ఆర్. ఎస్. ఎస్. తాత్విక చింతన


స్వాతంత్ర్య పోరాటానికి ఎలాంటి మద్దతు ఇవ్వకపోగా, చివరకి గాంధీ గారి మరణానికి కారణం అయ్యారు. గాంధీ గారి మరణం తర్వాత, RSS పై ప్రభుత్వమ్ నిషేధం విధించింది. ఆ నిషేధం ఎత్తివేయటానికి, RSS ఇకపై రాజకీయాల్లో పాల్గొనమనీ, సాంస్కృతిక సంస్థ గానే ఉంటామనీ, అప్పటి ఉప ప్రధాని పటేల్ గారికి వాగ్దానం చేశారు. తర్వాత కాలంలో ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు.

ఇక్కడ కాంగ్రెస్ యొక్క ముందుచూపు లేని రాజకీయాన్ని, ముస్లిం appeasement గా చిత్రీకరిస్తూ హిందూ మహాసభ మరియు rss ఆడిన రాజకీయం చూస్తే నేటికీ అది కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ 100 యేళ్లు అయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు దీని నించి. 

Lucknow pact లో ముస్లిం లీగ్ ని జాతీయపోరాటం లో involve చెయ్యడానికి communal electorate కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అదే విధంగా 1931లో INC కరాచీ సమావేశంలో, ప్రాథమిక హక్కుల తీర్మానంలో, మైనారిటీ లకు ప్రత్యేక హక్కులని కల్పించారు. ఇది సహజంగానే RSS కు నచ్చలేదు. ఇక RSS లౌకిక వాదం కి అర్థమే తెలియదు. అప్పట్లోనే ఆ కల్లోలానికి వాళ్ళు వెతికినా మార్గం ఆవు తల్లి. ముస్లిం లీగ్ కి వ్యతిరేకంగా cow slaughter రాజకీయాలు ఉధృతం చేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. మాంసాహార అలవాట్ల మీద ఉదారభావం కల సావర్కర్ దీనికి మద్దతు తెలపటం! దీనికి కాంగ్రెస్ పూర్తిమద్దతు లభించలేదు. దీనితో RSS కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి మరియు ముస్లింలను appease చేస్తూ ఉంటుంది అన్న భావనను క్రమేపి ప్రజల మీద రుద్దడం ప్రారంభించారు.

కాంగ్రెస్ యొక్క ముందుచూపు లేని రాజకీయం, ఖిలాఫత్ movement కి మద్దతు, communal electorate కి మద్దతు తెలపడం లాంటి చర్యలను, హిందు వ్యతిరేక చర్యలుగా సంఘ్ పరివార్ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఈ cow politics నేడు cow belt states లో విజయవంతంగా ఉధృతంగా తీసుకు వెళ్లారు. అదే politicsని మిగతా రాష్ట్రాల్లో బీఫ్ ban, గోరక్షక దళాల పేరుతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
సావర్కర్, హెగ్డేవార్, గొల్వల్కర్ లు hindu masculinity మరియు societal militarisation తమ సిద్ధాంతాలుగా చేసుకుని, మాతృభూమిని "పితృభూమి"గా మార్చి, భారతదేశంలో నివసించే వారందరూ దీనిని పుణ్యభూమిగా భావించి, హిందూ జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అని ప్రతిపాదించారు. దీనితో ముస్లింలు, క్రైస్తవులు ద్వితీయశ్రేణి పౌరులైపోయారు. ఈ వాదం లౌకికవాదానికి మరియు ప్రజాస్వామ్య విలువలకీ పూర్తి తిలోదకాలు ఇస్తుంది లేదా ఇచ్చేసింది అనుకోవాలి

RSS ప్రాచీన భారతీయ సంస్కృతి ని glorify చేస్తూ, మధ్యయుగ చరిత్రని తృణీకరించటం, నేటి సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతోందో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము
RSS తన హిందుత్వ నినాదాన్ని రెండు విధాలుగా జనంలోకి తీసుకెళ్లాలి అని భావించింది. అందులో మొదటిది మిలటరీ తరహా పరిష్కారం, అనగా తమ సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్న వారిని చంపడం. ఆలా వారికి మొదట బలి అయ్యింది సాక్షాత్తు గాంధీ గారు


దీని తర్వాత RSS మీద వ్యతిరేక భావం పెరగడంతో వారు రెండవ పద్ధతి ఎంచుకున్నారు. అది చరిత్రను మార్చి రాయడం. అందుకు ఉదాహరణలు:
* మహారాణా ప్రతాప్ హల్దీ ఘాట్ లో గెలుపు, 
* అక్బర్ లాంటి చక్రవర్తిని కూడా పూర్తి హిందు వ్యతిరేకి గా చిత్రీకరించడం.
* లౌకికవాదానికీ, ఆధునిక భారతానికి ప్రతీక అయిన నెహ్రూ వ్యక్తిత్వాన్ని కించపరచటం.  నెహ్రూకీ, పటేల్ కూ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పెద్దవి చేసి, పటేల్ ని గొప్పగా చూపి, ఆయనని తమ సిద్ధాంతాలకి ప్రతినిధిగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి, పటేల్ భావజాలనికీ, RSS భావజాలని కి అసల సంబంధం వెతికినా కనపడదు.
 ప్రాచీన భారతాన్ని glorify చేయటంలో భాగంగా "అన్నీ మా పూర్వీకులు తెలుసు" అనే భావజాలనికి పునాది వేశారు. అందుకు ఉదాహరణలు:
* ఆటంబాంబ్ కనిపెట్టడానికి కారణం భగవద్గీత!!, 
* కురుక్షేత్రం లో అణుయుద్ధం..
* గణేశా ప్లాస్టిక్ సర్జరీ,
* ప్రాచీన విమానాలు,
* యోగిక్ ఫార్మింగ్,
* రామసేతువులో ఇంజనీరింగ్,
* భారతం లో ఇంటర్నెట్,
* వేదాల్లో సైన్స్, 
* డార్విన్ సిద్ధాంతం నిరాకరణ, అదే నిజం అయితే కోతులు ఇంకా మనుషులుగా మారలేదు అనడం. ఇదంతా వారిలో పెరుగుతున్న సాంస్కృతిక అహంకారానికి నిదర్శనం.
Evidence based చరిత్రని మాత్రమే నమ్మాలి. వేదాలు అధ్యయనం చెయ్యాలి కానీ, దానిలో లేని సైన్స్ ని వెదకమని దేశం గర్వించదగ్గ కళాశాలను కోరడం అవివేకం!

Hindutwa అనేది దేశాన్ని హిందూ దేశంగా మార్చటమే లక్ష్యంగా పెట్టుకున్న పొలిటికల్ ఫిలాసఫీ. ఈ దేశం పూర్తిగా హిందువులకి మాత్రమే మరియు మిగిలిన వారందరు బయటవాళ్ళు లేదా మనల్ని దోచుకోవటానికి వచ్చిన వాళ్ళు అన్నది hindutwa యొక్క basic principle. విచిత్రం ఏమిటంటే, సావర్కర్ చిత్రపటాన్ని, ఆయన తీవ్రంగా ద్వేషించిన ముస్లిం సమాజం నించి వచ్చిన, ఆ నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేత, పార్లిమెంట్ సెంట్రల్ హాల్ లో ఆవిష్కరణ చేయించడం.

ఇవ్వాళ దేశంలో బీజేపీ లేదా సంఘ్ పరివార్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని anti national అనడం మనం చూస్తున్నాము. ఒకసారి మీరు గమనించి విశ్లేషిస్తే RSS లేదా సావర్కర్ కి ఏ కోశానా దేశభక్తి అన్నది మనకు కనిపించదు కేవలం హిందుత్వ నినాదం తప్ప. దానికోసం బ్రిటిషు వారి ముందు సాగిలాపడ్డారు.. ముస్లిం లీగ్ లాగ. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు సరికదా బ్రిటిషు వారికి యుద్దానికి కావాల్సిన సైనికులను పంపారు. మువ్వన్నెల జెండా మనకు వద్దు కేవలం కాషాయం కావాలి అన్న వీరి జాతీయవాదం ఏ పాటిదో మనం విశ్లేషించుకోవాలి. ద్విజాతి సిద్ధాంతం ప్రాచుర్యంలోకి రాక ముందు అంటే దాదాపు 16 సంవత్సరాల ముందే హిందూమహాసభ నినాదం కూడా ఇదే, మరి దేశం విభజన జరిగాక దీనికి గాంధీని బాధ్యుడు ని చేసిన సావర్కర్ ఆయనను చంపిన గోడ్సేల రెండు నాలికల సిద్ధాంతాలు చూస్తే జుగుప్స కలగక మానదు. ఇలాంటి భావాజాలం లో నుంచి పుట్టిన సంఘ్ పరివార్ తమకి తాముగా దేశభక్తులు అనుకోవడం లేదా nationalist అనుకోవడం హాస్యాస్పదం.ఆలోచించండి.


లాల్-బాల్-పాల్ త్రయంకి వారసుడు అనిపించుకోతగిన, మరియు వీర్ సావర్కార్ కన్నా ముందు హిందూ మహాసభ కి అధ్యక్షుడుగా ఉన్న మూంజే ప్రభావం హెడ్గేవార్ మీద చాలానే ఉంది అని చెప్పొచ్చు. హిందువులని ఐకమత్యంగా ఉంచాలన్నా, లేదా వారి అస్థిత్వాన్ని కాపాడుకోవాలన్నా మిలటరీ తరహా శిక్షణ అవసరం అని భావించిన వ్యక్తి మూంజే. ఆయన శిష్యరికంలో ఉన్న హెడ్గేవార్ పుణేలో తన మెట్రిక్యూలేషన్ పూర్తి అయ్యాక, తన గురువు సలహాతో 1910 లో, తన వైద్యవిద్యని అభ్యసించడానికి కలకత్తా ప్రయాణం అయ్యాడు. ఇక్కడ ఆయన మీద క్రాంతి దళ్ అనే ఒక అతివాద సంస్థ ప్రభావం ఉండేది. ఈ సంస్థ సాయుధపోరాటం చేస్తున్న విప్లవకారులకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తూండేది. తర్వాతి కాలంలో హెడ్గేవార్ అక్కడ చదువుని పూర్తి చేసి, 1915లో నాగపూర్లో తన వృత్తిని ప్రారంభించాడు. అక్కడ ఉండగానే కాంగ్రెస్ జాతీయవాద పోరాటంలో పాల్గొన్నాడు. కానీ 1920 నుండి అంటే ఖిలాఫత్ ఉద్యమ రోజుల నించి ఆయన కాంగ్రెస్ మీద కినుక వహించాడు. 1923 లో జరిగిన అల్లర్లతో తాను హిందూ మహాసభ ని మరియు కాంగ్రెస్ ని కాదని, హిందువులని ఐక్యంగా ఉంచాలి మరియు వారికి మిలిటరీ తరహా శిక్షణ కలిపించాలి అన్న ఉద్దేశంతో 1925 సావర్కర్ స్పూర్తితో తనకి తాను సర్వసేనానిగా ప్రకటించుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని స్థాపించాడు. ఈయన తర్వాతి రోజుల్లో మూంజే స్థాపించిన భోంసాలా మిలిటరీ స్కూల్ కి బోర్డు మెంబెర్ గా పని చేసేవాడు. అందులో చదివే విద్యార్థులు రాముడి భక్తులు కాబట్టి వారిని రామదండీస్ అని పిలవడం కూడా ఈయన హయాంలోనే ప్రారంభం అయ్యింది. (మాలెగావ్ పేలుళ్ల కేసులో ముద్దాయిగా జైలు శిక్ష అనుభవించిన పురోహిత్, ఈ పాఠశాల విద్యార్థి అవటం వల్ల, ఆ సమయంలో ఈ పాఠశాల వార్తల్లోకి కూడా ఎక్కింది). మరి ఇలాంటి అతివాద ఆలోచనలతో, కేవలం మతప్రాతిపదికన ఏర్పడిన RSSని కొందరితో హేతువాదిగా పిలవబడుతున్న సావర్కర్ ఎలా ప్రభావితం చేసాడు? అసలు సావర్కర్ నిజంగా హేతువాదేనా? ఆయన భావజాలం ఏమిటి? చాలా ప్రశ్నలు మనకు వస్తాయి  
అందుకు ఉదాహరణ, RSS ని స్థాపించిన హెడ్గేవార్ దాన్ని స్థాపించడానికి ముందు కాంగ్రెస్ తో కలిసి జాతీయపోరాటం చేసినపుడు, ఒక సంవత్సర కాలం జైల్ లో ఉన్నాడు. 1925 లో RSS ని స్థాపించాక, RSS స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదు. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు హెగ్డేవార్ తన కార్యకర్తలకు రాసిన లేఖ లో “సంఘ్ ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొనదు”, ఎవరైనా వ్యక్తిగతంగా పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. వీరి అతివాద భావజాలం చూసిన కాంగ్రెస్ తన సభ్యులని RSS మరియు ముస్లిం లీగ్ లో చేరడాన్ని నిషేదించింది. 

అదే విధంగా క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు RSS బ్రిటిషు వారికి తమ కార్యకర్తలు civic guards గా సేవలు అందిస్తారు అని ప్రతిపాదన చెయ్యడం చూస్తే వారి స్వతంత్ర కాంక్ష మరియు జాతీయవాద భావనలు మనకు తెలుస్తుంది. ముస్లిం లీగ్ లాగ RSS కూడా బ్రిటిషు వారికి వేలమందిని రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులుగా దగ్గరుండి చేర్చి మరియు జాతీయపోరాటాన్ని తన హిందుత్వ నినాదంతో పలచన చేసింది. మరీ సావర్కర్ కి దేనికి సంబంధం లేదు ఆయన RSS కాదు అని వాదించే మహానుభావుల బోసు అన్న మాటలు గుర్తు చేసుకోవాలి ఈ విషయం మీద.  సావర్కర్ ప్రభావం హెడ్గేవార్ మీదనే కాదు తర్వాత ఉన్న గోల్వాల్కర్ మీద కూడా ఉంది. అందుకే bose లాంటి నాయకులు సావర్కర్ నీ ఉద్దేశించి స్వాతంత్ర్య భారతం లో non entity అవుతారు అన్నారు. అయినా నేటి కాషాయ దండు సిగ్గు వదిలి బోసు భుజం మీద నిండి గాంధీ, నెహ్రూ లని విమర్శించే పనిలో ఉంటారు. వీళ్ళ దిగజారుడు రాజకీయాలు దారుణంగా ఉంటాయి అందుకే. 
ఆర్. ఎస్. ఎస్.

70 సంవత్సరాల్లో వాడు తన అధికారాన్ని స్థాపించడానికి ఈ ప్రపంచం ఊహించని శక్తిని నిర్మాణం చేశాడు. 
ఈ రోజు ఈ 70 సంవరాల్లో వాడు...
 వాడి సంస్థ యొక్క ఒకలక్ష శాఖలు నిర్మాణం చేశాడు,అందులో 15 కోట్ల స్వయంసైనికులు ఉన్నారు.
2 లక్షల సరస్వతి విధ్యాలయాలను నిర్మాణం చేశాడు, అందులో ఒక కోటి విద్యార్థులు , 5 లక్షల ఆచార్యులు ఉన్నారు.
15 కోట్ల ఏబీవీపీ సభ్యత్వం ఉంది
12 పత్రికలను నడుపుతున్నాడు.
15 కోట్ల బి.జే.పి. సభ్యత్వం ఉంది.
2 కోట్ల భారతీయ మజ్దూర్ యూనియన్ సభ్యత్వం ఉంది.
1 కోటి విశ్వహిందూ పరిషత్ సభ్యత్వం ఉంది .
30 లక్షల బజరంగ్ దళ్ సభ్యత్వం ఉంది.
7 లక్షల పూర్వసైనికుల సేవా పరిషత్ సభ్యత్వం ఉంది.
18 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది.
283 పార్లమెంట్ సభ్యులున్నారు.
58 రాజ్యసభ సభ్యులున్నారు.
దీనితో పాటు 
సంస్కృత్ భారతి ,
హిందు హెల్పలైన్,
వనవాసి కళ్యాణ ఆశ్రమం,
విజ్ఞాన భారతి ,
సేవా సహయోగ్ ,
రాష్ట్ర సేవికా సమితి ,
ఆరోగ్య భారతి ,
హిందు మున్నాని,
అఖిల భారతీయ సాహిత్య పరిషత్ ,
భారతీయ రైతు సంఘం ,
తరుణ్ భారత్ ,
ముస్లిం రాష్ట్రీయ మంచ్ ,
యస్సి , యస్టి , రిజర్వేషన్ రక్షణ సమితి ,
దీనదయాల్ పరిశోధన సంస్థ ,
భారత్ వికాస్ పరిషత్ ,
దృష్టి విజ్జాన్ ,
హిందు స్వయం సేవక్ లాంటి అనేక బలమైన సంస్థలు ఉన్నాయి.
ప్రత్యేకంగా సుమారు 80 లక్షలమంది ప్రచారక్ లు అంటే వాడి సిద్ధాంతం కొరకు , పెళ్ళిలు చేసుకోకుండా కేవలం సిద్ధాంతం కొరకు బ్రతికే మరియు ప్రాణాలు కూడా ఇచ్చే సైన్యం ఉంది.

*1931లో విప్లవ వీరుడు భగత్ సింగ్ తరపున పోరాడిన న్యాయవాది అసిఫ్ అలీ.*

*బ్రిటిష్ ప్రభుత్వం తరపు న్యాయవాది సూర్యనారాయణ మిక్ష్, RSS.*

భగత్ సింగ్ ను  శిక్షించటానికి నిరాకరించి తన జడ్జి పదవికి రాజీనామా చేసిన ముస్లిం జడ్జి అగా హైదర్ సాహెబ్ గారు...
భగత్ సింగ్ కు ఉరి శిక్ష  విధించిన RSS జడ్జి రాయ్ సాహెబ్ పండిట్  శ్రీ క్రిషన్ గారు.

#ఒక్క చరిత్ర...కొన్ని నిజాలు
#స్వాతంత్య్ర సంగ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర :
#సెప్టెంబరు 1925- ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన
#మార్చి 1930- ఉప్పు సత్యాగ్రహంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనదని తేల్చి చెప్పిన హెడ్గేవార్‌.
#డిసెంబరు 1940- బ్రిటిష్‌ వారి 'ఇంపీరియల్‌ సివిల్‌ గార్డ్‌' లో చేరి బ్రిటిష్‌ తొత్తుగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌.
#ఆగష్టు 1942- క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనబోమని స్పష్టం చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌.
#ఆగష్టు 1947- త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా గౌరవించం అని తేల్చి చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌.
జనవరి 1948- గాంధీజీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త గాడ్సే.
#ఫిబ్రవరి 1948- చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న సంస్థగా గుర్తించి ఆర్‌ఎస్‌ఎస్‌ పై నిషేధం.
#నవంబరు 1949- మనుస్మృతిని తప్పితే అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని ఒప్పుకోబోమంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటన
#ఫిబ్రవరి 1951- మహిళలకు సమాన హక్కులను ప్రసాదించే 'హిందూ కోడ్‌ బిల్‌' ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌.....

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం