వేద బ్రాహ్మణుల భోజనంలో "బీఫ్" ఉండేదని వారు నమ్మిన గ్రంథాల్లోనే రాశారు. కావాలంటే ఇదిగో రుజువులు చూడండి.. !



1 - “ అధో అన్నం వాయ్ గోవా” – "వాస్తావానికి గోవు మన ఆహారం “. – (ఐతరేయ బ్రహ్మణ్యం: - 111.9.8 )

2 - “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “ ( అశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 )

3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆంబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినాలి" 

(బృహదారణ్యకం )

4 – “ వయస్సు లో వున్న దూడని కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుని కానీ భుజించాలి “ (శంకారాచార్యులు)

5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. – ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం )

6- భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు (రామాయణం)

7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం )

8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వొచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం )

9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ( రుగ్వేదం 10 ,14 -1 )

10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు 
(అధర్వణ వేదం – 11.2 , 4 )

11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు. ( యాజ్ఞవల్క స్మృతి )

12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచిన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికి విస్మయం కలిగిస్తుంది, గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు. 
(వివేకానంద: ది కంప్లీట్ వర్క్స్ అఫ్ వివేకానంద, వాల్యూం నెంబర్ 3 పేజి 356 )

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం