బ్రహ్మ సమాజం తాత్వికత



                        Raja ramamohan Roy,statue in London 

_బ్రహ్మ సమాజం తాత్వికత_

         భారత దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాణం పోసింది బ్రహ్మ సమాజం. ఇది  భారతదేశం లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలకు నడుం కట్టింది. ఆర్య సమాజం కన్నా ముందే బ్రహ్మ సమాజం పుట్టింది.ఆంగ్ల విద్య అభ్యసించిన వారికి ప్రపంచ సాహిత్యం అందుబాటులోకి వచ్చింది. దాంతో హిందూ మతం లోని లోపాలు గుర్తించగలిగారు. అంతే గాక సూఫీ మతం, క్రైస్తవ మతాల ప్రభావాల వలన హిందూ మతాన్ని సంస్కరించు కావాలన్న ధోరణులు మొదలయ్యాయి.భారత దేశానికి వేగుచుక్కలా బెంగాల్లో రామ్మోహన్ రాయ్, ద్వారకా నాథ్ టాగూర్ తో కలిసి 20.8.1828 లోబ్రహ్మ సమాజాన్ని కలకత్తాలో ఏర్పరచాడు. దీని ప్రభావం భారతదేశమంతా విస్తరించింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై. వీరేశలింగం దాన్ని అందుకున్నాడు. మధ్యయుగాలలో తలెత్తిన ఛాందసవాదాలను, మూడనమ్మకాలను, తుత్తునియలు చేస్తూ అనేక సంస్కరణలు మొదలు పెట్టాడు రాయ్. అందుకే రామమోహన్ రాయ్ ని ఆధునిక భారత దేశ పితామహునిగా చరిత్రకారులు కీర్తించారు. దీనికి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కూడా వెన్నుదన్నుగా నిలిచింది.బెంగాల్ లోనే గాక, పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లోనూ దీని ప్రభావం విస్తరించింది.
              బ్రహ్మసమాజం మొదటి సమావేశం, ఉత్తర కలకత్తాలోని ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగింది. ఈ దినాన్ని, భద్రోత్సబ్ ( ভাদ্রোৎসব ) లేదా తెలుగులో "భద్రోత్సవం" అని పిలుస్తారు.

బ్రహ్మసమాజ ధర్మాలు

బహుదేవతారాధన త్యజించడం.
కర్మ , పునర్జన్మ సిద్ధాంతాలను నమ్మడం వ్యక్తిగత ఇష్టం.
మనుషులను ప్రేమించమని చెప్పింది.   
జంతుబలిని, నైవేద్యాలను ఆపమని ప్రబోధించింది. 
దాతృత్వం, నైతికత, దైవభక్తి, పరోపకారం, ధర్మం ప్రతి వ్యక్తి అలవరుచుకోవాలని చెప్పింది.
వ్యక్తిగత, సామాజిక జీవితాలలో సాదాజీవనం, సచ్ఛీలత కలిగి ఉండాలని చెప్పింది.
అన్ని మతాలు  ఐక్యత, సామరస్యాన్ని బలోపేతం చేయడానికి ఇది ముందుకు వచ్చింది.
కుల వ్యవస్థ, బహుభార్యాత్వం, బాల్య వివాహాలు, శిశుహత్య, అంటరానితనం, పర్దా వ్యవస్థకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించింది.
కట్నకానుకలను రూపుమాపడం.
స్త్రీ విద్యకు ప్రాధాన్యత.
వితంతువుల పునర్వివాహాలు.
విద్యావిధానాలలో సంస్కరణలు తీసుకురావడం.
సతీసహగమనాన్ని రూపుమాపటం.
జ్ఞానాన్ని విశ్వవ్యాపితం చేయడం.
చట్టపరమైన సంస్కరణలు తీసుకురావడం.
లంచగొండితనం , త్రాగుడు, దేవదాసి విధానం, రూపుమాపడం.
హరిజన ఉద్ధరణ, వేశ్యా వృత్తి నిర్మూలనకు కృషి చేయడం.
        బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1712లో బెంగాల్లోని బర్వాన్ జిల్లా రాదానగర్లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం. హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తికి, స్త్రీ జనోద్దరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో  సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు.. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి రాజు రామ్మోహన్ రాయ్ చేశారు. స్త్రీ పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.

         దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు.  బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్యంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు. రామ్మోహన్ రాయ్ కి 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు.  అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.
        'రాజా' అనంతరం  ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్లు  పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు.  తమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను నడిపారు.   కేశవచంద్రసేన్ బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. కేశవచంద్ర సేన్ బ్రహ్మ సమాజాన్ని దేశమంతా  విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్ధనా సమాజ్ లు ఏర్పాటయ్యాయి..
           కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం 'ఆది బ్రహ్మసమాజ్'గా , కేశవచంద్ర సేన్ వర్గం 'బ్రహ్మ సమాజ్ ఆప్ ఇండియా (నవ విధాన్)"గా విడిపోయాయి. 1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లన్డ్ వెళ్ళివచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ ఆసోసియేషన్ ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి: స్త్రీల అభ్యున్నతి విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాదాన్యం ఇచ్చింది. కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బీహార్ రాజుతో ఇచ్చి బాల్య వివాహం చేశారు.  ఇది పూర్తిగా బ్రహ్మసమాజ పద్ధతులకు వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది.ఆనందమోహన్ బోన్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. 
            బెంగాల్‌లో శశిపాద బెనర్జీ 1873లో సాధారణ ధర్మసభ అనే  సంఘాన్ని స్థాపించాడు. ఈయన  బారానగర్‌లో బాలికల పాఠశాల, కలకత్తా మహిళా విశ్వ విద్యాలయం, కార్మిక పాఠశాల స్థాపించాడు.'శ్రమ జీవని' అనే  కార్మిక పత్రికను నడిపాడు.1887లో కలకత్తాలో ప్రపథమ వితంతు శరణాలయం స్థాపించాడు.
ఈయన మొదటి భార్య మరణించిన తర్వాత ఒక వితంతువును పెండ్లాడాడు.
        దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు,కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. 
         హైదరాబాద్‌లో  బ్రహ్మ సమాజం 1914లో ప్రారంభమైన తరువాత అనేక సంస్కరణలను ప్రారంభించింది. అది పత్రికాస్వేచ్చను ప్రబోధించింది. భాగ్యరెడ్డివర్మ ఆధ్వర్యంలో 14 మంది చేత బ్రహ్మసమాజ దీక్షను చేపట్టారు. వీరి ఆధ్వర్యంలో 
 బ్రహ్మ సమాజ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్న వారికి చట్టబద్ధత హైదరాబాద్‌ ప్రభుత్వం కల్పించింది.హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజ వ్యాప్తికి బి.రామయ్య, ఎన్.ఆర్‌.ముకుందస్వామి, హెచ్‌.ఎస్‌.వెంకట్రామయ్య, వల్తాటి శేషయ్య, జె.ఎస్‌.ముత్తయ్య మొదలగు వారు కృషి చేశారు. అయితే 
తెలంగాణలో బ్రహ్మసమాజ ప్రభావం కంటే ఆర్య సమాజ ప్రభావం ఎక్కువ గా ఉంది.
    1878లో మన్నవ బుచ్చయ్య పంతులు ఏపీలో బ్రహ్మ సమాజం గురించి ప్రచారం చేశారు.రాజమండ్రి, మచిలీపట్నం, బాపట్ల ఇవి బ్రహ్మసమాజ కేంద్ర ప్రాంతాలయ్యాయి.రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పిఠాపురం రాజా వీరిరువులు పండిత శివనాథ శాస్త్రితో ప్రభావితులయ్యారు.రాజా గణపతిరావు అను భూస్వామి 'బ్రహ్మసమాజ భవనాన్ని' నిర్మించాడు. ఈయన శిష్యుడే రఘుపతి వెంకట రత్నం నాయుడు.బ్రహ్మసమాజ ఉద్యమానికి కేంద్రం- కాకినాడలోని బ్రహ్మ మందిరం, అనాథ శరణాలయం. కందుకూరి వీరేశలింగంగారు హితకారిని స్థాపించి   మొట్టమొదటి వితంతు వివాహం జరిపించాడు. స్త్రీ పురుష సమానత్వం కోసం మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు. వితంతు వివాహాలు జరిపించాడు. తెలుగులో తొలి నవల, తొలి ప్రహసనం,  మొదటి స్వీయ చరిత్ర ను, తెలుగుకవుల జీవిత చరిత్ర ను రాసిన మొదటి రచయితగా తెలుగు సాహితీ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారు . విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత కూడా.ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా, నవయుగ వైతాళికుడుగా, హేతువాదిగా ప్రసిద్ధి చెందాడు.

       1864వ సంవత్సరం వేద సమాజాన్ని రాజగోపాలాచారి , సుబ్బరాయులు శెట్టి (మద్రాస్‌లో) స్థాపించారు. వీరు కేశవ చంద్రసేన్‌ ఉపన్యాసాలకు ప్రేరణ పొంది వేద సమాజాన్ని దక్షిణ భారతదేశ బ్రహ్మసమాజంగా  మార్చారు. రామస్వామి నాయకర్ తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపాడు.జస్టిస్‌ పార్టీలో చేరాడు. బ్రాహ్మణాధిక్యతను నిరసించాడు.ఈయన భార్య నాగమ్మళ్‌. ఈమె తమిళనాడులో విమోచనోద్యమం నడిపింది.

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం