EA జబ్బార్ తాత్వికత
EA జబ్బార్ భారతదేశం లోని కేరళ లోని మలప్పురంలో ఒక సనాతన ముస్లిం కుటుంబంలో 1 అక్టోబర్ 1956లో
జన్మించాడు.
ఇతను మానవతావాది, హేతువాది,వక్త , రచయిత . అతను అనేక హేతువాద సంస్థలలో క్రియాశీల సభ్యుడు. అతను కేరళ యుక్తివాది సంఘం ఉపాధ్యక్షుడు గా, మలప్పురం జిల్లా కార్యదర్శిగా గణనీయమైన కాలం పనిచేశాడు. అతను కేరళ యుక్తివాది సంఘం అధికారిక పత్రిక యుక్తిరేఖ అనే మాసపత్రికకు సంపాదకీయ మండలి సభ్యుడు కూడా . అతను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి,పదవీ విరమణ చేశాడు.
ఖురాన్ ను అధ్యయనం చేసిన తర్వాత
ఆయనలో తలెత్తిన ప్రశ్న లకు సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. దాంతో పదవ తరగతి లోనే ఇస్లాం మతంపై తన విశ్వాసాన్ని వదులుకున్నాడు . దీనిలో చాలా అసమానతలు , వైరుధ్యాలు ఉన్నాయని అతను భావించాడు. 1980 ప్రారంభంలో హేతువాది జోసెఫ్ ఎడమరుకు ఖురాన్: ఎ క్రిటికల్ స్టడీ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అది విస్తృత చర్చకు గురైంది.అందులో ఆయన పాల్గొన్నాడు . క్రమంగా అతను హేతువాది అయ్యారు. ఖురాన్ ను, ఇస్లాం ను విమర్శించారు. ఆ తర్వాత స్వేచ్ఛా లోచన , నాస్తికత్వం కోసం తన క్రియాశీలతను కొనసాగించాడు.
అతను పాఠశాల ఉపాధ్యాయునిగా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత కేరళలో వక్తగా మారాడు. అతను తన బ్లాగ్ లో, సోషల్ మీడియాలో వీడియోలు ప్రజల్లో మంచి స్పందన కలిగించాయి. కేరళలోని "స్వేచ్ఛా ఆలోచనాపరులు" చాలామంది అతను ఇస్లాంను విమర్శించే వీడియోలకు, పాడ్‌కాస్ట్‌లకు ఆకర్షితులయ్యారు. అతను సోషల్ మీడియాలో వేలాది మంది వీక్షకులను కలిగి ఉన్నారు. కేరళలోని చాలా మంది ఇస్లామిక్ పండితులతో వీటిపై వాదనలు చేశాడు.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
Comments
Post a Comment