార్ దళితులను ఆది ద్రావిడులుగా మూలవాసులుగా పేర్కొనేవారు.
సోషలిస్టు సిద్దాంతాలను, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయడానికి యూరప్ పర్యటన చేశాడు పెరియార్. 1931లో మాస్కో లో కమ్యూనిష్టు ప్రభుత్వ అతిథిగా వెళ్లి లెనిన్ రూపొందించిన మతం వ్యతిరేకమ్యూజియాన్ని సందర్శించారు. కమ్యూనిస్టులు కోరుకునే వర్గ రహిత సమాజానికి, కుల రహిత సమాజానికి దగ్గర పోలికలు ఉన్నాయని అర్థం చేసుకున్నారు.కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులై, కమ్యూనిస్టు మేనిఫెస్టో మొదటి తమిళ అనువాదాన్ని ప్రచురించారు.
సమాజంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కావాలని ఆయన తీవ్రంగా పోరాడారు. 1937లో తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడాన్ని పెరియార్ వ్యతిరేకించారు.
1946 లో నలుపుగుడ్డపై ఎర్రచుక్కతో ద్రవిడ కళగం పతాకం రూపొందించారు. 1948లో నల్లచొక్కా, నల్లచీరల దళాన్ని ప్రభుత్వం నిషేధించింది. అనేక నిర్భంధాల మధ్య కూడా పెరియార్ ప్రచారాన్ని కొనసాగించారు.
''దేవుడి పేరిట బ్రాహ్మణులు మిమ్మల్ని పిచ్చివాళ్ళను చేస్తున్నారు. మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసి, వారు మాత్రం సుఖంగా జీవిస్తున్నారు. మీ పక్షాన నిలబడి దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు నటిస్తూ, దేవునికి బ్రోకరుగా ఉండే ఈ పూజారి వ్యవస్థను ఏమాత్రం నమ్మగూడదని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. " అని ప్రజలను హెచ్చరించారు. ప్రాచీన కాలంలో చార్వాకులు చెప్పిన విషయాన్ని మళ్లీ పెరియార్ రామస్వామి ప్రజల ముందు పెట్టాడు."దేవుడి పట్ల సమర్పణ భావం లేకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. కాని, నైతికత లేకపోతే.. అన్నీ కోల్పోయినట్లే. నైతికత అనేది ప్రజల ఆస్థి"- అని అన్నారు పెరియార్ రామస్వామి.
తమిళనాడులోని శ్రీరంగ పట్నంలో పెరియార్ విగ్రహం కింద "దేవుణ్ణి మరిచి మనిషికి కృతజ్ఞతలు చెప్పు. దేవుడు లేడు. దేవుడు అసలే లేడు!! సమర్పణ భావం వ్యక్తిగత విషయం. నైతికత ప్రజల సొత్తు!" అని ఆయన ఇచ్చిన సందేశం చెక్కుచెదరకుండా ఉంది.
ఆయన జన్మదినాన్ని 2021 నుండి తమిళనాడు ప్రభుత్వం సామాజిక న్యాయదినంగా నిర్వహిస్తున్నారు.
Sources
Wikipedia
పెరియార్ సమగ్ర చరిత్ర __డాక్టర్ దేవరాజు మహారాజు
సమధర్మం: భారతదేశం కోసం పెరియార్ ఆలోచన__కార్తీక్ రామ్ మనోహరన్
(Sep 21, 2023 -ది హిందూ)
___పిళ్లా కుమారస్వామి,9490122229

Comments
Post a Comment