ఏది సనాతన ధర్మం?


 హిందూ ధర్మం  సనాతన ధర్మమని
చెపుతుంటారు.ఇది నిజమేనా?


     బుద్దుడు చెప్పిన బోధనలను బౌద్దధమ్మం అంటారు.క్రి.పూ.2500 సంవత్సరాల సంబంధించిన అశోకుడి శిలాశాసనాల పై మరియు స్థంబాలపై  ధమ్మం అనే పదం తప్ప, ధర్మం అనే పదం ఏ పురాణాలలో లేదు.సార్వత్రిక లక్షణాలు గల ధర్మం అంటే ఆయా వస్తువుకున్న లక్షణం అని అర్థం.
     అగ్ని కాలుస్తుంది, మంచు చల్లబరుస్తుంది. అవి సర్వ సామాన్యమైన ప్రకృతి ధర్మాలు. తను కలక, మిగిలిన వాటిని కాల్చకపోతే అది ఆగ్నే కాదు. అగ్ని అయితే తను ఇతరులను, పరిసరాలను కాల్చే లక్షణాలు దానికి ఉండితీరాలి. అలాగే వెలుతురూ, వేడినివ్వడమే సూర్యుని లక్షణం, వాటినివ్వకపోతే అది సూర్యుడే కాదు.అలాగే మృదువైన చల్లని కాంతి నివ్వడమే చంద్రుని యొక్క ధర్మం. అవిధంగా చేయకపోతే అది చంద్రుడే కాదు.
     మనసులో నిర్మల భావాలు ఉత్పనమైనప్పుడు దుర్భావనలు వాటంతట అవే సమసి పోతాయి. పరిశుద్ధమైనప్పుడు అది ప్రేమ, దయ, సమభావము, సానుభూతులతో నిండి ఆనందమాయమౌతుంది. ఇది నిర్మమైన మనసు ధర్మం.  ఈ లక్షణం ఏ మతం వాడిదైనా కావచ్చు, ఏ కులం వాడిదైనా కావచ్చు, ఏ దేశం వాడిదైనా కావచ్చు. వీటివల్ల ఏ మాత్రం భేదం ఉండదు. ఆ ప్రకారమే ఇవి శాంతిని, సుఖాన్ని, సంతోషాన్ని అందిస్తాయి. మనం ఏ తత్వాన్ని నమ్మినా, మన మనసులోని మంచి, చెడు గుణాల సహజ ధర్మం మారదు.అవి వాటి ఫలితాలనిస్తూనే ఉంటాయి. ఇదే ప్రకృతి లోని సామాజక ధర్మం

క్రి.శ. నాలుగవ శతాబ్దంలో హుణుల రూపంలో ఉన్న వైదికులు తక్షశీల విద్యాలయాన్ని ధ్వంసం చేశారు.ఇలా అనేక కుట్రలు, కుతంత్రాలతో శ్రమణ సంస్కృతి మీద దాడులు జరుపుతూ బౌద్ద విద్యాలయాలను ఆక్రమిస్తూ వైదిక ధర్మం జీవంపోసుకుంటూ వచ్చింది.
       ధర్మం అనే పదం వచ్చింది క్రీ.శ. పదవ శతాబ్దం తర్వాత. ఇది సంస్కృత భాష పదం. దీని లిపి దేవనాగరిలిపి, దేవనాగరిలిపి ఉత్తర భారత దేశంలో ఇది 1వ నుండి 4వ శతాబ్దం CE వరకు  అభివృద్ధి చేయబడింది.క్రి.శ. 5 వ శతాబ్దం తర్వాత పాకృతభాషను సంస్కరించి సంస్కృత భాషను నిర్మాణం చేస్తు వచ్చారు. 7వ శతాబ్దం CE నాటికి సాధారణ ఉపయోగంలో ఉంది. భాషవిజ్జాన శాస్త్రం మరియు పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం దేవనాగరిలిపి క్రి.శ. 7వ శతాబ్దం తర్వాత వచ్చింది. అంతకు ముందు ధర్మం అనే పదం లేదు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ప్రాకృత భాషకు చెందిన  ధమ్మం అనే పదం ప్రాచీనమైనది. దీని లిపి ధమ్మ లిపి. ( చరిత్రకారుల ప్రకారం  బ్రహ్మీ లిపి) ధమ్మలిపి ఎంత ప్రాచీనమైనదంటే సింధులోయనాగరికతలో  లభించిన చిత్రలిపిలోని 10 అక్షరాలు ధమ్మలిపిలోపిలోని 10 అక్షరాలు సమానంగా ఉన్నాయి. భాషవిజ్జాన శాస్త్రం ప్రకారం సిందులోయనాగరికతలోని చిత్రలిపి తర్వాత కాలంలో ధమ్మలిపిగా అభివృద్ది చెందింది. అంటే ధమ్మలిపి క్రి.పూ. 5,000 సంవత్సరాలకు సంబంధించింది.
        ధర్మ సనాతన అనే సాంప్రదాయం సంస్కృత   సాహిత్యంలో కనిపిస్తుంది.ఉదాహరణకు మనుస్మృతి  లో, భాగవతంలో.సనాతన’ అంటే, శాశ్వతమైనదని అర్ధం. శాశ్వతం అంటే ఎప్పటికీ ఉండే సత్యం అని అర్ధం.. ధర్మం అంటే, నియమం. ధర్మం అంటే, మతం కాదు. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. ఏ ధర్మం శాశ్వతంగా ఉండదు. అది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. సింధు నాగరికత కాలంలో,తదనంతరం కాలంలో ఎలాంటి కులాలు లేవు.కులధర్మం పాటించడానికి ధర్మం అన్నారు. ధర్మాన్ని అతిక్రమించడం అంటే కుల కట్టుబాట్లు తప్పడం.బుద్దుని తరువాత మానవ ధర్మాలు వచ్చాయి. కరుణ,ప్రేమ,దయ గుణాలను పెంపొందించే ధర్మాలు వచ్చాయి. ఆ తర్వాత హిందూ ధర్మం మారింది. ఇతరులకు మేలు చేయడం, ప్రకృతి ని రక్షించడం, మొదలైనవన్నీ ధర్మం అన్నారు.ఇలా కాలక్రమంలో ధర్మాలు మారాయి.సనాతనం అంటూ ఏదీ లేదు. అయితే సంప్రదాయ వాదులు మాత్రం కొత్త వాటిని కూడా సనాతనం పేరుతో సనాతనధర్మం అంటూ చెపుతూ వస్తున్నారు. 
     1873లో సనాతన ధర్మ రక్షణ సభ ఏర్పడింది. వారు సనాతన మూఢ విశ్వాసాలను విడిచి, మంచి  వాటినే ఆధునికంగా సనాతనం పేరుతో  ప్రచారం చేయాలని భావించింది.   
    దేశాన్ని దేశమాతగా పూజించడం సనాతన ధర్మంమని చెపుతారు.రక్షించేది, అండగా నిలిచేది , పోషించేది , భరించేది ఏదో అదే ధర్మమన్నారు.పితృ ఋణం - తల్లిదండ్రులకు రుణపడి ఉండటం ఒక ధర్మం అన్నారు. .మనం చేస్తున్న సత్కార్యాల ద్వారా మాత్రమే ఈ రుణం తీరుతుందన్నారు.విశ్వంలో నున్న గ్రహాలు , సౌర మండలము, భూమిలోపల, వెలుపల ఆశ్రయించుకొని వున్న జీవజాలము, నీరు గాలి ,  ఒక క్రమ పద్ధతిలో నడిపింపబడుతున్న క్లిష్టమైన విధానం, అంతేకాదు మానవులు మార్చుటకు ప్రయత్నించ కూడని విశ్వ వ్యవస్థ , దీన్ని రుతమన్నారు.
భారతీయ  సంస్కృతి -హక్కులు, చట్టాల కన్నా ధర్మంతో కూడిన విధినిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.ఇవన్నీ  ధర్మానికి సంబంధించిన ఆధునిక భావాలు.
        మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ధర్మానికి ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. 

___ కుమారస్వామి,9490122229


 

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం